food secrets
-
బిర్యానీ క్రేజ్ వేరే లెవల్.. 8.3 కోట్ల ఆర్డర్లు!
ప్రముఖ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ(Swiggy) కొన్ని రోజుల్లో 2024 ఏడాది పూర్తవుతుండడంతో వార్షిక నివేదికను విడుదల చేసింది. ‘హౌ ఇండియా స్విగ్గీ ఇట్స్ వే త్రూ 2024’ పేరుతో విడుదల చేసిన ఈ రిపోర్ట్‌లో ఆసక్తికర విషయాలు పంచుకుంది2024లో 8.3 కోట్ల ఆర్డర్లతో వరుసగా తొమ్మిదో ఏడాది కూడా భారత్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన వంటకంగా బిర్యానీ(Biryani) నిలిచింది. ముఖ్యంగా చికెన్ బిర్యానీకి 4.9 కోట్ల ఆర్డర్లు వచ్చాయి.2.3 కోట్ల ఆర్డర్లతో దోశ టాప్ బ్రేక్‌ఫాస్ట్‌గా నిలిచింది. 25 లక్షల మసాలా దోశ ఆర్డర్లతో బెంగళూరు అగ్రస్థానంలో నిలిచింది.డిన్నర్లోనే ఎక్కువ మంది ఫుడ్ ఆర్డర్ పెట్టారు. 21.5 కోట్ల ఆర్డర్లతో లంచ్ ఆర్డర్ల కంటే డిన్నర్ సమయాల్లో 29 శాతం పెరుగుదల నమోదైంది.అర్ధరాత్రి భోజనం చేయాలనుకునేవారికి చికెన్(Chicken) బర్గర్లు టాప్ ఛాయిస్‌గా నిలిచాయి. అర్ధరాత్రి నుంచి తెల్లవారుజామున 2 గంటల మధ్య 18.4 లక్షల ఆర్డర్లు నమోదయ్యాయి.ఇదీ చదవండి: 36,000 అడుగుల ఎత్తులో ‘ఛాయ్.. ఛాయ్..’బెంగళూరు వినియోగదారుడు పాస్తా విందు కోసం రూ.49,900 ఖర్చు చేయగా, ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి ఒకేసారి 250 ఉల్లిపాయ పిజ్జాలను ఆర్డర్ చేశాడు.స్విగ్గీ డైనౌట్(Dineout) ద్వారా 2.2 కోట్ల మంది వినియోగదారులకు రూ.533 కోట్లు ఆదా చేసినట్లు తెలిపింది. డిస్కౌంట్లలో రూ.121 కోట్లతో ఢిల్లీ అగ్రస్థానంలో నిలిచింది.స్విగ్గీ డెలివరీ భాగస్వాములు సమష్టిగా 1.96 బిలియన్ కిలోమీటర్లు ప్రయాణించారు. ఇది భారతదేశం చుట్టుకొలత కంటే చాలా రెట్లు ఎక్కువ. -
Pregnancy: గర్భిణీలు బరువు పెరగడం మంచిదేనా.?
నేను 85 కేజీల బరువున్నాను. ఇప్పుడు ఐదవ నెల. 3 కేజీల బరువు మాత్రమే పెరిగాను. మా స్నేహితులు 10 కేజీలు పెరగాలి అంటున్నారు. నా బరువు నియంత్రణలో ఉండటానికి మా డాక్టర్ నన్ను డైట్ ఫాలో అవ్వమన్నారు. దీని వల్ల నాకు ఏదైనా నష్టం ఉందా? – మౌళి, కోరంగిగర్భధారణలో బరువు తగ్గడం కష్టం, ఇది మంచిది కూడా కాదు. గర్భంతో ఉన్నప్పుడు సుమారు 8–10 కేజీల బరువు పెరుగుతారు. అంతకంటే ఎక్కువ బరువు పెరగకుండా ఉండటం ఈ రోజుల్లో చాలా అవసరం. ఎందుకంటే బీఎమ్ఐ 30 కంటే ఎక్కువ ఉంటే, గర్భం ధరించినపుడు, ఆ తరువాత కూడా ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. భవిష్యత్తులో గుండె సంబంధిత వ్యాధులు, డయాబెటిస్, కొన్ని రకాల క్యాన్సర్స్ లాంటివి చూస్తున్నాము. మీరు ఆరోగ్యకరమైన బరువుతో ఉంటే పుట్టబోయే పిల్లలకు కూడా ఒబేసిటీ, దానితో వచ్చే ఇతర ఇబ్బందులు రాకుండా ఉంటాయి. గర్భధారణ సమయంలో ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు చాలా అవసరం. డైటీషియన్ ఇచ్చే సలహాలతో అన్ని రకాల కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్, ఫ్యాట్లతో కూడిన ఆరోగ్యకమైన ఆహారాన్ని ఎంపిక చేసుకుని, తీసుకోవాలి. జంక్‌ఫుడ్ పూర్తిగా మానేయాలి. గర్భధారణ సమయంలో ఏమైనా అనారోగ్య సమస్యలు ఉన్నవారు తప్ప మిగిలిన వారందరూ ప్రతిరోజూ తప్పనిసరిగా వ్యాయామం చేయాలి. వారంలో కనీసం ఐదు రోజులైనా 45 నిమిషాల నుంచి ఒక గంట పాటు వ్యాయామం చేయాలి. నడిచేటప్పుడు అనువైన షూస్ ధరించండి. నడక, వ్యాయామాల వల్ల జెస్టేషనల్ డయాబెటిస్, ఒత్తిడి, డిప్రెషన్ లాంటివి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. తగిన జాగ్రత్తలు తీసుకుని స్విమింగ్ కూడా చేయొచ్చు. ఈ మధ్య ఆక్వా నాటల్ క్లాసెస్ అని కొన్ని స్విమింగ్ సెంటర్లలో నడుపుతున్నారు. అలాంటి స్విమింగ్ ఏ నెలలో అయినా చేయొచ్చు. ఇప్పటి వరకు వ్యాయామం చెయ్యనివారు నడక, ప్రాణాయామంతో మొదలుపెట్టండి. ఆఫీస్, ఇంట్లో లిఫ్ట్‌కి బదులు మెట్లు వాడటం, ఇంటిపనులు చేసుకోవడం, నడవడం లాంటివి చేయండి. సైకిలింగ్, జాయింట్ స్ట్రెచెస్, ఫిట్నెస్ వ్యాయామాలు చెయ్యకూడదు. ఒకవేళ వ్యాయామం చేసేటప్పుడు ఆయాసం వచ్చినా, ఊపిరి ఆడనట్టు ఉన్నా, ఛాతీలో, కడుపులో నొప్పి, బిడ్డ కదలికలు తగ్గడం లాంటివి ఉంటే వెంటనే గైనకాలజిస్ట్‌ని కలవండి. మీ చుట్టపక్కల ఎవరైనా పొగ తాగుతుంటే దూరంగా ఉండండి. గర్భధారణ సమయంలో మానసిక ప్రశాంతత చాలా అవసరం. మానసిక సమస్యలకు సంబంధించి ఏమైనా మందులు వాడటం వల్ల కూడా బరువు పెరుగుతుంటారు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, మీ కోసం కొంత సమయం తీసుకుని ఇష్టమైన పనులు చెయ్యడం, మీకు కావలసిన వ్యక్తులతో మనస్ఫూర్తిగా మాట్లాడటం, అవసరమైతే వారి సహాయం కోరడం చేయాలి. మీ స్నేహితులు, బంధువుల్లో ఎవరైనా గర్భవతులు ఉంటే వారితో మాట్లాడటం, వారి అభిప్రాయాలను కూడా తెలుసుకోవడం మంచిది. ఆరోగ్యకరమైన బరువు, వ్యాయామం సమంగా ఉండేటట్లు చూసుకుంటే ఏ విధమైన ఇబ్బందులూ ఉండవు. హెల్త్ ట్రీట్ఎండోమెట్రియాసిస్తో గుండెజబ్బుల ముప్పు!చాలామంది మహిళలు ఎండోమెట్రియాసిస్‌తో బాధపడుతుంటారు. దీని వల్ల మహిళలు నానా సమస్యలకు లోనవుతుంటారు. ముఖ్యంగా నెలసరి సమయంలో విపరీతంగా బాధపడుతుంటారు. ఎండోమెట్రియాసిస్ సమస్య కేవలం గర్భాశయ వ్యవస్థకు మాత్రమే పరిమితం కాదు. దీనివల్ల గుండెజబ్బులు, పక్షవాతం వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయని డేనిష్ శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడైంది. కోపన్హేగన్ యూనివర్సిటీ హాస్పిటల్‌కు చెందిన డాక్టర్ ఇవా హావెర్స్ బార్గర్సెన్ నేతృత్వంలో జరిపిన అధ్యయనంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇటీవల జరిగిన యూరోపియన్ సొసైటీ ఆఫ్ కార్డియాలజీ వార్షిక సదస్సులో డాక్టర్ ఇవా ఈ అధ్యయనం వివరాలను వెల్లడించారు. డెన్మార్క్‌లో 1977–2021 మధ్య కాలంలో ఎండోమెట్రియాసిస్ బాధితులైన 60 వేల మంది మహిళలకు సంబంధించిన ఆరోగ్య సమాచారాన్ని విశ్లేషించి, వైద్య నిపుణులు ఈ మేరకు నిర్ధారణకు వచ్చారు. -
Hyderabad: డెలీషియస్ గోల్డ్ ఐస్‌క్రీం అంటే అట్లుంటది.. మన హైదరాబాద్‌తోని!
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ అంటేనే వైవిధ్యానికి ఆలవాలం. ఆహర్యంతోపాటు ఆహారంలోనూ విభిన్నతకు అది వేదిక. రకరకాల రుచులకు అడ్డా. ఫుడ్ లవర్స్‌కు స్వర్గధామం. ఇక్కడ హైదరాబాదీ బిర్యానీయే కాదు.. దక్షిణ, ఉత్తర భారత సంప్రదాయ వంటకాలు, వెస్టర్న్ ఫుడ్, చైనీస్, జపనీస్.. ఇలా ఎన్నో దేశాల ఫుడ్ ఇక్కడ దొరుకుతుంది. అలా వారాంతంలో కాస్త డిఫరెంట్ ఫుడ్ తినాలనుకోవాలే కానీ.. దానికి కొదువే ఉండదు. అట్లుంటది మన హైదరాబాద్‌తోని. ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే... బంగారం ఏమైనా తింటామా.. ఏంటి? అని ఎవరైనా మాట వరుసకు అనేవారు ఒకప్పుడు.కానీ, ఇప్పుడు బంగారాన్ని కూడా తినేస్తున్నారండోయ్. గోల్డ్ దోశ, గోల్డ్ ఇడ్లీ, గోల్డెన్ స్వీట్స్.. ఇలా బంగారపు పూత ఉన్న ఫుడ్ ఐటెమ్స్‌ను హైదరాబాద్‌లో అందుబాటులోకి తెచ్చారు. ఈ వరుసలోకి ఐస్‌క్రీం కూడా వచ్చి చేరింది. హైదరాబాద్‌లో కూడా గోల్డ్ ఐస్‌క్రీం కూడా దొరుకుతోందా అని ఆశ్చర్యపోకండి. ఎందుకంటే మన నగరంలో అచ్చు 24 క్యారెట్ల గోల్డ్ ఐస్‌క్రీం లభిస్తోంది. అదెక్కడ అంటారా? మాదాపూర్‌లోని హూబర్, హోలీలో ఈ ఐస్క్రీంను అందుబాటులోకి తీసుకొచ్చారు. మైటీ మిడాస్ పేరుతో ఈ ఐస్క్రీంను అమ్ముతున్నారు. ఖరీదు జస్ట్.. రూ.1,179. సాధారణ కోన్‌లో డిఫరెంట్ ఫ్లేవర్స్‌లో సర్వ్ చేస్తుంటారు. ఐస్‌క్రీం పైన 24 క్యారెట్ల గోల్డ్ పేపర్‌తో అందంగా ముస్తాబు చేసి మనకు అందజేస్తారు. ఇంకేముంది.. ఇక మోస్ట్ డెలీషియస్ ఐస్క్రీంను ఆరగించేయడమే. -
లైఫ్‌లో మర్చిపోలేని వంటింటి చిట్కాలివిగో!
వంట చేసేటపుడు వంటకు చక్కటి రుచి రావాలన్నా, వంటను సులభంగా పూర్తి చేయాలన్నా, వంట ఇంట్లో పనులను ఈజీగా చక్కబెట్టుకోవాలన్నా కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ కచ్చితంగా తెలియాలి. అలాంటి వాటిల్లో కొన్నింటిని ఇక్కడ చూద్దాం! బెండకాయలు ఎక్కువ రోజుల పాటు తాజాగా ఉండాలంటే వాటి చివర్లను కట్ చేసి ప్లాస్టిక్ కవర్లో చుట్టి ఫ్రిజ్‌లో పెట్టాలి. అన్నం ఉడుకుతున్నప్పుడు బియ్యంలో కొన్ని చుక్కల నిమ్మరసం వేస్తే అన్నం పువ్వులా ఉడుకుతుంది.యాలకుల తొడిమలను పొడి చేసి టీ చేసేటప్పుడు చక్కెరతోపాటు అందులో వేయాలి. టీ రుచి అద్భుతంగా, సువాసనగా ఉంటుంది.పూరీలు తెల్లగా రావాలంటే వేయించేటప్పుడు నూనెలో కొన్ని జామ ఆకులు వేయాలి.అప్పడాలు ఎక్కువ నూనె పీల్చకూడదు అనుకుంటే వేయించే ముందు కాసేపు ఎండలో పెట్టాలి.పెరుగు పులిసిపోకుండా ఉండాలంటే చిన్న కొబ్బరి ముక్కలు అందులో వేయండి.బిస్కెట్ ప్యాకెట్లను బియ్యం డబ్బాలోఉంచితే తొందరగా మెత్తబడవు. కూరగాయల్ని, లేదా ఆకుకూరల్ని తరిగే ముందు ఉప్పు, పసుపు వేసిన నీటిలో కడిగితే క్రిములు పైకి తేలతాయ. అపుడు సులువుగా శుభ్రం చేసుకోవచ్చు.కారంపొడి డబ్బాలో చిన్న ఇంగువ ముక్క ఉంచితే తొందరగా పురుగుపట్టదు.నెయ్యి కాచేటపుడు రెండు లవంగాలుగానీ, తమలపాకు గానీ వేస్తేమంచి వాసన వస్తుంది. పాలు గడ్డగా తోడుకోవాలంటే.. పాలు బాగా మరిగించి, కాస్త వేడిగా ఉండగానే మజ్జిగ లేదా ఉండలులేని పెరుగు వేసి బాగా కలపాలి.అల్లం వెల్లుటి పేస్ట్ తయారు చేసేటపుడు, అల్లం, వెల్లుల్లి పొట్టు తొందరగారావాలంటే నీళ్లలో నానబెడితే మంచిది.ఇడ్లీ, దోసె పిండి, ఎక్కువ రోజులుతాజాగా ఉండాలంటే..పైన రెండు తమలపాకులు వేయండి. -
ఆరోగ్యం విషయంలో.. ఇలా ప్రవర్తిస్తున్నారా? జాగ్రత్త!
కూరలను బాగా నూనె పోసి వేయించి ఉప్పూకారం మసాలా దట్టించినందువల్ల నోటికి రుచిగా ఉండచ్చేమోగాని ఆ కూరలలోని పోషక విలువలన్నీ చచ్చిపోయి నిస్సారమవుతాయి. త్వరగా జీర్ణం కావు. నూనె ఎక్కువైనందువల్ల రక్తంలో కొలెస్ట్రాల్ పెరగటం, శరీరంలో కొవ్వు పేరుకుపోయి స్థూలకాయం రావటం తదితర ఇబ్బందులు తలెత్తుతాయి. విపరీతంగా ఉడకబెట్టినా అంతే... సారం లేని పదార్థాన్ని తిన్నట్టే. అది తినడం వల్ల ఆ ఆహారం మన ఒంటికి పట్టదు. అసలు మనం ఎలాంటి కూరలను ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం. మనం తిన్న ఆహారం వంటబట్టాలంటే నూనెలో వేయించిన కూరలను తినే అలవాటును మానుకోవాలి. ఉడికించిన కూరలలో కొద్దిగా తాలింపు వేసుకుని తినే విధంగా మన ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి.గింజధాన్యాలు, పప్పుధాన్యాలు, ఆకుకూరలు, దుంపలు, పండ్లు అన్నింటిలోను అన్ని రకాల పోషకాలు ఉన్నాయి. వాటి మోతాదుల్లో మాత్రమే తేడా ఉంటుంది. అందువల్ల మనకు అన్నీ అవసరమే. అయితే అన్నీ అందరికీ ఒకే రీతిలో అవసరం కావు. ఉదాహరణకు పాలు తాగే పసిపిల్లలకు ఒకరకమైన పోషకాలు కావాలి. చిన్న పిల్లలయితే మరొక రకమైన పోషకాలు కావాలి. యుక్తవయస్కులకు ఇంకొక రకం పోషకాలు కావాలి. అదేవిధంగా గర్భిణులకు ఒక రకమైన పోషకాలు, పెద్దవారికి, వృద్ధులకూ మరొక రకమైన పోషకాలూ కావాలి. అంటే అవసరాలనుబట్టి పోషకాలు మారతాయి. కాబట్టి తీసుకోవలసిన ఆహారం కూడా మారుతుంది. అదే విధంగా ఆహార చికిత్సా ప్రక్రియలో కూడా వ్యాధిని బట్టి, రోగిని బట్టి తీసుకోవలసిన ఆహారం మారుతుంది. ఆహారాన్ని ఎంపిక చేసుకోవటం అంటే ఇదే.నిజానికి ఆహారాన్ని ఎంపిక చేసుకోవటం అనుకున్నంత తేలికకాదు. పోషకాలను బట్టి పరిశీలిస్తే గింజధాన్యాలలో అన్ని రకాల పోషక విలువలు సమృద్ధిగా ఉన్నాయని, ఆకు కూరలు, పండ్లు, దుంపలతో సహా బాదం, ఖర్జూర మొదలైన ఎండు ఫలాలలో ఏదో ఒక పోషక విలువ లోపించి ఉండటాన్ని మనం గమనించవచ్చు. కేవలం ఈ కారణం వల్ల గింజధాన్యాలను మాత్రమే తీసుకుంటే లేనిపోని సమస్యలు వస్తాయి.అవి త్వరగా జీర్ణంకావు. అందువల్ల, గింజధాన్యాలతోబాటు తప్పనిసరిగా త్వరగా జీర్ణం అయ్యే ఆకు కూరలు, పండ్లు కూడా అవసరం. ఇవి అన్నీ తెలిసినప్పుడే సమీకృత ఆహారాన్ని ఎంపిక చేసుకోవటం సులభం అవుతుంది. ఈ విషయంలో మనలో చాలామందికి ఉన్న సాధారణ ఆహార విజ్ఞానం సరిపోదు. పోషకాహార నిపుణులతో లేదా ప్రకృతి వైద్యులతో సంప్రదించి, వారి సలహా తీసుకోవటం అవసరం.సమీకృత ఆహారం.. కొన్ని సూచనలు..ఎటువంటి ఆహార పదార్థాలను ఎంపిక చేసుకోవాలన్న విషయాన్ని అలా ఉంచితే సాధారణ ఆరోగ్యం దృష్ట్యా ఈ కింది సూచనలను పాటించటం మంచిదని ప్రకృతి వైద్యులు చెబుతుంటారు. రోజూ ఉదయం పచ్చికూర ముక్కలు (వెజిటబుల్ సలాడ్) తీసుకోవటం మంచి అలవాటు. దంతాల పటుత్వం లేని వారు కూర ముక్కలను మిక్సీలో వేసుకుని చిన్న చిన్న ముక్కల రూపంలోగాని, లేక జ్యూస్ రూపంలోగాని తీసుకోవచ్చు. అన్నిరకాల, అన్ని రంగుల పండ్లను లేదా పళ్లరసాలను తీసుకోవాలి. ఆ క్రమంలో కాలానుగుణంగా వచ్చే సీజనల్ ఫలాలను తప్పనిసరిగా తీసుకోవాలి. మనం తినే ఆహారంలో కనీసం 30 లేక 40 శాతం పండ్లు ఉంటే మంచిది. దంపుడు బియ్యం లేక మర పట్టని ముతకబియ్యం శ్రేష్ఠం. చిరుధాన్యాలు వాడటం మంచిది. మొలకెత్తిన గింజలు, కొబ్బరి, ఖర్జూర ప్రతిరోజూ తీసుకోవటం మంచిది.ఇలా తీసుకోవాలి..కనీసం వారానికి నాలుగు రోజులు ఆకుకూరలను ఇగురు లేదా పప్పు రూపంలో తీసుకోవాలి.కాఫీ, టీ తాగే అలవాటును నెమ్మదిగా మానుకోవటం మంచిది, అలా మానుకోవడం సాధ్యం కాకపోతే, కనీసం మోతాదును తగ్గించాలి. రోజుకి ఒకటి లేక రెండుసార్లకు మించి తీసుకోరాదు.పొగాకు, జర్దా, ధూమపానం, మత్తుపానీయాలను పూర్తిగా మానుకోవాలి.కృత్రిమ రసాయనాలతో తయారు చేసిన, నిల్వ ఉన్న బేకరీ వస్తువులు, శీతల పానీయాలు (కూల్ డ్రింక్స్), చాక్లెట్లు, ఫాస్ట్ఫుడ్స్, ఐస్ క్రీమ్ లాంటివి మన శరీరానికి హాని చేస్తాయి. అందువల్ల వీటిని సాధ్యమైనంత వరకు తగ్గించటం మంచిది.ఉప్పు వాడకాన్ని బాగా తగ్గించాలి. ఎందుకంటే, మన శరీరానికి అవసరమైనంత ఉప్పు మనం తీసుకునే పండ్లు, కూరగాయలలోనే ఉంటుంది.ఆహారం ఎంపికలో మరొక ప్రధాన సమస్య అమ్లయుతమైన ఆహారం, క్షార యుతమైన ఆహారం, ఆమ్లాలు, క్షారాలు రెండూ మనకు అవసరమే అయినా, వాటి నిష్పత్తిలో తేడా ఉంది. ఆమ్లాల కన్నా క్షారాలు మనకు అధికంగా కావాలి. మనం తీసుకునే ఆహారం కూడా అదేవిధంగా ఉండాలి. అంటే ఆమ్లయుతమైన పదార్థాలు తక్కువగా, క్షారయుతమైన పదార్థాలు. ఎక్కువగా ఉండే విధంగా ఆహారాన్ని ఎంపిక చేసుకోవాలి.అదేవిధంగా రోగగ్రస్థుల విషయంలో వ్యాధినిబట్టి ఆహార ఎంపిక ఉంటుంది. ఇది. అయితే ప్రధానంగా వైద్యుల పర్యవేక్షణలో జరగాలి.ఇవి చదవండి: మంచి ఫిటింగ్, డిజైన్, ప్రింట్లతో.. ఈ తరం మెచ్చేలా డ్రెస్ డిజైనింగ్.. -
ఈ ట్రిక్ వాడారో 'కరకరలాడే బిస్కెట్లు' ఇక మీ సొంతమే!
'మనం తినేవాటిలో అనేక పదార్థాలుంటాయి. అందులో మెత్తవైనా ఉండొచ్చు, గట్టివిగానూ ఉండొచ్చు. అయితే అప్పడాలు, బిస్కెట్లలో చాలామటుకు కరకరలాడే వాటినే ఇష్టపడుతుంటాం. బిస్కెట్లను తీసుకున్నట్లయితే వీటిలో కూడా చాలా రకాలుంటాయి. మనకు ఇష్టమైనటువంటి కొన్ని రకాల బిస్కెట్లలో ఈ కరకరలాడే బిస్కెట్లు తోడైతే ఆ రుచి, అనుభూతియే వేరు. మరెందుకు ఆలస్యం వాటిని గురించి ఇప్పుడు తెలుసుకుందాం!' కరకరలాడాలంటే.. బిస్కెట్లు మెత్తగా అవ్వకుండా కరకరలాడాలంటే ఈ జాగ్రత్తలు తీసుకోండి! • ప్లాస్టిక్, అల్యుమినియం డబ్బాలు, గాజు పాత్రల్లో బిస్కెట్లు, కుకీలను నిల్వచేయాలి. • గాలి చొరబడకుండా పెడితే ఎక్కువరోజులపాటు క్రిస్పీగా ఉంటాయి. • డబ్బాల్లో నిల్వచేసేటప్పుడు అడుగు భాగంలో రెండుమూడు వరుసల్లో టిష్యుపేపర్లు వేసి తరువాత బిస్కెట్లు పెట్టాలి. • బిస్కెట్లపైన మరో రెండు వరుసల్లో టిష్యూపేపర్లు వేసి పైన బిస్కెట్లు పెట్టాలి. • ఇలా నిండుగా పెట్టి గాలిచొరబడకుండా మూత పెట్టాలి. • జిప్‌లాక్ పౌచ్‌లలో నిల్వచేస్తే కూడా కుకీలు తాజాగా ఉంటాయి. • గాలి చొరబడని డబ్బాలు, జిప్‌లాక్ పౌచ్‌లను రిఫ్రిజిరేటర్లో పెడితే మరిన్ని రోజులు బిస్కెట్లు తాజాగా ఉంటాయి. • అనుకోకుండా సరిగా నిల్వచేయనప్పుడు మెత్తబడిన కుకీలను అవెన్ లేదా ఎయిర్‌ఫ్రైయర్‌లో ఉంచి వేడిచేస్తే మళ్లీ క్రిస్పీగా మారతాయి, వీటిని కూడా నిల్వచేసుకోవచ్చు. ఇవి కూడా చదవండి: చలికాలంలో బెల్లం ఎందుకు తినాలి?నకిలీ బెల్లాన్ని ఎలా గుర్తించాలి? -
రంజాన్ స్పెషల్ షేర్ కుర్మా తయారీ!
-
నీరసంగా అనిపిస్తోందా..? ఇవి లాగించండి, తక్షణమే శక్తి వస్తుంది..!
కొన్ని సార్లు వీపరీతంగా ఆకలి అనిపిస్తుంది. తక్షణం శక్తి కావాలనిపిస్తుంది. తినగానే వెంటనే శక్తిని ఇచ్చే ఆహార పదార్థాలు ఏవి? ఆహారంలో ఏ ఏ రకాలు ఉంటాయి? ఏవి తింటే మంచిది? వాటి గురించి తెలుసుకోండి. కార్బోహైడ్రేట్లు: కార్బోహైడ్రేట్లు శరీరానికి శక్తి రావడానికి ప్రాథమిక మూలం. పండ్లు, కూరగాయలు, రొట్టె, పాస్తా మరియు అన్నం వంటి ఆహార పదార్థాల్లో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల వీలైనంత త్వరగా శక్తిని పొందవచ్చు. ప్రోటీన్లు: శరీర కణజాలాల పెరుగుదల మరియు మరమ్మత్తులకు ప్రోటీన్లు చాలా అవసరం. గుడ్లు, గింజలు, చీజ్ మరియు లీన్ మీట్ వంటి ప్రోటీన్-రిచ్ ఫుడ్స్ తినడం వల్ల స్థిరమైన శక్తిని శరీరానికి లభించవచ్చు. ఆరోగ్యకరమైన కొవ్వులు: గింజలు, అవకాడోలు మరియు చేపలలో లభించే ఆరోగ్యకరమైన కొవ్వులు దీర్ఘకాల శక్తిని అందిస్తాయి. ఇవి ఆరోగ్యానికి మంచిది కూడా. కెఫిన్ అధికంగా ఉండే ఆహారాలు: కాఫీ, టీ మరియు చాక్లెట్ వంటి కెఫీన్ కలిగిన ఆహారాలు మరియు పానీయాలు కేంద్ర నాడీ వ్యవస్థను ప్రేరేపించడం ద్వారా తాత్కాలిక శక్తిని అందిస్తాయి. అయితే ఇవి ఆరోగ్యానికి ఎంత వరకు మేలు చేస్తాయన్న ఆలోచనను బట్టి అవసరమైన మోతాదులో మాత్రమే తీసుకోవాలి ఐరన్ అధికంగా ఉండే ఆహారాలు: కణాలకు ఆక్సిజన్‌ను చేరవేసే హిమోగ్లోబిన్‌ను ఉత్పత్తి చేయడానికి శరీరానికి ఐరన్ అవసరం. బచ్చలికూర, కాయధాన్యాలు, రెడ్ మీట్ మరియు టోఫు వంటి ఇనుము అధికంగా ఉండే ఆహారాలు అలసటను నివారించడంలో మరియు శక్తిని అందించడంలో సహాయపడతాయి. ఈ ఆహారాలు తక్షణ శక్తిని అందించగలవని గమనించడం ముఖ్యం. శక్తి స్థాయిలను నిర్వహించడానికి అత్యంత ప్రభావవంతమైన మార్గం వివిధ రకాల పోషకాలను కలిగి ఉన్న సమతుల్య ఆహారాన్ని తినడం మాత్రమే. అధికంగా ప్రాసెస్ చేయబడిన ఆహారాలు, జంక్ ఫుడ్ లాంటివి వీలైనంత వరకు తినకూడదు. దీని వల్ల చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరుగుతాయి. -డా.నవీన్ నడిమింటి, ప్రముఖ ఆయుర్వేద నిపుణులు -
వేసవిలో ఉల్లిపాయలు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి
-
ఎంతెంత మెంతి.. అంతంత రుచి
మెంతి ఆకులు, గింజలు వంటింటి నేస్తాలని మనకు తెలిసిందే! కుండీల్లో పెరిగే ఆకులు కూరకు రుచినిస్తాయి. జీలకర్రతో దోస్తీ చేసే మెంతులు. ఘుమఘుమలతో మదిని దోచేస్తాయి. ఆరోగ్యప్రదాయినిగా పేరొందిన మెంతి. వేపుడుకైనా, గ్రేవీకైనా రెడీ అంటూ ముందుంటుంది. వెజ్, నాన్‌వెజ్ వంటకాలకు ఇంత అనేది లేకుండా ఎంతెంత మెంతి వేస్తే అంతంత రుచిని జత చేరుస్తుంది. ఖీమా సోయా మెంతి కావలసినవి: నూనె – పావు కప్పు; ఉల్లిపాయ – 2 (మీడియం సైజువి); అల్లం–వెల్లుల్లి పేస్ట్ – టేబుల్ స్పూన్లు; ఖీమా– పావు కేజీ; జీలకర్ర – టీ స్పూన్ (వేయించి, పొడి చేయాలి); ఎర్ర మిరపకాయలు – 2; పసుపు పొడి – పావు టీస్పూన్; ఉప్పు – తగినంత; నల్ల మిరియాలు – 8–10; యాలకులు – 2; లవంగాలు – 4; సోంపు – అర టీ స్పూన్; టమోటా – 1 (సన్నగా తరగాలి); నీళ్లు – కప్పు; మెంతి ఆకులు – అర కప్పు; సోయా – పావు కప్పు; జావత్రి, జాజికాయ పొడులు – చిటికెడు; పచ్చిమిర్చి – 3; కొత్తిమీర – తగినంత. తయారీ: ∙బాణలిలో నూనె, ఉల్లిపాయ తరుగు వేసి లేత గోధుమరంగు వచ్చేవరకు వేయించాలి. ∙అల్లం – వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపాలి. ∙పచ్చిమిర్చి వేగాక, ఖీమా వేసి, రంగు మారే వరకు బాగా వేయించాలి. 8–10 నిమిషాలు లేదా నూనె విడిపోయే వరకు ఉడికించాలి. ∙జీలకర్ర, ఎండుమిర్చి, పసుపు, ఉప్పు వేసి బాగా కలపాలి. ∙నల్ల మిరియాలు, యాలకులు, లవంగాలు, సోంపు వేసి కలపాలి. ∙టొమాటోలు వేసి 2–3 నిమిషాలు ఉడికించాలి. ∙టేబుల్ స్పూన్ నీళ్లు పోసి కలపాలి. దీంట్లో సోయా వేసి, మూత పెట్టి సన్నని మంట మీద 20 నిమిషాలు ఉడికించాలి. ∙మెంతి ఆకులు, మెంతులు వేసి బాగా కలపాలి. ∙నూనె విడిపోయే వరకు మూతపెట్టి, తక్కువ మంటపై ఉడికించాలి. ∙జాపత్రి, జాజికాయ పొడి, ధనియాల పొడి వేసి బాగా కలపాలి. ∙కొత్తిమీర తరుగు వేసి, మూతపెట్టి రెండు నిమిషాలు ఉంచి, తర్వాత సర్వ్ చేయాలి. మెంతి ఫిష్ కర్రీ కావలసినవి: చేప ముక్కలు – 4; తాజా మెంతి ఆకులు – 4 కప్పులు; నూనె – 2 టేబుల్ స్పూన్లు; మెంతులు – టీ స్పూన్; ఉల్లిపాయ తరుగు – అర కప్పు; అల్లం–వెల్లుల్లి పేస్ట్ – టీ స్పూన్; పెద్ద టమోటా – 1 (సన్నగా తరగాలి); కారం – 2 టీ స్పూన్లు; ధనియాల పొడి – టీ స్పూన్; జీలకర్ర పొడి – అర టీ స్పూన్; పసుపు – పావు టీ స్పూన్; ఉప్పు – రుచికి తగినంత; నిమ్మరసం – అర టీ స్పూన్. తయారీ: ∙చేప ముక్కలకు ఉప్పురాసి, రుద్ది, పక్కన పెట్టి, ఓ ఐదు నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. బాణలిలో నూనె వేడి చేసి, మెంతులు వేసి ముదురు గోధుమ రంగు వచ్చేవరకు వేయించాలి. అప్పుడు నూనె నుండి గింజలను బయటకు తీయాలి. అదే నూనెలో ఉల్లిపాయలు వేసి, వేయించాలి. ∙అల్లం– వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపి, తర్వాత సన్నగా తరిగిన టొమాటోలు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి, మిశ్రమం సాస్ లాగా మారే వరకు ఉడికించాలి. తర్వాత మెంతి ఆకులను వేసి, కలపాలి. ∙ చేప ముక్కలు, ఉప్పు, కొద్దిగా నీరు (కావాలనుకుంటే) వేసి నెమ్మదిగా మంట మీద ఉడికించాలి. ∙వడ్డించే ముందు కొంచెం నిమ్మరసం పిండాలి. మెంతి కార్న్ మలాయ్ కావలసినవి: మెంతి ఆకులు – 2 కప్పులు; మొక్కజొన్న గింజలు – అర కప్పు; టొమాటోలు – 4; జీడిపప్పు – 15; పాలు – కప్పు; క్రీమ్ – 2 టేబుల్ స్పూన్లు; యాలకుల పొడి – పావు టీ స్పూన్; పసుపు – పావు టీ స్పూన్; కారం – పావు టీ స్పూన్; పంచదార – టీ స్పూన్; గరం మసాలా – పావు టీ స్పూన్; వంట నూనె – 2 టేబుల్ స్పూన్లు; వెన్న – 2 టేబుల్ స్పూన్లు. తయారీ: ∙ఒక గిన్నెలో మెంతి ఆకులు, టీ స్పూన్ స్పూన్ ఉప్పు వేసి, మూతపెట్టి, 10 నిమిషాలు పక్కన ఉంచాలి. ∙తర్వాత మెంతి ఆకులను మంచినీటితో బాగా కడగాలి.∙మొక్కజొన్న గింజలను ప్రెషర్ కుకర్‌లో వేసి 3 విజిల్స్ వచ్చేవరకు ఉంచి, పక్కన పెట్టుకోవాలి. ∙జీడిపప్పును తరిగి 3 టేబుల్స్పూన్ల పాలలో 15 నిమిషాలు నానబెట్టాలి.∙నానబెట్టిన జీడిపప్పును గ్రైండ్ చేసి, మెత్తగా పేస్ట్ చేయాలి. ∙తరిగిన టొమాటోను ప్రెజర్ కుకర్‌లో ఒక విజిల్ వచ్చేవరకు ఉడికించాలి. తర్వాత మెత్తగా గ్రైండ్ చేయాలి. దీంట్లో నీళ్లు కలపద్దు. ∙బాణలిలో నూనె, వెన్న వేసి వేడి చేయాలి. అందులో జీలకర్ర, యాలకుల పొడిని కలపాలి. ∙ ఇప్పుడు తరిగిన మెంతి ఆకులు వేసి, నిమిషం సేపు వేయించాలి. ∙ఇప్పుడు టొమాటో ప్యూరీ, ఉప్పు, కారం, పసుపు వేసి కలపాలి. ∙టొమాటో, మసాలా నుండి నూనె విడిపోయే వరకు ఉడికించాలి. ∙దీంట్లో జీడిపప్పు పేస్ట్ వేసి నిమిషం సేపు ఉడికించాలి. ∙దీంట్లో క్రీమ్ కలిపి, మూతపెట్టి సన్నని మంట మీద నిమిషం సేపు ఉడికించాలి. ∙ఈ మలాయ్ కర్రీని నాన్ లేదా రోటీ లేదా పరాఠాతో వేడి వేడిగా వడ్డించాలి. ఓట్స్ మెంతి కావలసినవి: ఓట్స్ – ముప్పావు కప్పు (గ్రైండ్ చేసి, పక్కనుంచాలి); మెంతి ఆకులు – 2 కప్పులు; బొంబాయి రవ్వ – 2 టేబుల్ స్పూన్లు; పెరుగు – 3 టేబుల్ స్పూన్లు; కారం – ఒకటిన్నర టీ స్పూన్; జీలకర్ర – టీ స్పూన్; ధనియాల పొడి – టీ స్పూన్; పసుపు – పావు టీ స్పూన్; పచ్చిమిర్చి పేస్ట్ – టీ స్పూన్; ఇంగువ – చిటికెడు; ఉప్పు – తగినంత; నూనె – టీ స్పూన్; ఆవాలు – అర టీ స్పూన్; నువ్వులు – అర టీ స్పూన్. తయారీ: ∙ఒక పాత్రలో ఓట్స్, మెంతి ఆకులు, రవ్వ, పెరుగు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు, పచ్చిమిర్చి పేస్ట్, ఇంగువ, ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు జత చేసి, బాగా కలపాలి. ∙కలుపుకున్న పిండిని చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని, ఒత్తి పక్కనుంచాలి. ∙పొయ్యి మీద పెనం పెట్టి, వేడయ్యాక సిద్ధం చేసుకున్న ముట్టీలను నూనె వేసి లేదా వేయకుండానే వేయించుకోవాలి. ∙విడిగా ఒక మూకుడును స్టౌ మీద పెట్టి వేడయ్యాక రెండు టీ స్పూన్ల నూనె వేయాలి. దీంట్లో ఆవాలు, నువ్వులు వేసి చిటపటలాడాక వేయించిన ముట్టీలను వేసి, మరోసారి వేయించాలి. వీటిని వేడి వేడిగా ఏదైనా గ్రీన్ చట్నీతో సర్వ్ చేయాలి. -
Jackfruit: ఆరోగ్యానికి కేరాఫ్ పనస
సాక్షి, అమరావతి: రోజువారీ ఆహారంలో పనసపొడిని కలుపుకుని తినడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడంతో పాటు రక్తపోటునూ నివారించుకోవచ్చు. రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు. జీర్ణక్రియను మెరుగుపర్చుకోవచ్చు. పనస పొడిలో ప్రోటీన్ కూడా ఎక్కువేనని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా షుగర్ వ్యాధిగ్రస్తులకు ఇది ‘తీపి’ కబురు. ప్రతి రోజూ 30 గ్రాములకు తగ్గకుండా పనస పొడిని ఆహారంలో కలిపి మూడు నెలల పాటు తీసుకుంటే షుగర్ వ్యాధిని అదుపులో ఉంచుకోవచ్చునని ఇటీవల జరిగిన పలు పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ (ఏడీఏ) కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించింది. ప్రపంచ వ్యాప్తంగా పేరున్న ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏవో) మంచి ఆహారం జాబితాలో మన పనస (జాక్‌ఫ్రూట్)కు చోటు దక్కడమే ఇందుకు నిదర్శనం. పరిశోధనలు తేల్చిన నిజం.. కరోనా జనాన్ని హడలెత్తిస్తున్న నేపథ్యంలో చాలా మంది వాళ్లకు తెలియకుండానే షుగర్ పేషెంట్లు అయ్యారు. అంతకుముందే ఉన్న వాళకైతే మరింత పెరిగింది. ఏపీ, తెలంగాణలోనైతే ఈ బెడద మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర, ఏపీకి చెందిన డాక్టర్లు కొందరు దీనిపై దృష్టి సారించారు. వారిలో ఏపీలోని శ్రీకాకుళానికి చెందిన జనరల్ మెడిసిన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ గోపాలరావు, మహారాష్ట్ర పుణెలోని చెల్లారామ్ డయాబెటిస్ ఇన్స్టిట్యూట్ సీఈవో డాక్టర్ ఏజీ ఉన్నికృష్ణన్ ఉన్నారు. షుగర్ బెడద తగ్గించడానికి ఏమైనా పండ్లు పనికి వస్తాయా? అని పరిశోధన చేశారు. అప్పుడు బయటపడిందే ఈ పనస ప్రయోజనం. వాళ్లు కనిపెట్టిన అంశాలన్నింటినీ ఇటీవల అంతర్జాతీయ సైన్స్ పత్రిక నేచర్ ప్రచురించింది. వారం పాటు క్రమం తప్పకుండా పసన పొడిని తింటే రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ తగ్గినట్టు కనుగొన్నారని నేచర్ పత్రిక వివరించింది. ఈ విషయాన్ని అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ (ఏడీఏ) ధ్రువీకరించింది. ఎలా తీసుకోవాలంటే.. ఇటీవలి కాలంలో చాలామంది షుగర్ వ్యాధిగ్రస్తులు బియ్యానికి బదులు చిరు ధాన్యాలను వాడుతున్నారు. వాటితో పాటు పనసపొడిని కలుపుకుని తింటే మంచిదని వైద్యులు సలహా ఇస్తున్నారు. టైప్–2 డయాబెటిస్ ఉన్న వారిపై వరుసగా ఏడు రోజుల పాటు పనస పొడి ప్రయోగం చేసిన తర్వాత షుగర్ లెవెల్స్ తగ్గినట్టు డాక్టర్లు నిర్ధారణకు వచ్చారు. పైగా పనస పొడి వాడకం వల్ల శరీర బరువును తగ్గించుకోవచ్చు. పండిన పనస తొనలను తింటే షుగర్ పెరిగే అవకాశం ఉంది. అయితే పక్వానికి వచ్చిన కాయల నుంచి పనస పొడిని తయారు చేస్తారు కాబట్టి షుగర్ నియంత్రణలో ఉంటుంది. పనస గింజ ల్ని కూడా ఎండబెట్టి కూర వండుతారు. మొత్తంగా పనస కాయ చాలా రకాలుగా.. వ్యాధి నిరోధకశక్తిగా పనికి వస్తుంది. -
క్వారంటైన్ సెంటర్లలో ఆహారం
-
కూరలో ఉప్పు ఎక్కువైందా.. ఇలా చేయండి
► ఇడ్లీ, దోసెల కోసం బియ్యం, మినప్పప్పు నానబెట్టేటప్పుడు ముందే కడగాలి. నానిన తర్వాత గ్రైండ్ చేసేటప్పుడు కడగడం వల్ల విటమిన్లు నీటిలో పోతాయి. అంతేకాకుండా దుకాణాల్లో వాటికి పురుగుపట్టకుండా నిల్వ చేయడానికి కీటక నాశినులను గనుక వాడి ఉంటే కడగకుండా నానబెట్టినప్పుడు ఆ అవశేషాలతో కూడిన నీటినే బియ్యం, మినప్పప్పు పీల్చుకుంటాయి కాబట్టి అవన్నీ శరీరంలోకి వెళ్లే ప్రమాదం కూడా ఉంటుంది. ► కూరల్లో ఉప్పు ఎక్కువైనప్పుడు అందులో బంగాళాదుంప ముక్కలను వేయాలి. అధికంగా ఉన్న ఉప్పును పొటాటో పది నిమిషాల్లో పీల్చుకుంటుంది. ► గారెల కోసం తయారు చేసుకున్న పిండిలో నీరు ఎక్కువై నూనెలో వేయగానే అంచుల దగ్గర సన్న పలుకులుగా విడిపోతున్నట్లయితే, పిండిలో ఒక టేబుల్‌స్పూను నెయ్యి కలపాలి. ► కూరలు, పులుసులు, సూప్‌లు మరీ పలచగా ఉన్నట్లనిపిస్తే అందులో ఒక టేబుల్‌స్పూను కార్న్‌ఫ్లోర్ కలపాలి. కార్న్‌ఫ్లోర్‌ను అలాగే వేస్తే ఉండలవుతుంది. ముందుగా ఒక కప్పులో వేసి చన్నీటితో కలిపి ఆ మిశ్రమాన్ని కూరల్లో వేస్తే సమంగా కలుస్తుంది. -
ఈ పదితో గుండె పదిలం
సాక్షి,హైదరాబాద్: మనం ఆహారం తీసుకునే ముందు అవి తీసుకుంటే లావెక్కుతామా, స్లిమ్ అవుతామా అనే చూస్తాం కానీ..శరీర అవయవాలు ముఖ్యంగా గుండెకు సంబంధించి మనం తీసుకునే ఆహారం ఎలాంటి ప్రభావం చూపుతుందని మాత్రం ఆలోచించం. గుండె పదికాలాల పాటు పదిలంగా ఉండాలంటే ఈ పది ఆహారపదార్ధాలను మన రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. నిత్యం మన వంటింట్లో అందుబాటులో ఉండే ఈ పదర్ధాలను డైట్లో తీసుకుంటే ఆరోగ్యకరమైన గుండె మన సొంతమంటున్నారు నిపుణులు. మరి ఆ టాప్ 10 సూపర్ ఫుడ్స్ ఏంటో చూద్దాం...వెల్లుల్లి మన హృదయానికి రక్షణ కవచంలా పనిచేస్తుంది. వీటిని రోజూ తీసుకుంటే గుండె రక్తకణాలు పలుచన కావడంతో పాటు రక్త ప్రసరణ సాఫీగా జరిగి బీపీని కంట్రోల్లో ఉంచేలా చేస్తుంది. శరీర వేడిని తగ్గిస్తూ తాపాన్ని తీర్చే వాటర్మెలన్ గుండె ఆరోగ్యానికి వరప్రసాదం. ఇది కొలెస్ర్టాల్ లెవెల్‌ను తగ్గించడంతో పాటు ముప్పుకారక ఫ్రీ రాడికల్స్‌ను తొలగించి హృదయ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. డిప్రెషన్‌ను దూరం చేసే డార్క్ చాక్లెట్ గుండె ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తుంది.డార్క్ చాక్లెట్ బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను తగ్గించడంతో పాటు ఆరోగ్యకర స్థాయిలో కొలెస్ర్టాల్‌ను మెయింటెయిన్ చేస్తుంది. నిత్యం ఓట్‌తో చేసిన ఆహార పదార్ధాలతో గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.వీటిలో ఉండే ఫైబర్‌తో చెడు కొవ్వులు తగ్గడమే కాక జీర్ణశక్తి మెరుగవుతుంది. ఇక బాదం, జీడిపప్పు, కిస్మిస్ వంటి నట్స్‌ను బ్రేక్‌ఫాస్ట్‌లో తీసుకుంటే శరీరంలోని చెడు కొలెస్ర్టాల్ తగ్గడంతో పాటు అవసరమైన విటమిన్ ఈ, ప్రొటీన్ ఫైబర్లు శరీరానికి అందుతాయి. ఇంకా గుండె ఆరోగ్యానికి గ్రీన్ టీ, ఫ్యాటీ ఫిష్, సినామన్‌లు ఎంతో ఉపకరిస్తాయని పలు అథ్యయనాలు వెల్లడించాయి. -
కాకరకాయని కూడా కమ్మగా తినేస్తాను!
స్లిమ్‌గా, మోస్ట్ గ్లామరస్‌గా కనిపించే కాజల్ అగర్వాల్ మంచి ఫుడ్ లవర్. ‘అత్తారింటికి దారేది’ డైలాగ్ తరహాలో ‘ఏమేం తినాలో కాదు... ఎక్కడ ఏమేం తినకూడదో తెలిసినవారే నిజమైన ఫుడ్డీ’’... అచ్చం కాజల్లాగా. కాజల్ చెప్పే తిండి కబుర్లు. పంజాబీ వంటకాల గురించి మాట్లాడుతుంటే నాకు నా చిన్నప్పటి సంఘటనలు గుర్తొచ్చేస్తున్నాయి. మా బామ్మ బాగా వంటలు చేసేది. అమృతం అంత పసందుగా ఏదీ ఉండదంటారు. మా బామ్మ చేతి వంట అమృతమే అనుకోండి. పంజాబీలు ఉదయం టిఫిన్‌గా దాదాపు పరోటాలే తింటారు. మా ఇంట్లో అయితే మా బామ్మ రోజూ అవే వండేది. ఉదయం వేడి వేడి పరోటాలు, కుర్మా లాగించేస్తుంటే ఎంతో కమ్మగా ఉండేది. ఇక, ఆదివారం అంటే మాకు చాలా ప్రత్యేకం. ఆ రోజు ఏది ఉన్నా లేకపోయినా రాజ్మా చావల్, పనీర్ మఖానీ, పరోటాలు ఉండాల్సిందే. ఆ రోజు మా ఇంట్లో బ్రేక్‌ఫాస్ట్‌కి బ్రేకే. దానికి బదులు ‘బ్రంచ్’ (ఉదయం టిఫిన్, మధ్నాహ్న భోజనం మధ్యలో దాదాపు పదకొండు గంటల ప్రాంతంలో తీసుకునేదాన్ని బ్రంచ్ అంటారు) ఏర్పాటు చేసుకుంటాం. నా కజిన్స్, ఇంకొంతమంది బంధువులు ఆ రోజు ఠంచనుగా మా ఇంటికి వచ్చేవారు. మేమంతా కలిసి బ్రంచ్ని ఓ పట్టుపట్టేవాళ్లం. ఆదివారం నాడు ఇంకో ప్రత్యేకత ఏంటంటే.. ఆరోజు రాత్రికి తప్పనిసరిగా పావ్ బాజీ చేసుకుంటాం. నేను అసలు సిసలు పంజాబీ అమ్మాయిని. పరోటాలు, చోలే బటూరా (శెనగల కూర), రాజ్మా చావల్... ఇవన్నీ మొహమాటం లేకుండా లాగించేయడం నాకిష్టం. ఒకప్పుడు ఇవన్నీ ఎంతో ఆనందంగా తినేదాన్ని. అప్పుడు బరువు గురించి ఆలోచనే ఉండేది కాదు. కానీ, ఇప్పుడలా కాదు. ఇది తింటే ఇన్ని కేలరీలు పెరుగుతాయనీ, అది తింటే కొవ్వు పెరుగుతుందని.. ఇలా ఎన్నో లెక్కలు. హీరోయిన్ అన్న తర్వాత ఈ విషయంలో లెక్కలు తప్పితే, ఇక కెరీర్ అవుట్. అందుకే, సినిమాల్లోకొచ్చాక నచ్చిన వంటకాలకు కొంతవరకూ దూరం కాక తప్పలేదు. ముఖ్యంగా పిజ్జాలు, పనీర్ మఖానీ (పనీర్‌తో తయారు చేసే కూర) తినడం మానేశాను. మా అమ్మగారు మంచి కుక్. నా కోసం స్వయంగా తనే వండుతుంది. పనీర్, బటర్లాంటివి వాడొద్దని చెప్పేశాను. అలాగే, బియ్యానికి బదులు ‘క్యూనౌ’ (మంచి పోషకాలున్న ఒక రకమైన ధాన్యం) వాడుతున్నాను. నేను ఒకప్పుడు మాంసాహారం తీసుకునేదాన్ని. కానీ, ఇప్పుడు శాకాహారిగా మారిపోయాను. ఎంతగా మారానంటే.. కాకరకాయని కూడా నొసలు చిట్లించకుండా ఆనందంగా తినేస్తాను. ఫిష్ ఫ్రైలు, చికెన్ కర్రీలకన్నా ఇప్పుడు పప్పు కూరలే నాకెంతో రుచిగా అనిపిస్తున్నాయి. చెప్పాలంటే నా శరీరం కూడా శాకాహారానికి బాగా అలవాటుపడిపోయింది. సినిమాల్లోకి రాకముందు ఉత్తరాది వంటకాలకు మాత్రమే అలవాటుపడిన నేను దక్షిణాదికొచ్చిన తర్వాత ఆహార నియమాలు మార్చేసుకున్నాను. ఇడ్లీ, దోసెలు తినడం అలవాటయ్యింది. సాంబార్, పచ్చళ్లు కూడా తింటున్నాను. నా కజిన్స్ పంజాబ్‌లో ఉంటారు. ఎప్పుడైనా తీరిక దొరికినప్పుడు వాళ్ల దగ్గరకు వెళుతుంటాను. అప్పుడు మాత్రం పరోటాలు ఓ పట్టుపడతాను. వాస్తవానికి నాకు విభిన్న రకాల వంటకాలను రుచి చూడాలని ఉంటుంది. కానీ, నోరు కట్టేసుకుంటాను. ముఖ్యంగా ముంబయ్‌లోని చర్చ్ గేట్ దగ్గర ఓ రెస్టారెంట్లో పసందైన పనీర్ మఖానీ తయారు చేస్తారు. ఇంకో చోట అయితే ముగలాయ్ (శాకాహారం, మాంసాహారంలో విభిన్న వంటకాలు), మరో చోట చైనీస్ వంటకం అయిన కమ్లింగ్ బాగా చేస్తారు. కానీ, నా డైటింగ్ నియమాల వల్ల వీటిని ఆరగించే అదృష్టం లేదు. ముంబయ్ వెళ్లినప్పుడు నా జిహ్వ చాపల్యంతో వీటిని తింటుంటాను. అయితే చాలా తక్కువ తింటాను. సినిమా షూటింగ్స్ కారణంగా నాకు విదేశాలకు వెళ్లే అవకాశం దక్కుతోంది. అక్కడ కొన్ని రకాల వంటకాలు నాకు చాలా ఇష్టం. స్పెయిన్‌లో పొటాటోస్ బ్రావాస్ అనే డిష్ చాలా రుచికరంగా ఉంటుంది. బంగాళ దుంపలను వేయించి, సాస్‌తో కలిపి తినడం.. పొటాటోస్ బ్రావాస్ అంటే ఇదే. కానీ, ఈ ఫ్రైని రకరకాల పద్ధతుల్లో చేస్తారు. ఇటలీలో కాక్టైల్స్ ట్రై చేశాను. అవి చాలా టేస్టీగా అనిపించాయి. యూఎస్, శాన్ ఫ్రాన్సిస్కోలో అయితే ఎక్కువగా పచ్చి కూరగాయలతో ఆహారం తయారు చేస్తారు. అవి ఆరోగ్యానికి చాలా మంచిది. తైవాన్, ఇండోనేసియాలో అయితే ఇడమామీ అనే వంటకం తయారు చేస్తారు. ఆకుపచ్చ రంగు సోయా బీన్స్‌ని ఉడకబెట్టి, దానికి కొంచెం దినుసులు కలిపి ఇడమామీ వండుతారు. చాలా రుచిగా ఉంటుంది. ‘నీ ఆల్ టైమ్ ఫేవరెట్ డిష్ ఏది?’ అని ఎవరైనా అడిగితే.. నేను దీన్నే చెబుతాను. థాయ్‌లో అయితే థాయ్ న్యూడిల్స్ చాలా ఇష్టం. జపాన్‌లో సుషీటాప్స్ ఇష్టం. సుషీ అనే బియ్యం ఉంటుంది. దాన్ని ఉపయోగించి, ఈ వంటకాన్ని తయారు చేస్తారు. ఇక, వియత్నాంలో అయితే కొత్తిమీర, పుదీన, బచ్చలి కూర, అల్లం, లెమన్ గ్రాస్‌ని ఎక్కువగా ఉపయోగిస్తారు. అక్కడి వంటకాలు కూడా చాలా రుచికరంగా ఉంటాయి. ఇటాలియన్ వంటకాల్లో పిజ్జా ఫేమస్. అది ఇష్టమైనా తినలేని పరిస్థితి. మిఠాయిలను ఇష్టపడని వాళ్లు ఉంటారా? నేను చాలా స్వీట్ పర్సన్‌ని. స్వీట్స్ అని చెబుతుంటేనే నా నోరూరిపోతుంటుంది. చాక్లెట్స్ నా బలహీనత. మా అమ్మగారు చాక్లెట్ కేక్స్ తయారు చేస్తుంటారు. అలాగే, ఫ్రూట్ కేక్స్ చేయడంలో కూడా మా మమ్మీ బెస్ట్. చాక్లెట్స్, కేక్స్ గురించి పక్కన పెడితే... స్ట్రాబెర్రీలు, మామిడి పండ్లంటే చెప్పలేనంత ఇష్టం. మామిడిపళ్ల సీజన్లో అయితే రోజుకి కనీసం రెండు, మూడైనా తింటాను. కాకపోతే, స్ట్రాబెర్రీలతో పోల్చితే వీటిలో ఎక్కువ కేలరీలు ఉంటాయి. అయినా, తింటాను. కానీ, వ్యాయామం టైమ్ పెంచుకుంటాను. కొబ్బరి నీళ్లు, గ్రీన్ టీ తరచుగా తీసుకుంటా. ఐస్‌క్రీమ్ వద్దనుకుంటూనే లాగించేస్తా. సన్నగా మెరుపు తీగలా ఉండటం కోసం కడుపు మాడ్చుకోవాలనే తరహా అమ్మాయిని కాదు నేను. నాకు నచ్చిన వంటకాలు తినడం కోసం ఒక్కోసారి నియమాలను ఉల్లంఘించేస్తాను. అందుకే, కఠినమైన డైట్‌ని ఆచరించేవాళ్లంటే నాకు చాలా అభిమానం. అదంత సులువైన విషయం కాదు. ఏదేమైనా, నా వృత్తంటే నాకు అపారమైన గౌరవం. అందుకే, ఆహారపరంగా చాలా త్యాగమే చేస్తున్నా. ఆ త్యాగానికి ప్రతిఫలం నా అభిమానుల రూపంలో దక్కుతోంది కాబట్టి... ఐయామ్ హ్యాపీ.