బంగారం ఏమైనా తింటామా.. ఏంటి?
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ అంటేనే వైవిధ్యానికి ఆలవాలం. ఆహర్యంతోపాటు ఆహారంలోనూ విభిన్నతకు అది వేదిక. రకరకాల రుచులకు అడ్డా. ఫుడ్ లవర్స్‌కు స్వర్గధామం. ఇక్కడ హైదరాబాదీ బిర్యానీయే కాదు.. దక్షిణ, ఉత్తర భారత సంప్రదాయ వంటకాలు, వెస్టర్న్ ఫుడ్, చైనీస్, జపనీస్.. ఇలా ఎన్నో దేశాల ఫుడ్ ఇక్కడ దొరుకుతుంది. అలా వారాంతంలో కాస్త డిఫరెంట్ ఫుడ్ తినాలనుకోవాలే కానీ.. దానికి కొదువే ఉండదు. అట్లుంటది మన హైదరాబాద్‌తోని. ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే... బంగారం ఏమైనా తింటామా.. ఏంటి? అని ఎవరైనా మాట వరుసకు అనేవారు ఒకప్పుడు.
కానీ, ఇప్పుడు బంగారాన్ని కూడా తినేస్తున్నారండోయ్. గోల్డ్ దోశ, గోల్డ్ ఇడ్లీ, గోల్డెన్ స్వీట్స్.. ఇలా బంగారపు పూత ఉన్న ఫుడ్ ఐటెమ్స్‌ను హైదరాబాద్‌లో అందుబాటులోకి తెచ్చారు. ఈ వరుసలోకి ఐస్‌క్రీం కూడా వచ్చి చేరింది. హైదరాబాద్‌లో కూడా గోల్డ్ ఐస్‌క్రీం కూడా దొరుకుతోందా అని ఆశ్చర్యపోకండి. ఎందుకంటే మన నగరంలో అచ్చు 24 క్యారెట్ల గోల్డ్ ఐస్‌క్రీం లభిస్తోంది. అదెక్కడ అంటారా? మాదాపూర్‌లోని హూబర్, హోలీలో ఈ ఐస్‌క్రీంను అందుబాటులోకి తీసుకొచ్చారు. మైటీ మిడాస్ పేరుతో ఈ ఐస్‌క్రీంను అమ్ముతున్నారు. ఖరీదు జస్ట్.. రూ.1,179. సాధారణ కోన్‌లో డిఫరెంట్ ఫ్లేవర్స్‌లో సర్వ్ చేస్తుంటారు. ఐస్‌క్రీం పైన 24 క్యారెట్ల గోల్డ్ పేపర్‌తో అందంగా ముస్తాబు చేసి మనకు అందజేస్తారు. ఇంకేముంది.. ఇక మోస్ట్ డెలీషియస్ ఐస్‌క్రీంను ఆరగించేయడమే.
Comments
Please login to add a commentAdd a comment