నా చావుకు కారణం హౌస్ ఓనర్స్ | Owners of the house cause my death | Sakshi
Sakshi News home page

Published Tue, Nov 8 2016 9:13 AM | Last Updated on Fri, Mar 22 2024 11:04 AM

అద్దెకున్న ఇంట్లో తన పిల్లలు అల్లరి చేయడమే ఆమె పాలిట శాపంగా మారింది. పిల్లలు ఆడుకున్నా.. చివరికి ఇంట్లో కుర్చి కదిపినా ఇంటి యజమానులు బెదిరింపులు, వేధింపులకు పాల్పడటంతో ఆమె ఉక్కిరిబిక్కిరైంది. ఐదు నెలలుగా ఇదే పరిస్థితి కొనసాగడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆ ఇల్లాలు చివరికి బలవన్మరణానికి పాల్పడింది. తన చావుకు ఇంటి యజమానులు ప్రసన్నకుమార్‌రెడ్డి, స్నేహలతలే కారణమని ఇంటి గోడలు, తలుపులపై రాసి వివాహిత సుజాత (28) ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సోమవారం తెల్లవారుజామున కూకట్‌పల్లిలో ఈ ఘటన స్థానికులను దిగ్భ్రాంతికి గురిచేసింది. పోలీసులు, మృతురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన గోనుగొంట్ల రామకృష్ణ, సుజాత దంపతులు రెండున్నరేళ్లుగా కూకట్‌పల్లి శ్రీనివాస కాలనీ మెడికల్ సొసైటీలోని ప్లాట్ నం28/బీలో నివాసం ఉంటున్నారు. మాదాపూర్‌లోని ఐవీవైటు కంపాక్ట్‌లో రామకృష్ణ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తుండగా, సుజాత ఇంటి వద్దనే ఉంటోంది. వీరికి కుమారుడు రిషి(3), కూతురు అమిత్యసారుు(ఏడాదిన్నర) పిల్లలు ఉన్నారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement