![Summer Drinks: Sorakaya Bottle Gourd Juice Health Benefits In Telugu - Sakshi](/styles/webp/s3/article_images/2022/05/10/bottle%20gourd.jpg.webp?itok=wyuvLVOW)
Summer Drink- Sorakaya Juice: సొరకాయలో విటమిన్లు, పొటాషియం, ఐరన్‌లు, పీచుపదార్థం పుష్కలంగా ఉంటాయి. అందువల్ల సొరకాయ జ్యూస్ తాగితే బరువు తగ్గుతారు. దీనిలోని పీచుపదార్థం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
అదే విధంగా.. పొటాషియం అధిక రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది. రోజూ ఈ డ్రింక్ తాగడం వల్ల కాలేయ సంబంధ సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఐస్‌క్యూబ్స్ వేయకుండా చేసిన సొరకాయ జ్యూస్‌ను పరగడుపున తాగితే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయి.
సొరకాయ జ్యూస్ తయారీకి కావలసినవి:
►సొరకాయ – మీడియం సైజుది ఒకటి
►పుదీనా ఆకులు – పది
►అల్లం – అరంగుళం ముక్క
►నిమ్మకాయ – ఒకటి
►బ్లాక్ సాల్ట్ – రుచికి సరిపడా
►ఐస్ క్యూబ్స్ – అరకప్పు.
తయారీ విధానం:
►సొరకాయ తొక్కతీసి శుభ్రంగా కడిగి ముక్కలుగా తరిగి బ్లెండర్‌లో వేయాలి.
►దీనిలోనే తొక్కతీసిన అల్లం, పుదీనా, రుచికి సరిపడా బ్లాక్‌సాల్ట్, ఐస్ క్యూబ్స్‌వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి.
►గ్రైండ్ అయిన మిశ్రమాన్ని పలుచని వస్త్రంలో వడగట్టి జ్యూస్‌ను తీసుకోవాలి.
►ఈ జ్యూస్‌లో నిమ్మరసం పిండి సర్వ్ చేసుకోవాలి.
చదవండి👉🏾Thati Munjala Smoothie: తాటి ముంజలలో ఫైటో కెమికల్స్ పుష్కలం.. కాబట్టి..
చదవండి👉🏾ప్రెగ్నెన్సీ సమయంలో చేపలు, లివర్‌ను తినొచ్చా?
Comments
Please login to add a commentAdd a comment