ప్రగతిగనర్ వాసవీ లేఅవుట్ వద్ద జావ విక్రయాలు
సాక్షి, హైదరాబాద్: మన ఆరోగ్యం తనం తీసుకునే ఆహార అలవాట్లలో ముడిపడి ఉంటుందన్నది జగ మెరిగి న సత్యం. గతంలో మంచి ఆహారపు అలవాట్లకు దూరంగా ఉన్న నగర వాసులు కరోనా మహమ్మా రి పుణ్యమాని తమ ఆరోగ్యంపై దృష్టి పెడుతున్నారు. ఇందులో భాగంగా ఏదైనా పార్కులో వాకింగ్, వ్యాయామం చేయడం వంటి వాటిపై దృష్టి కేంద్రీకరిస్తున్నారు. ఇలా నగర వ్యాప్తంగా ఏ పార్కులు, కాలనీల్లోని రోడ్లపై ఉదయం వేళల్లో చూస్తే వేలాది మంది జాగింగ్, వాకింగ్, వ్యాయామాలు చేస్తూ కనిపిస్తుంటారు. వీటితో పాటు తినే ఆహారంపై సైతం ప్రత్యేక దృష్టి పెడుతున్నారు.
నడక ముగిసిన తరువాత జావ(అంబలి)ని తీసుకుంటున్నారు. అంబలి తాగితే ఆరోగ్యానికి మేలు చేస్తోందని వైద్యులు సైతం సలహాలు ఇవ్వడంతో ఆ దిశగా అలవాటు చేసుకుంటున్నారు. ఇటీవల కాలంలో ఎస్‌ఐ, కానిస్టేబుల్ నోటిఫికేషన్లలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఉద్యోగాల కోసం కసరత్తులు చేస్తున్నారు. ఈ క్రమంలో నిరాశ, బడలిక నుంచి విముక్తి పొందేందుకు జావ తాగుతూ సేద తీరుతున్నారు. వీరి కోసం వాకింగ్ సెంటర్లు, పార్కుల వద్ద రాగి, జొన్నలతో తయారు చేస్తున్న జావ సెంటర్లు వెలుస్తున్నాయి.
నిజాంపేట్ పరిధిలో పదుల సంఖ్యలో..
నిజాంపేట్ కార్పొరేషన్ పరిధిలోని పలు పార్కు లు, చెరువుల వద్ద జావ విక్రమ కేంద్రాలు ఇబ్బడి ముబ్బడిగా వెలిశాయి. ప్రగతినగర్, నిజాంపేట్, బాచుపల్లి ప్రాంతాల్లోని ఉదయం, సాయంత్రం వేళల్లో జాగింగ్, ఓపెన్ జిమ్‌లలో వ్యాయామం చేసే వారు ఎక్కువగా జావను తీసుకుంటున్నారు. వీటితో పాటు జ్యూస్‌లు, గ్రీన్ టీలను సైతం నిర్వాహకులు అందుబాటులో ఉంచుతున్నారు.
ఓపెన్ జిమ్‌లో వ్యాయామం చేస్తూ..
షుగర్ వ్యాధిగ్రస్తులకు ఉత్తమ ఆహారం..
జొన్న జావ డయాబెటిస్ వ్యాధిని అదుపులో ఉంచుతుంది. రాగి, జొన్న వంటివి తినడం వల్ల పిల్లల నుంచి పెద్దల వరకు శక్తిని ఇస్తా యి. పిల్లల ఎదుగుదలకు దోహదం చేస్తాయి. ఇందులో కాల్షియం తదితర పోషకాలు ఎక్కువగా ఉండటం వల్ల షుగర్ వ్యాధిగ్రస్తులకు ఉత్తమ ఆహారంగా పేర్కొనవచ్చు.
పోషక విలువలుండే ఆహారం ఎంతో అవసరం
జావ, జ్యూస్‌లు, గ్రీన్ టీ వంటివి వాకర్లకు ఎంతో అవసరం. పురాతన కాలంలో ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి ఉపయోగించిన ఆ హార పదార్థాలనే నేడు అందరూ ఉపయోగిస్తున్నారు. అత్యధిక పోషక విలువలుండే రాగులు, జొన్నలు మన శరీరానికి ఎంతో అవసరం. నేడు చాలా మంది మధుమేహం వ్యాధిన పడుతున్నారు. రోజు వాకింగ్ చేసిన తరువాత ఒక గ్లాస్ జావ తాగితే దాన్ని నివారించవచ్చు.
– చంద్రయ్య, బాచుపల్లి
జొన్న, రాగి జావలను ప్రతి ఒక్కరూ తీసుకోవాలి
జావను ఒక రోజు తాగా, మంచి రుచిగా అనిపించడంతో ప్రతి రోజు అల్లం టీ తాగే అలవాటును మానుకుని జావ తాగుతున్నాను. వాకింగ్ తరువాత జావ తాగితే శరీరం అంతగా అలసట అనిపించడం లేదు. శరీరానికి శక్తిని ఇచ్చే జొన్న, రాగి జావలను ప్రతి ఒక్కరూ సేవించాలి.
– సుధాకర్, ప్రగతినగర్
నిత్యం జావ తాగే వారు పెరుగుతున్నారు
జొన్న, రాగులతో చేసిన జావను వాకింగ్ చేసిన తరువాత తాగాలి. ఉదయం, సాయంత్రం వేళల్లో వ్యాయామం చేసిన అనంతరం తాగితే మంచిది. తాను తయారు చేస్తున్న జావతో పాటు సజ్జ లడ్డూలను సైతం ప్రజలు కొనుగోలు చేస్తున్నారు. ప్రగతినగర్ ప్రాంతంలో గత ఐదేళుŠాల్గ జావ విక్రయాలు చేపడుతున్నాను. నిత్యం జావ తాగే వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది.
– శ్రీరాములు, జొన్న, రాగి జావ విక్రయదారుడు
Comments
Please login to add a commentAdd a comment