మరో యువతితో భర్త షికార్లు.. ఫొటోలు భార్యకు పంపించి.. | Wife Commits Suicide Due To Husband Love Affair At Karnataka | Sakshi
Sakshi News home page

మరో యువతితో భర్త షికార్లు.. ఫొటోలు భార్యకు పంపించి..

Published Thu, Oct 13 2022 7:22 AM | Last Updated on Thu, Oct 13 2022 7:24 AM

Wife Commits Suicide Due To Husband Love Affair At Karnataka - Sakshi

చిక్కబళ్లాపురం: భార్యను పుట్టింటిలో వదిలేసిన భర్త, ప్రియురాలితో టూర్లు వేశాడు, పైగా ఆ ఫోటోలను పంపించడంతో భార్య విరక్తి చెంది ప్రాణాలు తీసుకుంది. ఈ దారుణ ఘటన కర్నాటకలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. హెణ్ణూరు కదిరేనహళ్లిలో నివాసమున్న మునిరాజు, దేవమ్మల కుమార్తె మోనిక (20)కు, చిక్కబళ్లాపురం నగరం ప్రశాంతనగరలో నివాసమున్న భార్గవ్‌ (25)తో 8 నెలల కిందట ఘనంగా పెళ్లి చేశారు. ఇద్దరూ సఖ్యతగానే ఉండేవారు. దసరా పండుగకు భార్యను ఆమె పుట్టింటికి పంపించాడు. తరువాత మళ్లీ తీసుకెళ్లడానికి రాలేదు.  

డెత్‌నోట్‌ రాసి ఉరి..  
మోనిక భర్తకు ఫోన్‌ చేసి నన్ను తీసుకెళ్లు అని అడిగితే అతడు పట్టించుకోలేదు. మరో యువతితో షికార్లు చేస్తున్న ఫోటోను బుధవారం అతడు పంపించడంతో మోనిక నిర్ఘాంతపోయింది. ఈ పరిణామాలతో తీవ్రంగా కలత చెందిన మోనిక ఇంటి పై అంతస్తు గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తన చావుకు భర్త భార్గవ్‌ కారణమని డెత్‌ నోట్‌ రాసింది. చిక్కబళ్లాపురం పోలీసులు కేసు నమోదు చేశారు. డిగ్రీ చదివించి, ఘనంగా పెళ్లి చేస్తే విధి మాకు ఇలా చేసిందా అని తల్లిదండ్రులు విలపించారు. కూతురి జీవితాన్ని నాశనం చేసిన భార్గవ్‌ను శిక్షించాలని కోరారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement