వేసవిలో మరో అద్భుతమైన ఆహారం అంబలి. సాధారణంగా రాగిపిండితో అంబలిని తయారు చేస్తారు. ఒక్కోసారి ఇతర తృణధాన్యాల పిండిని కూడా వాడతారు. రాగిపిండితో జారుగా తయారు చేసుకునే జావను అంబలి అని, రాగిజావ అని రాగిమాల్ట్ అని రకరకాల పేర్లతో పిలుస్తారు. అంబలిలో మజ్జిగ కలుపుకొని తీసుకుంటే, వేసవి తీవ్రతను తట్టుకునే శక్తి వస్తుంది.
అంబలి సర్వకాలాల్లోనూ తీసుకోదగినదే అయినా, వేసవిలో దీనిని తీసుకోవడం ఆరోగ్యరీత్యా చాలా అవసరం. బరువు తగ్గాలనుకునేవారు కాలాలతో నిమిత్తం లేకుండా, ప్రతిరోజూ అంబలి తీసుకోవచ్చు. అంబలి తీసుకుంటే త్వరగా ఆకలి కాకుండా ఉంటుంది. ఇందులో పోషకాలు పుష్కలంగా ఉండటమే కాకుండా, కేలరీలు తక్కువగా ఉంటాయి.
అందువల్ల స్థూలకాయానికి, దానివల్ల తలెత్తే మధుమేహం వంటి ఇతర ఆరోగ్య సమస్యలకు అంబలి చక్కని విరుగుడు. చద్దన్నం మాదిరిగానే అంబలి వినియోగం కూడా కొంతకాలం వెనుకబడినా, ఇటీవలి కాలంలో దీని వినియోగం బాగా పెరిగింది.
Comments
Please login to add a commentAdd a comment