ఏడు నెలల క్రితమే పెళ్లి.. వివాహేతర సంబంధం కారణంగా.. | Woman Dies Due To Extramarital Affair At Karnataka | Sakshi
Sakshi News home page

ఏడు నెలల క్రితమే పెళ్లి.. వివాహేతర సంబంధం కారణంగా..

Published Wed, Dec 7 2022 8:27 AM | Last Updated on Wed, Dec 7 2022 8:27 AM

Woman Dies Due To Extramarital Affair At Karnataka - Sakshi

దొడ్డబళ్లాపురం: వివాహేతర సంబంధాలు కుటుంబాలను నాశనం చేస్తున్నాయి. భర్త వివాహేతర సంబంధం కారణంగా నవ వివాహిత అత్తవారింట్లో మృతిచెందింది. ఈ ఘటన కర్నాటకలోని ఉత్తర కన్నడ జిల్లా అంకోలా తాలూకా హందిగద్దె గ్రామంలో జరిగింది. 

వివరాల ప్రకారం.. ఏడు నెలల క్రితమే మృతురాలు యమున (20)కు విఘ్నేశ్వర గౌడ అనే వ్యక్తితో వివాహమైంది. అయితే విఘ్నేశ్వర్‌కు మరో మహిళతో అక్రమ సంబంధం ఉండేది. ఈ విషయమై యమున భర్తతో నిత్యం గొడవపడేది. ఈ క్రమంలో మంగళవారం  ఉరివేసుకున్న స్థితిలో యమున శవమై తేలింది. అయితే తమ కుమార్తెను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని యమున తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అంకోలా పోలీసులు కేసు నమోదు చేశారు.   
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement