► ఇడ్లీ, దోసెల కోసం బియ్యం, మినప్పప్పు నానబెట్టేటప్పుడు ముందే కడగాలి. నానిన తర్వాత గ్రైండ్ చేసేటప్పుడు కడగడం వల్ల విటమిన్లు నీటిలో పోతాయి. అంతేకాకుండా దుకాణాల్లో వాటికి పురుగుపట్టకుండా నిల్వ చేయడానికి కీటక నాశినులను గనుక వాడి ఉంటే కడగకుండా నానబెట్టినప్పుడు ఆ అవశేషాలతో కూడిన నీటినే బియ్యం, మినప్పప్పు పీల్చుకుంటాయి కాబట్టి అవన్నీ శరీరంలోకి వెళ్లే ప్రమాదం కూడా ఉంటుంది.
► కూరల్లో ఉప్పు ఎక్కువైనప్పుడు అందులో బంగాళాదుంప ముక్కలను వేయాలి. అధికంగా ఉన్న ఉప్పును పొటాటో పది నిమిషాల్లో పీల్చుకుంటుంది.
► గారెల కోసం తయారు చేసుకున్న పిండిలో నీరు ఎక్కువై నూనెలో వేయగానే అంచుల దగ్గర సన్న పలుకులుగా విడిపోతున్నట్లయితే, పిండిలో ఒక టేబుల్‌స్పూను నెయ్యి కలపాలి.
► కూరలు, పులుసులు, సూప్‌లు మరీ పలచగా ఉన్నట్లనిపిస్తే అందులో ఒక టేబుల్‌స్పూను కార్న్‌ఫ్లోర్ కలపాలి. కార్న్‌ఫ్లోర్‌ను అలాగే వేస్తే ఉండలవుతుంది. ముందుగా ఒక కప్పులో వేసి చన్నీటితో కలిపి ఆ మిశ్రమాన్ని కూరల్లో వేస్తే సమంగా కలుస్తుంది.
కూరలో ఉప్పు ఎక్కువైందా.. ఇలా చేయండి
Published Mon, Mar 9 2020 9:08 AM | Last Updated on Tue, Mar 10 2020 8:33 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment