
నటి జయశ్రీ రామయ్య
కర్ణాటక ,కృష్ణరాజపురం : ఆస్తి కోసం మేనమామ శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడని ప్రముఖ కన్నడ నటి,నృత్యకారిణి జయశ్రీ రామయ్య బుధవారం సీకె అచ్చుకట్టె పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అనంతరం జయశ్రీ మీడియాతో మాట్లాడారు. ఆస్తికి సంబంధించి మేనమామ గిరీశ్ చాలా కాలంగా తనతో పాటు తల్లిని కూడా వేధింపులకు గురి చేస్తున్నాడని, ఇదే విషయమై ఈనెల 10వ తేదీన అర్ధరాత్రి హనుమంత నగర్‌లో ఉన్న తమ ఇంటికి వచ్చి గొడవ చేసి తన తల్లిని ఇంటి నుంచి బయటకు గెంటేశాడని ఆరోపించారు. తన వస్త్రాధరణపై అసభ్య పదజాలాలతో దూషించాడని ఆరోపించారు. ఇదిలా ఉండగా విచారణకు హాజరు కావాలంటూ జయశ్రీతో పాటు గిరీశ్‌కు కూడా పోలీసులు సూచించారు.విచారణ అనంతరం కేసు నమోదు చేస్తామన్నారు.
నటి జయశ్రీ రామయ్య
Comments
Please login to add a commentAdd a comment