ఇద్దరి దారుణ హత్య | Two brutal murder | Sakshi
Sakshi News home page

ఇద్దరి దారుణ హత్య

Published Sun, Sep 14 2014 4:17 AM | Last Updated on Sat, Aug 11 2018 8:45 PM

ఇద్దరి దారుణ హత్య - Sakshi

ఇద్దరి దారుణ హత్య

  • ప్రాణాలు బలిగొన్న వివాహేతర సంబంధం
  • కత్తితో స్టేషన్‌లో లొంగిపోయిన నిందితుడు
  • రసూల్‌పురా: ఇద్దరు దారుణ హత్యకు గురయ్యారు. వివాహేతర సంబంధం వారి ప్రాణాలు బలిగొంది. నిందితుడు కత్తితోవచ్చి పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. ఈ ఘటన బోయిన్‌పల్లి, బేగంపేట పోలీస్‌స్టేషన్‌ల పరిధిలో శనివారం సంచలనం సృష్టించింది. పోలీసులు, మృతుల బంధువులు తెలిపిన వివరాలు.. తాడ్‌బంద్ కంటోన్మెంట్ సిబ్బంది క్వార్టర్స్‌లో నివసించే రాకేష్ (40) వృత్తిరీత్యా కారు డ్రైవర్. ఇతడికి భార్య జయశ్రీ (36), కుమారులు రోహిత్ (17) హేమంత్ (14) ఉన్నారు.

    బేగంపేట పాటిగడ్డలో ఉంటున్న రాకేష్ చిన్నాన్న కుమారుడు నరేన్(30)తో జయశ్రీ కొన్నేళ్లుగా వివాహేతర సంబంధం నెరుపుతోంది. ప్రవ ర్తన మార్చుకోవాలని పలు మార్లు కౌన్సెలింగ్ ఇప్పించిన ఆమె మారలేదు. ఈ క్రమంలో  నెల రోజుల క్రితం భర్త నుంచి విడిపోయి బోడబండ కబీర్‌నగర్‌లో ఉంటున్న తల్లి హేమలత ఇంట్లో జయశ్రీ ఉంటోంది. కాగా గతంలో రాకేష్ అన్న పోతురాజు భార్య స్యరూపతో నరేన్‌కు అక్రమ సంబంధం ఉండేది. దీంతో మనస్తాపానికి గురైన పోతురాజు ఏడాది క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు.

    అనంతరం  నరేన్ స్యరూపను పెళ్లిచేసుకున్నారు. ప్రస్తుతం వారి మధ్య గొడవలు జరుగుతుండటంతో స్వరూప వేరుగా ఉంటుంది. కాగా శనివారం ఉదయం కబీర్‌నగర్‌కు రాకేశ్ వచ్చి తన యజమానితో మాట్లాడి సమస్యను పరిష్కరించుకుని కలిసిమెలసి ఉందామని బైక్‌పై జయశ్రీని తాడ్‌బంద్ తీసుకువచ్చాడు. సాయంత్రం వారి ఇంటికి సమీపంలో ఉన్న నల్లపోచమ్మ ఆలయ ప్రాంగణంలో వెంట తెచ్చుకున్న  కత్తితో జయశ్రీ ఛాతీపై పొడిచి, గొంతు కోసి హతమార్చాడు.

    అక్కడినుంచి బైక్‌పై నేరుగా పాటిగడ్డ ఎన్‌బీటీ నగర్‌లోని నారాయణ అలియాస్ నరేన్ ఇంటికి వెళ్లి నిద్రలో నుంచి లేపి అదే కత్తితో అతడ్ని హతమార్చాడు. తిరిగి ఇంటికి చేరుకుని బోయిన్‌పల్లి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని క్లూస్ టీంను రప్పించారు. ఆధారాలు సేకరించి జయశ్రీ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు. అదనపు డీసీపీ వీవైగిరి పీఎస్‌కు చేరుకుని హత్య వివరాలు అడిగి తెలుసుకున్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement