Delicious
-
Hyderabad: డెలీషియస్ గోల్డ్ ఐస్‌క్రీం అంటే అట్లుంటది.. మన హైదరాబాద్‌తోని!
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ అంటేనే వైవిధ్యానికి ఆలవాలం. ఆహర్యంతోపాటు ఆహారంలోనూ విభిన్నతకు అది వేదిక. రకరకాల రుచులకు అడ్డా. ఫుడ్ లవర్స్‌కు స్వర్గధామం. ఇక్కడ హైదరాబాదీ బిర్యానీయే కాదు.. దక్షిణ, ఉత్తర భారత సంప్రదాయ వంటకాలు, వెస్టర్న్ ఫుడ్, చైనీస్, జపనీస్.. ఇలా ఎన్నో దేశాల ఫుడ్ ఇక్కడ దొరుకుతుంది. అలా వారాంతంలో కాస్త డిఫరెంట్ ఫుడ్ తినాలనుకోవాలే కానీ.. దానికి కొదువే ఉండదు. అట్లుంటది మన హైదరాబాద్‌తోని. ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే... బంగారం ఏమైనా తింటామా.. ఏంటి? అని ఎవరైనా మాట వరుసకు అనేవారు ఒకప్పుడు.కానీ, ఇప్పుడు బంగారాన్ని కూడా తినేస్తున్నారండోయ్. గోల్డ్ దోశ, గోల్డ్ ఇడ్లీ, గోల్డెన్ స్వీట్స్.. ఇలా బంగారపు పూత ఉన్న ఫుడ్ ఐటెమ్స్‌ను హైదరాబాద్‌లో అందుబాటులోకి తెచ్చారు. ఈ వరుసలోకి ఐస్‌క్రీం కూడా వచ్చి చేరింది. హైదరాబాద్‌లో కూడా గోల్డ్ ఐస్‌క్రీం కూడా దొరుకుతోందా అని ఆశ్చర్యపోకండి. ఎందుకంటే మన నగరంలో అచ్చు 24 క్యారెట్ల గోల్డ్ ఐస్‌క్రీం లభిస్తోంది. అదెక్కడ అంటారా? మాదాపూర్‌లోని హూబర్, హోలీలో ఈ ఐస్క్రీంను అందుబాటులోకి తీసుకొచ్చారు. మైటీ మిడాస్ పేరుతో ఈ ఐస్క్రీంను అమ్ముతున్నారు. ఖరీదు జస్ట్.. రూ.1,179. సాధారణ కోన్‌లో డిఫరెంట్ ఫ్లేవర్స్‌లో సర్వ్ చేస్తుంటారు. ఐస్‌క్రీం పైన 24 క్యారెట్ల గోల్డ్ పేపర్‌తో అందంగా ముస్తాబు చేసి మనకు అందజేస్తారు. ఇంకేముంది.. ఇక మోస్ట్ డెలీషియస్ ఐస్క్రీంను ఆరగించేయడమే. -
అటు వర్షాలు.. ఇటు కమ్మని ఫలాలు (ఫొటోలు)
-
నోరూరించే పంజాబ్ వెజ్ వంటకాలు ఇవే! (ఫొటోలు)
-
ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ 10 వంటకాలు ఇవే!
-
ఆ చేతి బజ్జీ
చలి గజగజ వణికిస్తున్నా... జోరున వాన కురుస్తున్నా... వెంటనే బజ్జీలు, పునుగుల మీదకు మనసు వెళ్తుంది...ఆవురావురుమంటూ లాగిస్తూ, ప్రకృతిని ఆస్వాదించాలనిపిస్తుంది...పుల్లారావు బజ్జీలకు యమ క్రేజ్... ఏ సీజన్లో అయినా ఆ బజ్జీల రుచి చూడాల్సిందే... స్వచ్ఛమైన బజ్జీ, పునుగులను రుచి చూడటం కోసం బారులు తీరతారు చీరాల వాసులు... 30 సంవత్సరాలుగా బజ్జీ ప్రియులకు విందు చేస్తూ వ్యాపారాన్ని వృద్ధి చేసుకుంటున్నారు పుల్లారావు... ఇక్కడి బజ్జీల కోసం గంటల తరబడి క్యూలో నిలబడి మరీ కొని తింటారు... పుల్లారావు వ్యాపార విజయ రహస్యమే ఈ వారం మన ఫుడ్ ప్రింట్స్... రాత్రి ఏడు గంటలైతే చాలు ఆ ప్రాంతమంతా కమ్మని సువాసనలు వెదజల్లుతుంది. అటుగా వెళ్తున్నవారంతా ఆ వాసన ఏంటా అనుకుంటూ అక్కడకు వస్తారు. అంతే! మరి అక్కడ నుంచి కాలు కదపలేకపోతారు. అప్పటికే అక్కడ క్యూలో నిలబడినవారిని అడిగి విషయం తెలుసుకుంటారు. ఆ ప్రాంతమంతా కొనుగోలుదారులతో కిటకిటలాడుతూ తిరునాళ్లను తలపిస్తుంది. చిన్నదే అయినా... చూడటానికి చిన్న అంగడే అయినా అక్కడ దొరికే బజ్జీ, పునుగులను ఎవరైనా లొట్టలు వేసుకుంటూ తినాల్సిందే. వేడివేడిగా లభ్యమయ్యే పుల్లారావు బజ్జీలంటే చీరాల పట్టణ వాసులకు యమ క్రేజ్. స్వచ్ఛమైన పదార్థాలతో, రుచికరంగా తయారు చేసే పునుగు, బజ్జీలను గత మూడు దశాబ్దాలుగా చీరాల, చుట్టుపక్కల ప్రాంతాలకు అందిస్తూ ప్రజల అభిమానాన్ని చూరగొంటున్నారు పుల్లారావు. స్థానిక కొట్లబజారు రోడ్డులోని తుపాకి మేడ దగ్గర ఊర పుల్లారావు చిన్న బడ్డీ బంకు పెట్టి, అందులోనే ఈ వ్యాపారాన్ని ప్రారంభించారు. ఇలా చేస్తారు... బజ్జీలకు పచ్చి పప్పు మాత్రమే ఉపయోగిస్తారు. వాటి పిండిని బాగా మెత్తగా చేసి ఉప్పు, కారం అన్ని సమపాళ్లలో కలిపి, స్పెషల్‌గా తెచ్చిన మిరపకాయలను కోసి, వాటిలో వాము పొడిని తగినంతగా చేర్చి, కాగిన నూనెలో రెండు సార్లు వేయించుతారు. అందుకే వాటికి అంత రుచి అంటారు బజ్జీ తిన్నవారంతా. మినప్పప్పు, బియ్యప్పిండిని వాడుతూ రుచికరమైన పునుగులను తయారుచేస్తారు. పునుగు పిండితో తయారుచేసిన బరోడా బజ్జీ, బొండాలకు మరింత క్రేజ్ ఉంది. ఆ బజారులో ఎన్నో బజ్జీల షాపులున్నా పుల్లయ్య బజ్జీల షాపు దగ్గరే జనం కనిపిస్తారు. స్వచ్ఛమైన నూనె, మన్నిక కలిగిన పదార్థాలతో రుచికరంగా తయారయ్యే పుల్లయ్య బజ్జీలను తిన్న ఎంతటివారైనా ‘వాహ్వా! పుల్లయ్య బజ్జీ!!’ అని పొగడక మానరు. – సంభాషణ, ఫొటోలు: పి. కృష్ణ చైతన్య, చీరాల అర్బన్ -
ప్రధాని భార్యపై కామెంట్.. జోకులు
సిడ్నీ: భాష.. దాని అనువాదంలో వచ్చే చిక్కులు అన్నీ ఇన్నీ కావు. పొరపాటున తేడాలు వస్తే అర్థాలు మారిపోయి ఇబ్బందులకు గురికావాల్సి ఉంటుంది. తాజాగా ఫ్రాన్స్ ప్రధాని ఎమ్మాన్యుయేల్ మాక్రోన్‌కు ఇలాంటి పరిస్థితి ఎదురైంది. ఆస్ట్రేలియా ప్రధాని మాల్కోమ్ టర్న్‌బుల్ భార్య లూసీని ఉద్దేశించి చేసిన ఓ కామెంట్‌పై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన మాక్రోన్.. మాల్కోమ్తో బుధవారం కీలక సమావేశంలో పాల్గొన్నారు. భేటీ ముగిశాక మాల్కోమ్ ఆతిథ్యాన్ని ప్రశంసిస్తూ... ఫ్రాన్స్ అధ్యక్షుడు ఓ సందేశం ఇచ్చారు. ‘మీరిచ్చిన స్వాగతానికి ధన్యవాదాలు. మీకు, మీ ‘రుచికరమైన’ (Delicious)భార్య ఇచ్చిన ఆతిథ్యానికి కృతజ్ఞతలు’ అంటూ మాక్రోన్ పేర్కొన్నారు. అంతే... ఆ మాట ఆధారంగా అంతర్జాతీయ మీడియా కథనాలు ప్రచురించేసింది. ‘నోరు జారిన ఫ్రాన్స్ అధ్యక్షుడు’.. ‘ప్రధాని భార్యపై అధ్యక్షుడి అనుచిత వ్యాఖ్యలు’.. అంటూ హెడ్డింగ్లతో ఊదరగొట్టేసింది. మరోపక్క సోషల్ మీడియాలో మాక్రోన్ స్టేట్మెంట్పై జోకులు పేలాయి. ఆయన ఉద్దేశం ఏమై ఉంటుందో? అని కొందరు.. వైన్ బదులు వైఫ్ అని పొరపాటున ఉచ్ఛరించారేమో అని కొందరు.. చాలా మందికి మట్టు ఆ కామెంట్‌పై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఫ్రెంచ్ కార్యాలయం స్పందన... ‘నిజానికి ఆయన తప్పుగా ఏం మాట్లాడలేదు. అనువాద దోషంలో దొర్లిన ఓ తప్పిదం మూలంగానే ఆయన ఆ కామెంట్ చేయాల్సి వచ్చింది. ఫ్రెంచ్ వంటకాలతో, ఫ్రెంచ్ అధికారులతో ఏర్పాసిన డిన్నర్ పట్ల మాక్రోన్ సంతోషం వ్యక్తం చేశారు. అందుకే టర్న్‌బుల్-ఆయన భార్యకు కృతజ్ఞతలు తెలియజేశారు. Delicious-Delicieux ఫ్రెంచ్‌లో-Delightful(చూడముచ్చటైన) అర్థం. ఫ్రెంచి అనువాదకుడి ఉపన్యాసాన్నే మాక్రోన్ చదివి వినిపించారు. దీనిపై పెడర్థాలు తీయాల్సిన అవసరం లేదు’ అని ఆస్ట్రేలియాలోని ఫ్రాన్స్ రాయబార కార్యాలయం స్పష్టం చేసింది. అన్నట్లు గతేడాది ఫ్రాన్స్ పర్యటనలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు కూడా ఇదే తరహా అనుభవం ఎదురైంది. ఆ సమయంలో మాక్రోన్ భార్య బ్రిగెట్టేను ఉద్దేశించి ట్రంప్ చేసిన ఓ వ్యాఖ్య చర్చనీయాంశమైంది. "I want to thank you for your welcome, thank you and your delicious wife for your warm welcome," -
భయంకరమైన తిండి!
వీడు భయంకరంగా తిండి తింటాడు. ఇది పెద్దలు సాధారణంగా వాడే మాట. కానీ, తినే పదార్ధాలను భయంకరంగా ఉండేలా చేస్తే ఎలా ఉంటుంది. ఆ పనే చేశాడు డే అనే ఓ చెఫ్. పెద్ద స్టార్ హోటల్ లో చెఫ్ గా పనిచేసే ఇతనికి సాధారణంగా వంటకాలు చేసి చేసి విసుగొచ్చింది. అందుకే పెద్దల సామెతకు వ్యతిరేకంగా కొన్ని రకాల వంటకాలను సిద్ధం చేసేశాడు. నరికిన మనిషి తల, బయటకు తీసిన మెదడు, నుంచుని చూస్తున్న దెయ్యం బాలుడు, పేడ పురుగు, బయటకు తీసిన గుండె, చర్మం వలిచిన పొట్టేలు తల ఇలా అచ్చం సహజంగా కనిపించే విధంగా కేక్ లు తయారుచేశాడు. ఇవి ఎంత సహజంగా ఉన్నాయంటే మాటల్లో చెప్పడం కంటే చూసి అనుభవిస్తేనే తెలుస్తుంది. -
మహారుచి
అభిరుచి ఉండాలే గానీ... రుచికి కొదవే లేదు భాగ్యనగరిలో. కాశ్మీర్ టు కన్యాకువూరి... ఏ టేస్టరుునా ఇక్కడ రెడీ. గజి‘బిజీ’ లైఫ్స్టైల్లో వారానికోరోజే దొరికే హాలిడే... ఎప్పుడూ అదే ‘పాత చింతకాయ పచ్చడేనా’! కాస్త రిలాక్స్‌గా కూర్చుని... ఇంకాస్త కొత్తగా ఏదైనా వంటకాన్ని ట్రై చేస్తే..! వాహ్... వీకెండ్లో భలే జా కదూ! రండి... మీ కోసమే ఈ రుచులన్నీ... హాట్.. హాట్ పరాటా విభిన్నమైన పరాటాలను పసందుగా అందించే ఫెస్ట్ ఇది. సికింద్రాబాద్ హోటల్ మెహిఫిల్లో ఏర్పాటు చేసిన ఈ ఆహారోత్సవంలో వులబారీ, లచేదార్, వార్ఖీ,కచ్చిమిర్చి, మేథీ, లెహసూని, స్టఫ్డ్ పరాటాలు నగరవాసులను రారవ్ముని ఆహ్వానిస్తున్నారుు. బటాటా వడ నెక్లెస్‌రోడ్డు నుంచి నయా రుచులు నగరవాసిని రారామ్మని పిలుస్తున్నాయి...బాల్ఠాకరేలోని ఆవేశమంత స్పైసీగా... ముంబై మోడల్ అంత స్వీట్‌గా.. సచిన్ స్ట్రెట్ డ్రైవ్ అంత క్లాసిక్‌గా ఉండే ఆ వంటలను రుచిచూస్తే ఎవరైనా సరే వహ్వా అనాల్సిందే.. అందుకే రుచుల పంట పండిస్తున్న ఆ మరాఠీ వంటకాలకు హైదరాబాదీ కూడా ఆదాబ్ అంటున్నాడు.. పావేబాజీకి నోరందిస్తున్నాడు... వడాపావ్‌కు చేయి అందిస్తున్నాడు.. టోటల్‌గా ‘మహా’రుచులను తింటూ మన న గరవాసి మైమరచిపోతున్నాడు. కాస్త కారంగా... కొంచెం ఘాటుగా... కనులకింపుగా... భిన్నరుచులతో అదరగొట్టే మహారాష్ట్ర సంప్రదాయ ఫుడ్ ఫెస్టివల్ నెక్లెస్‌రోడ్డులోని ‘ఓరిస్’లో ప్రారంభమైంది. ఈ నెల 20న మొదలైన ఈ రుచుల విందు మరో 10 రోజులుంటుంది. మామిడి పండ్లను రొయ్యలతో మిక్స్ చేసి తయారు చేసే మచ్చికల్వాన్, బటాటా, మచ్చి కల్వాణ్, కందపోహా, సుబుదానా వడ, రతలు కిస్సీ, గర్వంగ్ మటన్, మట్కీ ఉసాక్, టోండ్లీ భాజీ మటన్ వడ్వాల్, మటన్ కొల్హాపూరి, మటన్ అగ్రి, వడపావ్, పావ్బాజీల గురించి ప్రత్యేక ంగా చెప్పాల్సిన అవరసమే లేదు. మహిమ వంటలే కాదు.. క్రీమీస్టోన్లో వెరైటీ ఐస్‌క్రీములు లభిస్తాయి. మాన్సూన్ స్పెషల్‌గా ఇక్కడ తయారుచేసే కాలాజామూన్ అందరి నోళ్లలో నానుతోంది. నేరేడు పండ్లు, వెనీలా ఐస్‌క్రీమ్‌ను జామ్నా ఐస్‌తో కలిపి దీన్ని తయారు చేస్తారు. ఈ ఐస్‌క్రీమ్ తింటే రక్తశుద్ధికి బాగా ఉపయోగపడుతుందని క్రీమీస్టోన్ అపరేషనల్ మేనేజర్ ఫ్రాంక్లిన్ అంటున్నారు. కుల్ఫీ రీమిక్స్, అల్ఫోన్సో మ్యాంగో, మస్క్ మెలన్ లాంటి వెరైటీ ఐస్‌క్రీమ్‌లు కూడా లభిస్తున్నాయి. పిల్లల కోసం ప్రత్యేకంగా డ్రింక్ క్రీమ్‌ను కూడా తయారు చేశారు. వడపావ్ మహారాష్ట్ర వంటకాల్లో ఎక్కువగా వేరుశనగ, నువ్వులు, ఎండు మిరపకాయలు, మసాలా, ఇంగువ వాడతారు. అలాగే చేపల కర్రీలో వెల్లుల్లి ఎక్కువగా వాడతాం. దీనివల్ల ఎసిడిటీ రాకుండా నివారించవచ్చు. - ఎం.ఎస్.నీలేశ్‌కుమార్, ఓరిస్ ఎగ్జిక్యూటివ్ చెఫ్