husband marries another woman
-
ఇంత మోసమా.. ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత..
దొడ్డబళ్లాపురం: నిండు గర్భిణి ఆత్మహత్య చేసుకున్న ఘటన బెంగళూరు ఉత్తర తాలూకా శివనపుర గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామ నివాసి సౌందర్య (19) ఆత్మహత్య చేసుకుంది. మూడు రోజుల క్రితమే ఈమెకు సీమంతం కూడా జరిగింది. అయితే, గార్మెట్స్ ఫ్యాక్టరీలో పనిచేసే సౌందర్య, సంతోష్ అనే వ్యక్తిని ప్రేమించి పెద్దలను ఎదురించి 10 నెలల క్రితం వివాహం చేసుకుంది. కాగా, వివాహం తరువాత సంతోష్ అసలు రంగు బయటపడింది. సౌందర్యతో వివాహానికి ముందే ఒక యువతిని వివాహం చేసుకుని ఆమెను వదిలేసి నిజం దాచి సౌందర్యను మోసం చేసి చేసుకున్నాడు. అంతేకాకుండా నిత్యం మద్యం తాగి వచ్చి సౌందర్యను హింసించేవాడు. ఇక, 8 నెలల నిండు గర్భిణి ఆత్మహత్యకు పాల్పడటంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తమ కుమార్తె మృతికి సంతోష్ కారణమని సౌందర్య తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న మాదనాయకనహళ్లి పోలీసులు సంతోష్‌ను అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పుట్టింటికెళ్తే.. రెండో పెళ్లి చేసుకున్నాడు!
► మొదటి భార్య పంచాయతీ ప్రథమ పౌరురాలు ► తనకు జరిగిన అన్యాయంపై పోలీసుకు ఫిర్యాదు ► అయినా పట్టించుకోలేదంటూ ఆరోపణ ► న్యాయం చేయకపోతే ఎస్పీని కలుస్తానంటున్న బాధితురాలు రాయదుర్గం రూరల్ : ఆమె పంచాయతీ ప్రథమ పౌరురాలు. అటువంటి ఆమెకే భర్త నిరాదరణ తప్పలేదు. కాన్పు కోసం వెళ్తే.. భర్త రెండో పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు తనకు, తన బిడ్డకు న్యాయం చేయాలని ఆమె వేడుకుంటోంది. రాయదుర్గం రూరల్ మండలం చదం గ్రామానికి చెందిన ఊలెప్పతో రాయదుర్గానికి చెందిన మౌనిక వివాహం 2011 మే 18న అయింది. 2013లో ఆమె సర్పంచ్‌గా గెలుపొందారు. నాలుగున్నరేళ్లుగా ఆమె సంతానం కోసం ఎన్నో పరీక్షలు చేయించుకున్నారు. ఎట్టకేలకు డిసెంబర్లో గర్భం దాల్చిన ఆమె నెల కిందట పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. వారం కిందట పెళ్లి చేసుకుని.. బిడ్డ పుట్టినా చూసేందుకు వెళ్లని ఊలెప్ప వారం కిందట రెండో పెళ్లి చేసుకున్నాడని మౌనిక ఆరోపించారు. దీనిపై ఆమె పోలీసులకు ఐదు రోజుల కిందట ఫిర్యాదు కూడా చేశారు. అయితే ఇంతవరకు పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆమె ఆరోపించారు. తనకు న్యాయం జరిగే వరకు వదిలిపెట్టేది లేదని తేల్చిచెప్పారు. అవసరమైతే ఎస్పీని కలసి న్యాయం కోరుతానన్నారు. దీనిపై ఎస్ఐ మహానంది స్పందిస్తూ... మౌనిక ఫిర్యాదు చేసిన మాట వాస్తవమేనన్నారు. అది కుటుంబ సమస్య కావడంతో విచారణ చేసి తదుపరి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.