
దొడ్డబళ్లాపురం: నిండు గర్భిణి ఆత్మహత్య చేసుకున్న ఘటన బెంగళూరు ఉత్తర తాలూకా శివనపుర గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామ నివాసి సౌందర్య (19) ఆత్మహత్య చేసుకుంది. మూడు రోజుల క్రితమే ఈమెకు సీమంతం కూడా జరిగింది.
అయితే, గార్మెట్స్ ఫ్యాక్టరీలో పనిచేసే సౌందర్య, సంతోష్ అనే వ్యక్తిని ప్రేమించి పెద్దలను ఎదురించి 10 నెలల క్రితం వివాహం చేసుకుంది. కాగా, వివాహం తరువాత సంతోష్ అసలు రంగు బయటపడింది. సౌందర్యతో వివాహానికి ముందే ఒక యువతిని వివాహం చేసుకుని ఆమెను వదిలేసి నిజం దాచి సౌందర్యను మోసం చేసి చేసుకున్నాడు.
అంతేకాకుండా నిత్యం మద్యం తాగి వచ్చి సౌందర్యను హింసించేవాడు. ఇక, 8 నెలల నిండు గర్భిణి ఆత్మహత్యకు పాల్పడటంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తమ కుమార్తె మృతికి సంతోష్ కారణమని సౌందర్య తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న మాదనాయకనహళ్లి పోలీసులు సంతోష్‌ను అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment