
తమిళనాడు, టీ.నగర్: విధి నిర్వహణలో మహిళా ఎస్‌ఐ చేసిన టిక్‌టాక్ వీడియో రాష్ట్రవ్యాప్తంగా రెండు రోజులుగా వైరల్ అవుతోంది. సోషల్ మీడియా ట్రెండింగ్‌లో ప్రథమస్థానంలో చేరింది. యువతను విపరీతంగా ఆకర్షిస్తున్న ఈ యాప్‌కు పోలీసు అధికారులు సైతం అతీతం కాదు. కొద్ది రోజుల క్రితం చెన్నై సెంట్ థామస్‌మౌంట్ సాయుధ దళం డిప్యూటీ కమిషనర్ ఒకరు టిక్‌టాక్‌లో పాటపాడి అదరగొట్టారు. తాజాగా విధి నిర్వహణలో ఉన్న ఓ ఎస్‌ఐ ఒకరు, మహిళా ఎస్‌ఐతో కాదల్ పరిసు చిత్రంలోని కాదల్ మగరాణి అనే పాటను పాడుతూ చేసిన టిక్‌టాక్ వీడియో సంచలనంగా మారింది. ప్రస్తుతం ఈ టిక్‌టాక్ వీడియో ట్రెండింగ్‌లో మొదటి స్థానంలో ఉంది. ఇటీవల డీజీపీ టీకే రాజేంద్రన్ పోలీసుల సెల్‌ఫోన్ వినియోగంపై ఆంక్షలు విధించారు. ఎస్‌ఐ కింది హోదా పోలీసులు విధి నిర్వహణలో సెల్‌ఫోన్‌లు ఉపయోగించరాదని ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment