![Summer Drink: How To Make Sugandha Sharbat Nannari Syrup Telugu - Sakshi](/styles/webp/s3/article_images/2022/04/5/sugandha-sharbat.jpg.webp?itok=8I6RFVMq)
సుర్రుమనే ఎండల ధాటిని తలచుకుంటేనే ఒళ్లంతా చెమటలు పట్టేస్తుంది కదూ! మరీ అంత ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ వేసవిని గట్టెక్కేయడానికి చల్లచల్లని సుగంధ షర్బత్ వంటి సంప్రదాయ రుచులను ప్రయత్నించండి. వేసవిలో ఆరోగ్యానికి ఢోకా లేకుండానే ఆనందాన్ని, ఆహ్లాదాన్ని సొంతం చేసుకోండి.
సుగంధ షర్బత్‌ను నన్నారి షర్బత్ అని కూడా అంటారు. సుగంధిపాల చెట్టు వేళ్లను కత్తిరించి, వాటిని బాగా ఎండబెట్టిన తర్వాత కషాయం చేస్తారు. ఆ కషాయానికి పంచదార చేర్చి, సిరప్‌లాంటి పాకాన్ని తయారు చేస్తారు. ఈ సిరప్‌తో సోడాను కలిపి తయారు చేసే షర్బత్ రాయలసీమ ప్రత్యేక పానీయం.
ఇటీవలికాలంలో ఇది ఇతర ప్రాంతాలకు విస్తరించినా, నన్నారి షర్బత్ తయారీలో రాయలసీమవాసుల నైపుణ్యమే వేరు. సుగంధపాల చెట్టు వేళ్లను ఆయుర్వేద చికిత్సల్లో ఉపయోగిస్తారు. వేసవితాపాన్ని తగ్గించడంలోను, చర్మ ఆరోగ్యాన్ని కాపాడటంలో సుగంధ కషాయం అద్భుతంగా పనిచేస్తుందని చెబుతారు.
Comments
Please login to add a commentAdd a comment