
కెలమంగలం(డెంకణీకోట): జీవితంలో కొత్త ఉషస్సులు నింపాల్సిన నూతన సంవ్సర వేడుకలు ఓ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపాయి. కొత్త దుస్తులు కొనాలని భర్తతో గొడవ పడిన ఓ వివాహిత తన ముగ్గురు పిల్లలతో కలిసి బావిలో దూకింది. ఘటనలో తల్లి మృతి చెందగా పిల్లలు ప్రాణాలతో బయట పడ్డారు. ఈ ఘటన కెలమంగలం పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం సాయంత్రం చోటు చేసుకొంది. డెంకణికోట పోలీసుల కథనం మేరకు.. డెంకణీకోట సమీపంలోని దడికల్ గ్రామంలో కాళియప్ప లక్ష్మి(32) దంపతులు నివాసం ఉంటున్నారు.
వీరికి కలైయరసి(13), సుజాత(11), పెరుమాల్(5) పిల్లలు న్నారు. కాళియప్ప కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని పిల్లలకు కొత్త దుస్తులు కొనిపెట్టాలని లక్ష్మి ఒత్తిడి చేసింది. ఈ విషయంలో దంపతుల మధ్య వాగ్వాదం జరిగింది. జీవితంపై విరక్తి చెందిన లక్ష్మి తన ముగ్గురు పిల్లలను వెంట తీసుకెళ్లి బావిలో తోసి అనంతరం తానూ అందులోకి దూకింది. కేకలు విన్న స్థానికులు బావిలోకి దిగి ముగ్గురు పిల్లలను సురక్షితంగా బయటకు తీశారు. అయితే లక్ష్మి మాత్రం ప్రాణాలు కోల్పోయింది. కెలమంగలం పోలీసులు లక్ష్మి మృతదేహాన్ని శవపరీక్ష కోసం డెంకణీకోట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment