Telangana Delicacies Set to Tickle Taste Buds of BJP Meet Delegates - Sakshi
Sakshi News home page

Telangana: బీజేపీ విందు.. బహు పసందు!

Published Fri, Jul 1 2022 5:44 PM | Last Updated on Fri, Jul 1 2022 7:32 PM

Telangana Delicacies set to Tickle Taste buds of BJP Meet Delegates - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బీజేపీ జాతీయ కార్యవర్గ భేటీ సందర్భంగా నాలుగు రోజుల పాటు ప్రత్యేకంగా వంటకాలతో అలరించేందుకు నేతలు ఏర్పాట్లు చేశారు. సమావేశాల్లో పాల్గొనే అతిథులకు అనుగుణంగా శుక్రవారం నుంచి సోమవారం వరకు భోజనాల మెనూను రూపొందించారు.  



తొలిరోజు భోజనంలో... 
క్యారెట్‌ రైజిన్‌ మఫిన్స్, గ్రిల్డ్‌ వెజిటబుల్‌ చీజ్‌ శాండ్‌విచ్, వడపావ్‌ విత్‌ ఫ్రైడ్‌ చిల్లీ, గార్లిక్‌ పౌడర్, మింట్‌ చట్నీ, నమక్‌ పరా, బ్రెడ్‌ పకోడా, డ్రై ఫ్రూట్‌ టీకేక్, పాపడ్, ఆలూ ఔర్‌ మూంగ్‌ దాల్‌ కీ టిక్కీ, ఆచారి పనీర్‌ టిక్కా, బంగాళాదుంప పాపడ్, కచుంబర్‌ సలాడ్, మక్కై ధనియా చాట్, ధోక్లా, గ్రీన్‌ సలాడ్, పెరుగన్నం, వడియాలు, గోంగూర ఊరగాయ, గోంగూర రోటి పచ్చడి. 



బఫెట్‌లో.. పనీర్‌ కుట్టు, దివానీ సబ్జీ హండీ, ఆలూ బఠానా కుర్మా, కరి సంగ్రి, సుంగారి కోఫ్తా కర్రీ, దాల్‌ కిచిడీ, టమాట పప్పు, దాల్‌ మఖానీ, ముక్కాడల సాంబార్, చపాతీ, నాన్, రోటీ, కుల్చా తదితర రోటీలు 



స్వీట్లలో.. డబుల్‌ కా మీఠా, తిరమిసు, ఆప్రికాట్‌ డిలైట్, బటర్‌ స్కాచ్, రబ్డీతో బెల్లం జిలేబీ. 

పండ్లలో.. పుచ్చకాయ, బొప్పాయి, కర్బూజ, పైనాపిల్, ద్రాక్ష, జామ,  జామ, సపోటా 



నవరాత్రి ఫుడ్‌ (ఉల్లిపాయ, వెల్లుల్లి లేని వంటకాలు) 

మక్ఖన్‌ కా సబ్జీ, సాబుదానా వేరుశనగ కిచిడీ, సమై కా కిచిడీ. 

చదవండి: (ప్రధాని మోదీకి జిమ్‌ కోచ్‌గా మంచిర్యాల జిల్లా వాసి)

రెండో రోజున.. 
వంకాయ పకోడీ, దాల్‌ మఖానీ, దాల్‌ తడ్కా, సాంబార్, పలు రకాల రొట్టెలు. 
మిల్లెట్స్‌తో ఐదు రకాల కిచిడీలు, హైదరాబాదీ బిర్యానీ, దమ్‌ బిర్యానీ, కుబూలీ బిర్యానీ, మోటియా బిర్యానీ, దోసకాయ రైతా, మిర్చ్‌ కా సలాన్, దోస, ఉతప్పం, ఉప్మా, పాలక్‌ దోశ, 


స్వీట్లలో.. రెడ్‌ వెల్వెట్‌ కేక్, రస్‌ మలాయ్, మోతీచూర్‌ లడ్డూ, చీజ్‌ కేక్, అంజీర్‌ కలాకంద్, స్టఫ్డ్‌ కాలా జామూన్, బాసుంది, మట్కా కుల్ఫీ, టూటీ ఫ్రూటీ, మ్యాంగో, గ్రేప్‌ ఐస్‌క్రీమ్‌లు 



మూడో రోజున.. 
టమాటా కూర, మెంతికూర ఆలుగడ్డ, వంకాయ మసాలా, దొండకాయ కొబ్బరి ఫ్రై, బెండకాయ కాజూపల్లి ఫ్రై, తోటకూర టమాటా ఫ్రై, బీరకాయ పాలకూర, గంగవాయిలి మామిడికాయ పప్పు, మెంతి పెసరపప్పు, చనా మసాలా, పప్పుచారు, పచ్చి పులుసు, ముద్దపప్పు, బగారా అన్నం, పులిహోర, పుదీనా రైస్, తెల్ల అన్నం. 

ఉతప్పం, మసాలా పెసరట్టు, పనీర్, ఉప్మా, పాలక్‌ దోశ, ఆవకాయ ముద్ద పప్పు, అన్నంలోకి చిప్స్, జొన్నరొట్టె, పూరీ, పుల్కా, నాన్‌ రోటీలు 
స్వీట్లలో నువ్వుల లడ్డు, పరమాన్నం, సేమ్యా పాయసం, భక్ష్యాలు, అరిసెలు, జున్ను. అన్ని రకాల పండ్లు 
బెల్లం ముడుపులు, సర్వ పిండి, అరిసెలు, సకినాలు, కోవా గరిజలు, పెసరపప్పు గారెలు, మిర్చి బజ్జీ, పూరీ, ఆలూ సబ్జీ, పల్లిపట్టి, టమాటా చట్నీ, పల్లి చట్నీ, కొబ్బరి చట్నీ 



నాలుగో రోజు భోజనంలో.. 
రెండో రోజునాటి మెనూతోపాటు దాల్‌ బట్టి చుర్మా, థాయ్‌ ఫ్రైడ్‌ రైస్, అన్ని రకాల రొట్టెలు ఉంటాయి. స్వీట్లలో ఖుర్బానీ కా మీఠా, మూంగ్‌ దాల్‌ హల్వా, స్ట్రాబెర్రీ ఐస్‌క్రీమ్‌ ఉంటాయి. అన్నిరకాల పండ్లను అందుబాటులో ఉంచుతారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement