
సాక్షి, అమరావతి: జగనన్న గోరుముద్ద ద్వారా బడి పిల్లలకు వారానికి మూడు రోజులు ఉదయం పూట రాగి జావ అందించే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం తన క్యాంపు కార్యాలయం నుంచి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ట్వీట్ చేశారు.
చదవండి: విద్యార్థుల భవిష్యత్‌కు భరోసా.. సమూల మార్పులు తీసుకొస్తున్నాం: సీఎం జగన్
‘‘పౌష్టికాహారంతోనే ఆరోగ్యం, చక్కటి విద్యాభ్యాసం సాధ్యమని నమ్ముతున్నా.. ఒక మేనమామగా మధ్యాహ్న భోజన కార్యక్రమం "గోరుముద్ద”లో భాగంగా ఇవ్వాళ్టి నుంచి రాగిజావ అందిస్తున్నాం. గుడ్డు, చిక్కీ సహా అందిస్తున్న 15 ఆహార పదార్థాలకు ఇది అదనం. భాగస్వామి అయిన సత్యసాయి ట్రస్టుకు నా ధన్యవాదాలు’’ అని సీఎం జగన్ ట్వీట్టర్‌లో పేర్కొన్నారు.
పౌష్టికాహారంతోనే ఆరోగ్యం, చక్కటి విద్యాభ్యాసం సాధ్యమని నమ్ముతూ ఒక మేనమామగా మధ్యాహ్న భోజన కార్యక్రమం “గోరుముద్ద”లో భాగంగా ఇవ్వాళ్టి నుంచి రాగిజావ అందిస్తున్నాం. గుడ్డు, చిక్కీసహా అందిస్తున్న 15 ఆహార పదార్థాలకు ఇది అదనం. భాగస్వామి అయిన సత్యసాయి ట్రస్టుకు నా ధన్యవాదాలు.
— YS Jagan Mohan Reddy (@ysjagan) March 21, 2023
Comments
Please login to add a commentAdd a comment