
చెన్నై ,తిరువొత్తియూరు: వివాహేతర సంబంధం వ్యవహారంపై మైలాపూర్ పోలీసుస్టేషన్‌లో పోలీసులు విచారణ చేస్తున్న సమయంలో భర్త కళ్లెదుటే భార్య ఆత్మహత్యకు యత్నించిన సంఘటన సంచలనం కలిగించింది. చెన్నై మైలాపూర్‌కు చెందిన నరేష్ (36) ప్రైవేటు సంస్థ ఉద్యోగి. అతని భార్య కలైవాణి (30). ఈమెకు అదే ప్రాంతానికి చెందిన ఒకరితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ సంగతి తెలియడంతో నరేష్ భార్యను మందలించాడు. అయినప్పటికీ కలైవాణి తన ప్రవర్తనను మార్చుకోలేదు.
దీంతో ఆగ్రహం చెందిన నరేష్ భార్య వివాహేతర సంబంధంపై మైలాపూర్ మహిళా పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కలైవాణిని శనివారం రాత్రి పోలీసుస్టేషన్‌కు పిలిపించి విచారణ చేశారు. ఆ సమయంలో కలైవాణి ప్రియుడు, భర్త పోలీసుస్టేషన్‌కు వచ్చారు. ఈ ఘటనతో అవమానానికి గురైన కలైవాణి స్టేషన్ నుంచి బయటకు పరుగుతీసింది. ఆమెను పోలీసులు, భర్త నరేష్ వెంబడించారు. పరిగెత్తుకుంటూ వెళ్లిన కలైవాణి లజ్‌కార్నర్ వద్ద కూవం నదిలోకి దూకారు. పోలీసులు ఆమెను బయటకు తెసుకొచ్చి ఆస్పత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment