Delicious food
-
రాగిముద్ద-నాటుకోడి పులుసు సూపర్ కాంబో
మిల్లెట్లతో చేసుకునే ఆరోగ్యకరమైన ఆహారం అనగానే ముందుగా గుర్తొచ్చే వాటిల్లో ఒకటి రాగులు. రాగులు లేదా ఫింగర్ మిల్లెట్స్‌తో రక రకాల వంటకాలను చేసుకోవచ్చు. ఇపుడు మాత్రం రాగిముద్దను ఎలా చేసుకోవాలో చూద్దాం.చిరుధాన్యాల్లో అతి ముఖ్యమైన రాగులలో కాల్షియం, ఐరన్, ప్రోటీన్, ఫైబర్, మినరల్స్, అయోడిన్ ఎక్కువగా లభిస్తాయి. కేలరీలు తక్కువ, ఫైబర్ ఎక్కువగా కాబట్టి బరువు తగ్గాలనుకునేవారికి ఇది మంచి ఆహారం. గ్లూటెన్ లోపంతో బాధపడేవారు దీన్ని తీసుకోవచ్చు. ఎముకలు, దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. చాలా సులభంగా జీర్ణమవుతుంది కూడా.కావలసిన పదార్థాలు : రాగుల పిండి - 2 కప్పులు, నెయ్యి - 1 టేబుల్ స్పూన్, ఉప్పు - రుచికి తగినంతతయారీముందుగా ఒక గిన్నెలో రెండు కప్పుల నీళ్లను బాగా మరిగించాలి. ఇందులో ఒక టేబుల్ స్పూన్ నూనె వేయాలి. ఇంతలో రాగి పిండి కొద్ది నీళ్లు పోసి కలపుకావాలి. నీళ్లు మరుగుతున్న సమయంలో రాగి పిండిని మెల్లగా వేయాలి. మిశ్రమం చిక్కగా బుడగలొస్తాయి. ఇపుడు మంటను పూర్తిగా తగ్గించి, మరికొంచెం పిండిని కలపాలి. గట్టి చెక్క కర్ర లేదా గరిటె అయితే కలపడానికి ఈజీగా ఉంటుంది. తక్కువ మంటతో నెమ్మదిగా కలుపుతూ ఉంటే పిండి ముద్దగా అవుతుంది. కావాలనిపిస్తే ఇంకొంచెం పిండి కలుపుకోవచ్చు. దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చల్లారాక చేతిలో నెయ్యి రాసుకుని నిదానంగా మెత్తగా ముద్దలా చేసుకోవాలి. అంతే రాగి ముద్ద రెడీ. పర్ఫెక్ట్గా చేసిన రాగి ముద్ద వేళ్లతో తాకినప్పుడు అంటుకోకుండా ఉంటుంది. ఇదే తరహాలో మరికొందరు రాగుల పిండిలో నూకలు లేదా బియ్యంతో కలిపి కూడా రాగిముద్ద లేదా సంకటి చేసుకుంటారు.ఎలా చేసినా వేడి వేడి నాటుకోడి పులుసు, మటన్ సూప్‌తో రాగిముద్దను చాలా మంది ఇష్టంగా తింటారు. ఇంకా పప్పు లేదా సాంబారు, గోంగూర పచ్చడి కాంబినేషన్ కూడా అదిరి పోతుంది. ఇదీ చదవండి: భార్యామణికోసం ఏకంగా ఐలాండ్నే కొనేసిన వ్యాపారవేత్త?! -
Hyderabad: డెలీషియస్ గోల్డ్ ఐస్‌క్రీం అంటే అట్లుంటది.. మన హైదరాబాద్‌తోని!
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ అంటేనే వైవిధ్యానికి ఆలవాలం. ఆహర్యంతోపాటు ఆహారంలోనూ విభిన్నతకు అది వేదిక. రకరకాల రుచులకు అడ్డా. ఫుడ్ లవర్స్‌కు స్వర్గధామం. ఇక్కడ హైదరాబాదీ బిర్యానీయే కాదు.. దక్షిణ, ఉత్తర భారత సంప్రదాయ వంటకాలు, వెస్టర్న్ ఫుడ్, చైనీస్, జపనీస్.. ఇలా ఎన్నో దేశాల ఫుడ్ ఇక్కడ దొరుకుతుంది. అలా వారాంతంలో కాస్త డిఫరెంట్ ఫుడ్ తినాలనుకోవాలే కానీ.. దానికి కొదువే ఉండదు. అట్లుంటది మన హైదరాబాద్‌తోని. ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే... బంగారం ఏమైనా తింటామా.. ఏంటి? అని ఎవరైనా మాట వరుసకు అనేవారు ఒకప్పుడు.కానీ, ఇప్పుడు బంగారాన్ని కూడా తినేస్తున్నారండోయ్. గోల్డ్ దోశ, గోల్డ్ ఇడ్లీ, గోల్డెన్ స్వీట్స్.. ఇలా బంగారపు పూత ఉన్న ఫుడ్ ఐటెమ్స్‌ను హైదరాబాద్‌లో అందుబాటులోకి తెచ్చారు. ఈ వరుసలోకి ఐస్‌క్రీం కూడా వచ్చి చేరింది. హైదరాబాద్‌లో కూడా గోల్డ్ ఐస్‌క్రీం కూడా దొరుకుతోందా అని ఆశ్చర్యపోకండి. ఎందుకంటే మన నగరంలో అచ్చు 24 క్యారెట్ల గోల్డ్ ఐస్‌క్రీం లభిస్తోంది. అదెక్కడ అంటారా? మాదాపూర్‌లోని హూబర్, హోలీలో ఈ ఐస్క్రీంను అందుబాటులోకి తీసుకొచ్చారు. మైటీ మిడాస్ పేరుతో ఈ ఐస్క్రీంను అమ్ముతున్నారు. ఖరీదు జస్ట్.. రూ.1,179. సాధారణ కోన్‌లో డిఫరెంట్ ఫ్లేవర్స్‌లో సర్వ్ చేస్తుంటారు. ఐస్‌క్రీం పైన 24 క్యారెట్ల గోల్డ్ పేపర్‌తో అందంగా ముస్తాబు చేసి మనకు అందజేస్తారు. ఇంకేముంది.. ఇక మోస్ట్ డెలీషియస్ ఐస్క్రీంను ఆరగించేయడమే. -
సమ్మర్లో పిల్లలకు ఇలా చేసి పెడితే, ఇష్టంగా తింటారు, బలం కూడా!
వేసవి అంటే పిల్లలకు ఆటవిడుపు కాలం. పరీక్షలు పూర్తయ్యిన తరువాత ఆనందంగా ఆడుకునే కాలం. ఎండా, కొండా లెక్క చేయకుండా హాయిగా తోటి స్నేహితులతో కలిసి చెంగు చెంగున గెంతులేస్తూ ఉత్సాహంగా గడిపే కాలం. మరి ఇలాంటి సమయంలో వారికి మంచి పోషకాహారాన్ని ఇవ్వాలి. ముఖ్యంగా ప్యాకేజ్డ్ ఫుడ్, జంక్‌ఫుడ్‌కు దూరంగా ఉంటూ.. ఇంట్లోనే రుచికరంగా తయారు చేసి పెట్టాలి. తాజా ఆకుకూరల్ని, కూరగాయల్ని, పండ్లను డైట్లో ఉంచాలి. మంచి పోషకాహారమే వారికి అసలైన దివ్యౌషధం. మొలకలొచ్చిన గింజ ధాన్యాలు శనగలు, పెసలతోపాటు మొలకలు వచ్చిన గింజలతో క్యారట్ లాంటి కూరగాయ ముక్కల్ని కలిపి సలాడ్‌లా పెడితే కాల్షియం, ఇతర ప్రొటీన్లు లభిస్తాయి. దీంతో వారి ఎముకలు, కండరాలు దృఢంగా పెరుగుతాయి. ఎదుగుదల అద్భుతంగా ఉంటుంది. ఉడికించిన శనగలు ఉడికించిన శనగలు రెగ్యులర్‌గా తీసుకుంటే రక్త హీనతకు చెక్ చెప్పవచ్చు. ఇందులోని ఐరన్ కంటెంట్ శరీరానికి అంది రక్త వృద్ధి జరుగుతుంది.రోగ నిరోధక శక్తి రెట్టింపు అవుతుంది. మెదడు చురుగ్గా, వేగంగా పని చేస్తుంది.అలసట, నీరసం వంటి సమస్యలుండవు. పిస్తా, బాదం, జీడిపప్పుతో పాటు పల్లీలు, కుసుమలు. లాంటి గింజలను ఆహారంలో చేరిస్తే చిన్నారుల ఇమ్యూనిటీ పెరుగుతుంది. బల వర్ధకంగా ఉంటుంది. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినిపించటం వల్ల పిల్లల మెదడు చురుకుగా పని చేస్తుంది. ప్రతిరోజూ కాల్షియం కోసం పాలు, పౌష్టికాహారం కోసం కోడిగుడ్లు లాంటివి సరైన సమయంలో వారికందేలా చేస్తే తొందరగా వ్యాధుల బారిన పడకుండా కాపాడుతుంది. బలవర్ధకమైన సలాడ్ ఉడికించిన శనగలు, ఉడికించిన బొబ్బర్లు, ఉడికించిన పెసలు, ఉల్లిపాయ, టమాటా ముక్కలు, యోగర్ట్, కొద్దిగా కొత్తిమీర, తయారీ: ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి. ముందుగానేఉడికించి పెట్టుకున్నగింజలు, ఉల్లిపాయ, టమాటా ముక్కలు వేసి బాగాకలపాలి. దీనికి తాజా యోగర్ట్, కొద్దిగా ఉప్పు, మిరియాలు వేసి కలపాలి. దీనిపైన సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తమీద చల్లి, చల్లచల్లగా అందిస్తే పిల్లలు ఇష్టంగా తింటారు. పిల్లల ఇష్టాఇష్టాలను బట్టి, ఇందులో కొబ్బరి, వేయించిన పల్లీలు, స్వీట్‌కార్న్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది బలవర్ధక ఆహారం కూడా. -
వివిధ రాష్ట్రాల అత్యంత ప్రసిద్ధ ఆహారం ఫోటోలు
-
వైఎస్సార్సీపీ ప్రతినిధుల సభలో నోరూరించే వంటకాలు
-
Telangana: బీజేపీ విందు.. బహు పసందు!
సాక్షి, హైదరాబాద్: బీజేపీ జాతీయ కార్యవర్గ భేటీ సందర్భంగా నాలుగు రోజుల పాటు ప్రత్యేకంగా వంటకాలతో అలరించేందుకు నేతలు ఏర్పాట్లు చేశారు. సమావేశాల్లో పాల్గొనే అతిథులకు అనుగుణంగా శుక్రవారం నుంచి సోమవారం వరకు భోజనాల మెనూను రూపొందించారు. తొలిరోజు భోజనంలో... ►క్యారెట్ రైజిన్ మఫిన్స్, గ్రిల్డ్ వెజిటబుల్ చీజ్ శాండ్విచ్, వడపావ్ విత్ ఫ్రైడ్ చిల్లీ, గార్లిక్ పౌడర్, మింట్ చట్నీ, నమక్ పరా, బ్రెడ్ పకోడా, డ్రై ఫ్రూట్ టీకేక్, పాపడ్, ఆలూ ఔర్ మూంగ్ దాల్ కీ టిక్కీ, ఆచారి పనీర్ టిక్కా, బంగాళాదుంప పాపడ్, కచుంబర్ సలాడ్, మక్కై ధనియా చాట్, ధోక్లా, గ్రీన్ సలాడ్, పెరుగన్నం, వడియాలు, గోంగూర ఊరగాయ, గోంగూర రోటి పచ్చడి. ►బఫెట్లో.. పనీర్ కుట్టు, దివానీ సబ్జీ హండీ, ఆలూ బఠానా కుర్మా, కరి సంగ్రి, సుంగారి కోఫ్తా కర్రీ, దాల్ కిచిడీ, టమాట పప్పు, దాల్ మఖానీ, ముక్కాడల సాంబార్, చపాతీ, నాన్, రోటీ, కుల్చా తదితర రోటీలు ►స్వీట్లలో.. డబుల్ కా మీఠా, తిరమిసు, ఆప్రికాట్ డిలైట్, బటర్ స్కాచ్, రబ్డీతో బెల్లం జిలేబీ. ►పండ్లలో.. పుచ్చకాయ, బొప్పాయి, కర్బూజ, పైనాపిల్, ద్రాక్ష, జామ, జామ, సపోటా ►నవరాత్రి ఫుడ్ (ఉల్లిపాయ, వెల్లుల్లి లేని వంటకాలు) ►మక్ఖన్ కా సబ్జీ, సాబుదానా వేరుశనగ కిచిడీ, సమై కా కిచిడీ. చదవండి: (ప్రధాని మోదీకి జిమ్ కోచ్‌గా మంచిర్యాల జిల్లా వాసి) రెండో రోజున.. ►వంకాయ పకోడీ, దాల్ మఖానీ, దాల్ తడ్కా, సాంబార్, పలు రకాల రొట్టెలు. ►మిల్లెట్స్‌తో ఐదు రకాల కిచిడీలు, హైదరాబాదీ బిర్యానీ, దమ్ బిర్యానీ, కుబూలీ బిర్యానీ, మోటియా బిర్యానీ, దోసకాయ రైతా, మిర్చ్ కా సలాన్, దోస, ఉతప్పం, ఉప్మా, పాలక్ దోశ, ►స్వీట్లలో.. రెడ్ వెల్వెట్ కేక్, రస్ మలాయ్, మోతీచూర్ లడ్డూ, చీజ్ కేక్, అంజీర్ కలాకంద్, స్టఫ్డ్ కాలా జామూన్, బాసుంది, మట్కా కుల్ఫీ, టూటీ ఫ్రూటీ, మ్యాంగో, గ్రేప్ ఐస్‌క్రీమ్‌లు మూడో రోజున.. ►టమాటా కూర, మెంతికూర ఆలుగడ్డ, వంకాయ మసాలా, దొండకాయ కొబ్బరి ఫ్రై, బెండకాయ కాజూపల్లి ఫ్రై, తోటకూర టమాటా ఫ్రై, బీరకాయ పాలకూర, గంగవాయిలి మామిడికాయ పప్పు, మెంతి పెసరపప్పు, చనా మసాలా, పప్పుచారు, పచ్చి పులుసు, ముద్దపప్పు, బగారా అన్నం, పులిహోర, పుదీనా రైస్, తెల్ల అన్నం. ►ఉతప్పం, మసాలా పెసరట్టు, పనీర్, ఉప్మా, పాలక్ దోశ, ఆవకాయ ముద్ద పప్పు, అన్నంలోకి చిప్స్, జొన్నరొట్టె, పూరీ, పుల్కా, నాన్ రోటీలు ►స్వీట్లలో నువ్వుల లడ్డు, పరమాన్నం, సేమ్యా పాయసం, భక్ష్యాలు, అరిసెలు, జున్ను. అన్ని రకాల పండ్లు ►బెల్లం ముడుపులు, సర్వ పిండి, అరిసెలు, సకినాలు, కోవా గరిజలు, పెసరపప్పు గారెలు, మిర్చి బజ్జీ, పూరీ, ఆలూ సబ్జీ, పల్లిపట్టి, టమాటా చట్నీ, పల్లి చట్నీ, కొబ్బరి చట్నీ నాలుగో రోజు భోజనంలో.. రెండో రోజునాటి మెనూతోపాటు దాల్ బట్టి చుర్మా, థాయ్ ఫ్రైడ్ రైస్, అన్ని రకాల రొట్టెలు ఉంటాయి. స్వీట్లలో ఖుర్బానీ కా మీఠా, మూంగ్ దాల్ హల్వా, స్ట్రాబెర్రీ ఐస్‌క్రీమ్ ఉంటాయి. అన్నిరకాల పండ్లను అందుబాటులో ఉంచుతారు. -
అలల సవ్వడిని ఆస్వాదిస్తూ వేడి వేడి బిర్యానీ.. బస్సుపై కూర్చుని తింటే!
బీచ్‌రోడ్డు (విశాఖతూర్పు): సాగరతీరం.. ఎప్పుడూ కొత్తగానే ఉంటుంది.. రోజూ చూస్తున్నా ఏదో తెలియని అనుభూతి.. అలల సవ్వడి పలకరిస్తాయి. చిరుగాలులు మనసును ఆహ్లాదపరుస్తాయి. అందుకే విశాఖ బీచ్ ఎనలేని ఖ్యాతి సొంతం చేసుకుంది. అటువంటి సాగరతీరంలో అలల సవ్వడి వింటూ.. ఎగసి పడే కెరటాలను చూస్తూ..చల్లగాలి ఆహ్లాదాన్ని మజా చేస్తూ మరో వైపు లైవ్ మ్యూజిక్ హమ్ చేస్తూ వేడి వేడి బిర్యానీ తింటే.. నూరూరించే పిజ్జా ఆరగిస్తే.. జింహ్వచాపల్యానికి ఇంతకంటే ఇంకేం కావాలి. ఇప్పుడు అటువంటి రెస్టారెంట్ నగరవాసులకు అందుబాటులోకి తీసుకొచ్చాడు ఓ యువకడు. నగరవాసుల టేస్ట్‌ను పట్టుకున్న వెంకట నాగచంద్ర (చందు).. కొత్త ఆలోచనలకు ఎప్పుడూ సిటి జనలు ఆదరస్తారన్న నమ్మకంతో ఓసియన్ ఎడ్జ్ పేరుతో మొబైల్ రూఫ్‌టాప్ డైనింగ్ రెస్టారెంట్‌ను తీర్చిదిద్దాడు. బస్సు టాప్‌పై కూర్చుని సముద్ర అందాలను వీక్షిస్తూ ఇష్టమైన ఆహారాన్ని తీంటుంటే వావ్ అనాల్సిందే.. ఒక్క సారైనా చూడడానికైనా వెళ్లాల్సిందే. చదవండి👉🏾 తిరుపతి, అరకుకు స్పెషల్ టూర్స్ సరికొత్త అనుభూతి.. రూఫ్‌టాప్‌పై కూర్చుని సముద్రం అలల చూస్తూ తింటుంటే ఏదో తెలియని సరికొత్త అనుభూతి పొందుతున్నట్టు ఉంది. పాత కాలం గోలిసోడ తాగుతూ ఫిష్ ఫ్రై తింటుంటే చాలా అద్భుతంగా ఉంది. –దుర్గాప్రసాద్, ఆహార ప్రియుడు వైజాగ్‌లో మొదటిసారిగా.. యూరప్ దేశాలకే పరిమితమైన ఈ రెస్టారెంట్ విశాఖ నగరంలో మొదటి మొబైల్ రూఫ్‌టాప్ రెస్టారెంట్‌ను ఏర్పటు చేశాడు. ఈ రెస్టారెంట్ ఇప్పటికే అనేక పార్టీలకు వేదికైంది. ఈ రెస్టారెంట్‌ను సాగతీరంలోనే కాకుండా ఆహార ప్రియుల ఆసక్తి మేరకు వారి చెప్పిన ప్రాంతంలో కూడా ఏర్పాటు చేస్తారు. బస్సుపైన డైనింగ్ చేస్తూ నగర వాసులు ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు. మరిన్ని ఇటువంటి రెస్టారెంట్లు నగరంలో ఏర్పాట చేయాలని చందు భావిస్తున్నాడు. చదవండి👉🏻 ముడతలు, బ్లాక్ హెడ్స్‌కు చెక్.. ఈ డివైజ్ ధర రూ. 2,830 గోలి సోడ నుంచి పిజ్జా వరకు మొబైల్ రూఫ్‌టాప్ రెస్టారెంట్లో అన్ని రకాల ఆహారం పదార్థాలు లభిస్తున్నాయి. పాతతరం గోలి సోడ నుంచి కొత్త తరం పిజ్జా, బిర్యానీ, బర్గర్లు వరకు అనేక వంటకాలు అందుబాటులో ఉన్నాయి. లైవ్ మ్యూజిక్ యూరప్‌లో చూసి.. నగరంలో తన మార్కు చూపించాలని చందుకు ఎప్పుడూ ఉండేది. వినూత్నమైన ఆలోచనలతో ముందుకు సాగేవాడు. అలాంటి సమయంలో ఫ్యామిలీతో యూరప్ వెళ్లినప్పుడు ఎక్కువగా ఇంటువంటి మొబైల్ రూఫ్‌టాప్ డైనింగ్ రెస్టారెంట్లను చూశాడు. అబ్బా భలే ఉందే...మన విశాఖలో ఇలా పెడితే బ్రహ్మాండంగా ఉంటుందని నిర్ణయించుకున్నాడు. అంతేకాకుండా విశాఖ పర్యాటకపరంగా ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. మొబైల్ రూఫ్‌టాప్ డైనింగ్ రెస్టారెంట్ కచ్చితంగా క్లిక్ అవుతుందని భావించాడు. ఆలోచన రావడమే తరువు అన్నట్టు అన్ని ఎర్పాట్లు చేసుకుని జీవీఎంసీ అనుమతులను పొంది ఆరు నెలల క్రితం వైఎంసీఏ వద్ద ఈ ఓసియన్ ఎడ్జ్ మొబైల్ రూఫ్‌టాప్ డైనింగ్ రెస్టారెంట్‌ను ప్రారంభించాడు. నగర యువత ఇప్పుడు ఈ రెస్టారెంట్ కొత అనుభూతిని పొందుతున్నారు. ఈ రెస్టారెంట్ ద్వారా 12 మందికి ఉపాధి కల్పిస్తున్నాడు చందు. చదవండి👉 అధరహో...సిరులు కురుపిస్తున్న చింత ఆహార ప్రియులతో కిటకిటాలడుతున్న రూప్‌టాప్ డైనింగ్ ప్రభుత్వం సహకరిస్తే ఫ్లైట్ రెస్టారెంట్ ఏర్పాటు ఎప్పుడు వినూత్నంగా ఏదైన చేయాలనేది నా ఆలోచన. అందులో భాగంగానే ఈ రెస్టారెంట్‌ను ఏర్పాటు చేశా. నగర వాసులు ఆదరణ చాలా బాగుంది. ఆహార ప్రియుల కోరిక, ఆసక్తి మేరకు ప్రజల వద్దకే మా రెస్టారెంట్‌ను తీసుకొని వెళ్లడం జరుగుంది. ప్రస్తుతం ఫ్లైట్ రెస్టారెంట్ ఏర్పాటు చేయాలనేది నా లక్ష్యం దీనికి ప్రభుత్వం సహకరించాలి. ఇప్పటికే ఫ్లైట్ రెస్టారెంట్ ఏర్పాటుకు కావాల్సిన అన్ని సిద్ధం చేసుకున్నా. కానీ దాన్ని సరైన ప్రదేశంలో ఏర్పాటు చేయాలి. అందుకు ప్రభుత్వం స్థలం కేటాయిస్తే రెస్టారెంట్ ఏర్పాటు చేసి పర్యటకులను ఆకర్షించవచ్చు. –నాగచంద్ర (చందు), ఓసియన్ ఎడ్జి రెస్టారెంట్ -
సోదరీసోదరుల అనురాగ అనుబంధాల మిఠాయి
సోదరీసోదరుల అనురాగ అనుబంధాల తియ్యటి పండుగ.. సోదరుడి నోరు తీపి చేయటానికి సోదరి ఆప్యాయతను కలబోసి తినిపించే మిఠాయిల పండుగ తనకు రక్షణగా ఉండమని సోదరుడిని భరోసా కోరే రక్షాబంధన్ పండుగ.. 1. దూద్ పాక్ కావలసినవి: చిక్కటి పాలు – 5 కప్పులు; కుంకుమ పువ్వు – కొద్దిగా; చల్లటి పాలు – ఒక టేబుల్ స్పూను; బాస్మతి బియ్యం – ఒక టేబుల్ స్పూను; నెయ్యి – ఒక టేబుల్ స్పూను; పంచదార – అర కప్పు; ఏలకుల పొడి – అర టీ స్పూను; గార్నిషింగ్ కోసం: బాదం పప్పుల తరుగు – ఒక టేబుల్ స్పూను; పిస్తా పప్పుల తరుగు – ఒక టేబుల్ స్పూను తయారీ ఒక చిన్న పాత్రలో టేబుల్ స్పూను పాలు, కుంకుమ పువ్వు వేసి బాగా కలిపి పక్కన ఉంచాలి. బియ్యాన్ని శుభ్రంగా కడిగి నీరు ఒంపేసి, నెయ్యి జత చేసి పక్కన ఉంచాలి. పాలను మరిగించాక, నెయ్యి జత చేసిన బియ్యం అందులో పోసి, సన్నని మంట మీద మధ్యమధ్యలో కలుపుతూ, ఉడికించాలి. పంచదార, కుంకుమ పువ్వు జత చేసిన పాలు, ఏలకుల పొడి వేసి బాగా కలిపి, సన్నని మంట మీద మధ్యమధ్యలో కలుపుతూ ఆరేడు నిమిషాలు ఉంచి, దింపేయాలి. చల్లారాక ఫ్రిజ్‌లో అరగంట సేపు ఉంచి బయటకు తీయాలి. బాదం పప్పుల తరుగు, పిస్తా పప్పుల తరుగుతో అలంకరించి, అందించాలి. చదవండి: రొయ్యల ఆమ్లెట్ ఎలా తయారు చేయాలో తెలుసా? 2. కాజు కోప్రా షీరా కావలసినవ: జీడి పప్పుల పొడి – అర కప్పు (రవ్వలా ఉండాలి); కొబ్బరి తురుము – అర కప్పు; నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు; పంచదార – 5 టేబుల్ స్పూన్లు; ఏలకుల పొడి – పావు టీ స్పూను; కుంకుమ పువ్వు – కొద్దిగా తయారీ చిన్న గ్లాసులో కొద్దిగా నీళ్లు, కుంకుమ పువ్వు వేసి కలిపి పక్కన ఉంచాలి. స్టౌ మీద బాణలిలో నెయ్యి వేసి కరిగాక, జీడి పప్పు పొడి, కొబ్బరి తురుము వేసి మీడియం మంట మీద మూడు నిమిషాల పాటు ఆపకుండా కలుపుతుండాలి. ఒక పాత్రలో పావు కప్పు నీళ్లలో పంచదార వేసి కరిగించి, వేయించిన జీడి పప్పు మిశ్రమానికి జత చేసి, బాగా కలపాలి. కుంకుమ పువ్వు నీళ్లను జత చేసి మరోమారు కలపాలి. ఏలకుల పొడి జత చేసి, కలిపి, దింపేసి, చల్లారాక అందించాలి. 3. కేసర్ మలై కుల్ఫీ కావలసినవి: కుంకుమ పువ్వు – కొద్దిగా; చల్లటి పాలు – ఒక టేబుల్ స్పూను; కార్న్ ఫ్లోర్ – ఒక టేబుల్ స్పూను; చిక్కటి పాలు – నాలుగున్నర కప్పులు; పంచదార – 5 టేబుల్ స్పూన్లు; ఏలకుల పొడి – పావు టీ స్పూను తయారీ ఒక గ్లాసులో కొద్దిగా పాలు, కుంకుమ పువ్వు వేసి కలిపి పక్కన ఉంచాలి. చిన్న పాత్రలో 2 టేబుల్ స్పూన్ల నీళ్లు, కార్న్ ఫ్లోర్ వేసి కలిపి పక్కన ఉంచాలి. స్టౌ మీద మందపాటి గిన్నెలో పాలు పోసి సన్నటి సెగ మీద మధ్యమధ్యలో కలుపుతూ మరిగించాలి. కార్న్ ఫ్లోర్ నీళ్లు, పంచదార జత చేసి సన్నటి మంట మీద సుమారు అరగంట సేపు మధ్యమధ్యలో కలుపుతూ ఉడికించి దింపేయాలి. మిశ్రమం బాగా చల్లారాక కుంకుమ పువ్వు పాలు, ఏలకుల పొడి జత చేయాలి. తయారైన మిశ్రమాన్ని కుల్ఫీ మౌల్డ్స్‌లోకి పోసి, డీప్ ఫ్రీజర్‌లో సుమారు ఎనిమిది గంటలు ఉంచాక తీసుకుని తినాలి. – వైజయంతి పురాణపండ చదవండి: బ్రెడ్ పిజ్జా ఎలా తయారు చేయాలో తెలుసా? -
రోజుకి 18 గంటలు.. ఆరోగ్యంగా విజయాలు..
పరిశుభ్రమైన ఆహారం... రుచికరమైన ఆహారం.. వచ్చినవారిని ఆప్యాయంగా పలకరించటం.. రుచి నచ్చిందా లేదా అని ప్రశ్నించటం.. కస్టమర్ల సూచనలు, సలహాలు పాటించటం.. వీటి వల్లే బ్రాండింగ్ వస్తుందనేది అనురాధ రావిరాల నమ్మకం.. అక్కడకు వచ్చినవారు కడుపునిండా హాయిగా భోజనం చేసి వెళ్తారు.. ఈ కారణాలే ఆమెను ఉత్తమ ఎంటర్ప్రెన్యూర్ స్థాయికి తీసుకువెళ్లాయి.. అనురాధ రావిరాల హైదరాబాద్ కోకాపేట్లో ఉంటున్నారు. తండ్రి ఆర్బి రాజు ఆర్కిటెక్ట్, తల్లి కుసుమ ఎంఏ పొలిటికల్ సైన్స్. వారి నుంచి మంచి చదువు చదవగలిగారు అనురాధ. ఇంటీరియర్ డిజైనింగ్, ఆ తరవాత హోటల్ మేనేజ్మెంట్ కోర్సులు పూర్తి చేశారు. ఇంటీరియర్ డిజైన్ చేస్తూ కెరీర్ ప్రారంభించారు. ‘‘నాకు చిన్నప్పటి నుంచి ఏదో ఒకటి చేయాలనే కోరిక బలంగా ఉండేది. ఇంటీరియర్ డిజైన్ కాకుండా ఇంకా ఏదైనా చేయాలనిపించేది. అమ్మ చాలా రుచిగా వంట చేసేది. అమ్మతో పాటు అప్పుడప్పుడు నేను కూడా వంట చేసేదాన్ని. నాకు సంప్రదాయ వంటలంటే చాలా ఇష్టం. ఆ అభిరుచి కారణంగానే హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చేశాను’’ అంటున్న అనురాధ, చేసేది ఒక్క వంటకమైనా, అది పూర్తిస్థాయిలో రుచిగా, సంప్రదాయబద్ధంగా ఉండాలంటారు. చదవండి: Travel Tips: ప్రయాణించే సమయంలో ఈ విషయాలు మర్చిపోకండి! విజయానికి కారణం.. రెండు దశాబ్దాల కిందట వేవ్‌రాక్‌లో అమృత్సరీ పేరున పూర్తి శాకాహారం అందచేయటంతో ఫుడ్ బిజినెస్‌లో తొలి అడుగు వేసి, పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలకు ఫుడ్ సప్లయి చేశారు. నాన్‌వెజ్ ఫుడ్ సప్లయి కూడా ప్రారంభించారు. ‘‘డిమాండ్‌కి అనుగుణంగా సప్లయి చేయటం కోసం నార్సింగ్ మెయిన్ రోడ్ మీద సెంట్రల్ కిచెన్‌ను, చిన్న రెస్టారెంట్‌ను ప్రారంభించి, ఔట్లెట్ సెంటర్లను పెంచాను’’ అంటున్న అనురాధకు తొలి అడుగులో అపశృతి దొర్లినా, త్వరగానే కోలుకున్నారు. అతి తక్కువ పెట్టుబడితో ప్రాంభించి, ఇప్పుడు మంచి టర్నోవర్ స్థాయికి ఎదిగారు. ఫుడ్ ఈజ్ ఇమోషనల్... నాణ్యమైన ఆహారం అందిస్తూ, దాని ద్వారానే బ్రాండింగ్ తెచ్చుకోవాలంటారు అనురాధ. ‘‘ఫుడ్ ఈజ్ ఇమోషనల్. ఏ పదార్థమైనా నోట్లో పెట్టుకోగానే వెంటనే అనుభూతి చెందుతారు’’ అంటున్న ఆమె, ఒక కస్టమర్ కోసం, వంటగదిలో స్వయంగా గరిటె పట్టుకున్నారు. గోంగూర పచ్చడి, పూర్ణాలు, బొబ్బట్లు, పులిహోర... అన్నీ అందించారు. ‘‘కాంప్లిమెంటరీగా పూతరేకులు కూడా ఇచ్చాం’’ అంటూ ఆనందంగా చెబుతారు అనురాధ. రోజుకి 18 గంటలు.. అన్నీ స్వయంగా చూసుకోగలిగితేనే వ్యాపారంలో రాణించగలమని నమ్ముతారు అనురాధ. ‘‘బిజినెస్‌లో ఇమోషన్స్ ఉండకూడదు. క్రమశిక్షణ, నిజాయితీతో పనిచేస్తే విజయం సాధించటం తేలిక’’ అంటున్న అనురాధ.. ఇండిగ్రాండ్ హాస్పిటాలిటీ సర్వీసెస్ అందిస్తున్నారు. సర్టిఫైడ్ ఇంటీరియర్ డిజైనర్‌గా ఆర్బి రాజు అండ్ అనురాధ అసోసియేట్స్ పేరున డిజైనింగ్ చేస్తున్నారు. హాస్పిటాలిటీ హోటల్స్‌కి బ్రాండ్ అంబాసిడర్ స్థాయికి ఎదిగారు. – సంభాషణ: వైజయంతి పురాణపండ మొహాలీలో అడ్వాన్స్డ్ మేనేజ్మెంట్ కోర్సుకి అప్లయి చేసిన కొన్ని వేల మందిలో సెలక్ట్ అయ్యారు. ‘‘మేం సెలక్ట్ కావాలంటే చాలా అడ్డంకులు దాటాలి. ఇంటర్వ్యూ స్కాలర్లీగా ఉంటుంది. ఉదయం నుంచి రాత్రి వరకు క్లాసులు జరుగుతూనే ఉంటాయి. కన్ను ఆర్పటానికి కూడా సమయం దొరకదు. కోర్సు పూర్తి చేసి వెళ్లే ముందు వారు, ‘మా దగ్గర నువ్వు ఏం నేర్చుకున్నావు, మీ హోటల్‌కి వచ్చిన వాళ్లని ఏ విధంగా గౌరవిస్తావు’ అని వారు వేసిన ప్రశ్నలకు మా సమాధానం చెప్పాలి. బిజినెస్ ఒక్కరితో, ఒక్కరోజులో ముగిసేది కాదు. మున్ముందు ఎలా విస్తృతపరుస్తామనే విషయాలను కూడా వివరంగా రాయాలి. ఫైనాన్సియల్ ప్రొజెక్షన్ కూడా ఇవ్వాలి. ఇంత కష్టపడిన తరవాతే సర్టిఫికేట్ వస్తుంది. – అనురాధ, ఉత్తరి హోటల్ అధినేత చదవండి: బీరకాయతో నాన్‌వెజ్.. చికెన్, రొయ్యలు, ఖీమా -
హైదరాబాదీ బిర్యానీ.. ఆంధ్రా గోంగూర
- రైళ్లలో రుచికరమైన ఆహారం - నాణ్యతా ప్రమాణాలు పాటించేలా సరికొత్త పాలసీకి రైల్వే కసరత్తు సాక్షి, హైదరాబాద్: హజ్రత్ నిజాముద్దీన్ నుంచి బెంగళూరుకు వెళుతున్న రాజధాని ఎక్స్‌ప్రెస్ ఇటీవల సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ఆగింది. అప్పటికే ఆగ్రహంగా ఉన్న అందులోని ప్రయాణికులు... రుచీపచీ లేని పులి సిపోయిన ఆహార పదార్థాలు ఇచ్చారంటూ స్టేషన్లో నిరసనకు దిగారు. ముందు రోజూ ఇలాగే నాణ్యతలేని ఆహారం అందించారని ఆందోళన చేశారు. దీంతో చాలాసేపు రైలు స్టేషన్లోనే నిలిచిపోయింది. పరుగెత్తుకొచ్చిన అధికారులు రాబోయే స్టేషన్లో తాజా పదార్థాలు అందిస్తామని చెప్పి, ఫిర్యాదులు తీసుకున్నారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని సుమారు 200 ఎక్స్‌ప్రెస్ రైళ్లలో నిత్యం ఎక్కడో అక్కడ ఆహార పదార్థాల నాణ్యత, రుచిపై ఇలాంటి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో భవిష్యత్తులో ఫిర్యాదులు రాకుం డా దక్షిణ మధ్య రైల్వే చర్యలు చేపట్టింది. ప్రయాణికులకు కోరుకున్న నాణ్యమైన, రుచికరమైన ఆహార పదా ర్థాలను అందజేసేందుకు సమగ్ర కేటరింగ్ పాలసీని అమల్లోకి తెచ్చేలా సన్నాహాలు చేస్తోంది. స్థానిక వంట కాలను రుచికరంగా అందించేలా రూపొందిస్తోంది. నాణ్యతపై దృష్టి... ప్రస్తుతం రైళ్లలో ఆహార సరఫరా నిర్వహణపై సమగ్రమైన విధానం లేదు. రాజధాని, దురంతో రైళ్లలో ఆహార పదార్థాలను ఐఆర్సీటీసీ అందజేస్తుండగా... మిగిలిన వాటిలో రైల్వే కాంట్రాక్టు కేటరింగ్ సంస్థలు సరఫరా చేస్తున్నాయి. దీంతో కొన్ని సంస్థలు తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయి. మెనూలో సూచించిన ఆహార పదార్థాల పరిమాణం, నాణ్యతలో అనేక తేడాలు ఉంటున్నాయి. ఉదాహరణకు రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో టికెట్‌తో పాటే ఫుడ్ కూడా బుక్ చేసుకున్న ప్రయాణికుడికి వెల్కమ్ డ్రింక్, కాఫీ/టీ, సమోసా, వెజ్ శాండ్విచ్, బిస్కెట్ల వంటివి ఇవ్వాలి. మధ్యాహ్నం, రాత్రి భోజన సమయంలో వెజిటబుల్ సూప్, వెన్న, 100 గ్రాముల చపాతీ, 100 గ్రాముల రైస్, 150 గ్రాముల పప్పు, చికెన్, పన్నీర్, క్యాప్సికమ్ కర్రీస్ వంటివి వడ్డించాలి. వీటితో పాటు స్వీట్, ఐస్‌క్రీమ్‌లు, వాటర్ బాటిళ్లు కూడా ఇవ్వాలి. కానీ కొన్ని కేటరింగ్ సంస్థలు ఈ ఐటెమ్స్ అన్నీ ఇవ్వడంలేదు. నాణ్యతతో పాటు పరిమాణాల్లోనూ తేడాలుంటున్నాయి. ఆహార పదార్థాల తయారీ, పంపిణీ ఒకే సంస్థకు కట్టబెట్టడం వల్ల ఈ పరిస్థితి తలెత్తుతున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో ఆహార తయారీ, పంపిణీని వేరు వేరు సంస్థలకు అప్పగించడంవల్ల నాణ్యత, రుచి, శుచిపై నిఘా ఉంటుందని భావిస్తున్నారు. ‘రాజధాని’ సంఘటనపై దర్యాఫ్తు... ఇటీవల హజ్రత్ నిజాముద్దీన్–బెంగళూరు రాజధాని ఎక్స్‌ప్రెస్ ప్రయాణికులు ఆహార పదార్థాల నాణ్యతపై చేసిన ఫిర్యాదులను దక్షిణ మధ్య రైల్వే సీరియస్‌గా తీసుకుంది. వీటిపై ఉన్నత స్థాయిలో విచారణ చేపట్టినట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎం.ఉమాశంకర్‌కుమార్ మంగళవారం తెలిపారు. జీఎం వినోద్‌కుమార్‌యాదవ్ ఈ అంశంపై ఐఆర్సీటీసీ, రైల్వే ఉన్నతాధికారులతో సంప్రదింపులు చేపట్టారు. ఇలాంటివి పునరావృతం కాకుండా తీసుకోవలసిన చర్యలపైనా దృష్టి సారించారు. స్థానిక వంటకాలకు ప్రాధాన్యం ప్రయాణికులు తమ స్థానిక ఆహార పదార్థాలను సైతం పొందేలా కొత్త పాలసీని రైల్వే అధికారులు సిద్ధం చేస్తున్నారు. హైదరా బాదీ బిర్యానీ, తెలంగాణ ఇతర పిండివంట లు, ఆంధ్రా గోంగూర, ఆవకాయ, పూతరేకులు వంటివి రైల్లో అందజేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. దీనిలో భాగంగా కేటరింగ్ బాధ్యతను ఐఆర్సీటీసీ పరిధిలోకి తీసుకొ స్తారు. రైల్వే.. కేవలం రైళ్ల నిర్వహణకే పరిమితమవుతుంది. కొత్త పాలసీ అమల్లోకి వస్తే.. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని సుమారు 200 రైళ్లలో రోజుకు సగటున లక్ష మంది ప్రయాణికులకు ప్రయోజనం చేకూరుతుంది.