Women SI
-
గుడ్లవల్లేరు విద్యార్థులను బెదిరించిన ఎస్ఐ శిరీష బదిలీ
-
ఫుల్‌గా మందు కొట్టి.. మహిళా SI పై టీడీపీ నేతల దాడి
-
ప్రీ వెడ్డింగ్ షూట్ కు పోలీస్ వాహనాన్ని వాడుకున్న మహిళా ఎస్సె
-
మహిళా ఎస్ఐ ఆత్మహత్య.. కారణం అదేనా..?
తిరువొత్తియూరు: తిరుచ్చి సమీపంలో ఓ మహిళా ఎస్ఐ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. వివరాల ప్రకారం.. తిరువెరంబూరు సమీపంలోని నావల్ పట్టిలో పోలీసు ట్రైనింగ్ కళాశాల ఉంది. ఇక్కడ మహిళలకు పోలీసు శిక్షణ ఇస్తున్నారు. ఈ ట్రైనింగ్ కళాశాలలో ఎస్ఐగా తిరుచ్చి డి.వి.ఎస్. టోల్గేట్ నగర్‌కు చెందిన ఆదిలక్ష్మి (56) పని చేస్తున్నారు. ఈమె కళాశాల ప్రాంగణంలోని పోలీసు క్వార్టర్స్‌లోనే నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో శనివారం ఉదయం తన ఇంటిలో ఆదిలక్ష్మి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. నావల్‌పట్టి పోలీసులు ఆమె మృతదేహాన్ని శవపరీక్ష కోసం తిరుచ్చి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆదిలక్ష్మి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు? పని ఒత్తిడి కారణమా? అనే కోణంలో విచారణ చేపట్టారు. ఆదిలక్ష్మి భర్త నటరాజన్ (60) ఎస్ఐగా పని చేసి రిటైర్డ్ అయ్యారు. ఆదిలక్ష్మికి లెనిన్ (26), భరత్ (22) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
మహిళా ఎస్ఐ ఆత్మహత్య
విజయనగరం క్రైమ్/సఖినేటిపల్లి/కోడూరు: విజయనగరం పోలీసు శిక్షణ కళాశాల (పీటీసీ)లో మహిళా ఎస్ఐ కొప్పనాతి భవాని (27) ఆత్మహత్య చేసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి ఎస్ఐగా పనిచేస్తున్న భవాని శిక్షణ కోసం పీటీసీకి వచ్చారు. ఆదివారం తెల్లవారేసరికి ఆమె గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని మరణించి ఉండటాన్ని గుర్తించారు. విజయనగరం వన్‌టౌన్ సీఐ జి.మురళి తెలిపిన మేరకు.. పీటీసీలో ఐదురోజుల శిక్షణ శనివారం సాయంత్రం పూర్తయింది. అనంతరం శిక్షణకు వచ్చినవారంతా వెళ్లిపోయారు. తాను ఆదివారం వెళతానని సహచరులకు తెలిపిన భవాని శనివారం సాయంత్రం 6 గంటలకు తన సోదరుడు శివశంకర్‌తో ఫోన్లో మాట్లాడి తాను వైజాగ్ వస్తానని, కలుస్తానని చెప్పారు. ఆదివారం ఉదయం 5 గంటల ప్రాంతంలో పీటీసీలో విధి నిర్వహణకు వచ్చిన స్వీపర్లు తలుపు కొట్టినా తీయకపోవడంతో కిటికీ తెరిచి చూశారు. గదిలో ఫ్యాన్‌కి ఉరేసుకుని భవాని మృతిచెంది ఉండటాన్ని గమనించి డ్యూటీ అధికారులకు సమాచారమందించారు. అక్కడికి చేరుకున్న వన్‌టౌన్ పోలీసులు మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కుటుంబసభ్యులకు సమాచారమందించి విచారణ చేపట్టారు. పీటీసీ డ్యూటీ ఆఫీసర్ ఫిర్యాదు మేరకు వన్‌టౌన్ సీఐ మురళి ఆధ్వర్యంలో ఎస్ఐ దుర్గాప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు కారణాలు దర్యాప్తులో తేలాల్సి ఉంది. వ్యక్తిగత కారణాలతోనే ఎస్ఐ భవాని ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందని విజయనగరం జిల్లా ఎస్పీ ఎం.దీపిక పేర్కొన్నారు. కూలి పనులకు వెళ్లి.. కష్టపడి చదివి.. కృష్ణా జిల్లా కోడూరు మండలం సాలెంపాలెంలో కొప్పనాతి శ్రీనివాసరావు, నాగేశ్వరమ్మ దంపతులకు కుమారుడు శివశంకరరావు, కుమార్తె భవాని సంతానం. పిల్లల చిన్నప్పుడే శ్రీనివాసరావు మృతిచెందారు. తల్లి కూలి పనులకు వెళ్లి పిల్లల్ని పోషించింది. తల్లి కష్టాన్ని పంచుకోవాలనే తపనతో భవాని చిన్నప్పటినుంచే ఆమెతోపాటు కూలి పనులకు వెళ్లేది. పనులకు వెళుతూనే గ్రామంలో పదోతరగతి వరకు చదువుకుంది. చదువుతోపాటు క్రీడల్లో కూడా రాణించిన భవాని అవనిగడ్డలో ఇంటర్, డిగ్రీ పూర్తిచేసింది. 2018లో తొలి ప్రయత్నంలోనే ఎస్ఐగా ఎంపికైన భవాని రాజోలు పోలీస్ స్టేషన్లో శిక్షణ అనంతరం సఖినేటిపల్లిలో పనిచేస్తున్నారు. తల్లి, ఉద్యోగాన్వేషణలో ఉన్న సోదరుడితో కలిసి సఖినేటిపల్లిలో నివాసం ఉంటున్నారు. స్వగ్రామంలో ఉన్న తాతయ్య కొప్పనాతి కృష్ణ, నాయనమ్మ చంద్రలంకమ్మల బాధ్యతలను కూడా చూసుకుంటున్నారు. భవానీకి ఆత్మహత్య చేసుకోవాల్సినంత కష్టాలు ఏమీ లేవని ఆమె కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఈ మరణంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని సాలెంపాలెం తీసుకురానున్నారు. -
ఎస్ఐ శ్రీనివాస్‌రెడ్డికి రిమాండ్
సాక్షి, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా మరిపెడ పోలీస్‌స్టేషన్ పరిధిలో ట్రైనీ మహిళా ఎస్ఐపై అదే పీఎస్‌కు చెందిన ఎస్ఐ శ్రీనివాస్‌రెడ్డి లైంగికదాడికి యత్నించిన కేసులో అతన్ని అరెస్ట్ చేసి 14 రోజుల రిమాండ్ నిమిత్తం మహబూబాబాద్ సబ్ జైలుకు పంపినట్లు ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి తెలిపారు. బుధవారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మీడియాతో ఎస్పీ ఈ కేసు వివరాలు వెల్లడించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు శ్రీనివాస్‌రెడ్డిపై ఎఫ్ఐఆర్ బుక్ చేసినట్లు తెలిపారు. విచారణ అధికారిగా తొర్రూరు డీఎస్పీ వెంకటరమణను నియమించామన్నారు. ఎస్ఐ శ్రీనివాస్‌రెడ్డిపై ఐపీసీ 354, 354ఏ, 354బి, 354డి, 376(2), 511 ఐపీసీతోపాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు వివరించారు. చట్టం దృష్టిలో అందరూ సమానమేనని, తప్పుచేసిన వారికి తప్పకుండా శిక్షపడుతుందన్నారు. కేసుకు సంబంధించి పూర్తి వివరాలను రాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారులకు నివేదిక పంపించనున్నట్లు ఎస్పీ వివరించారు. జిల్లాలో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని అన్నారు. -
Anie Siva: ఐస్‌క్రీమ్‌లు అమ్మిన ఊరికే ఎస్ఐగా వచ్చింది!
మలయాళ నటుడు మోహన్‌లాన్ ‘ఆమె కథ అందరికీ స్ఫూర్తి కావాలి’ అని ఫేస్బుక్లో రాశాడు. కేరళ ప్రతిపక్ష నాయకుడు సతీశన్ ‘ఓహో... ఏమి పట్టుదల’ అని శ్లాఘించాడు. కేరళ డిజిపి లోక్‌నాథ్ బెహరా ‘నీకేం కావాలో చెప్పమ్మా’ అని చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇవన్నీ ‘ఆనీ శివ’ అనే కొత్త మహిళా ఎస్.ఐ గురించి. జూన్ 25న ఆమె ఎస్.ఐ అయ్యింది అక్కడ. పదేళ్ల క్రితం భర్త, తల్లిదండ్రులు వదిలేయగా ఏ ఊళ్లో అయితే నిమ్మరసం, ఐస్‌క్రీమ్‌లు అమ్ముతూ వచ్చిందో అదే ఊరికి ఆమె ఎస్.ఐ. అయ్యింది. ‘నా పాతరోజుల మీద ఇంతకు మించి ఏం ప్రతీకారం తీర్చుకోను’ అందామె. మనం పేడముద్దలా ఉంటే జీవితం విసిరికొట్టినప్పుడు హరీమంటాం. బంతిలా ఉంటే ఆనీ అవుతాం. ఆమె కథ ఇది. రెండు మూడు రోజులుగా కేరళలో ఒక మహిళా సబ్ ఇన్స్పెక్టర్ వార్తల్లో ఉంది. సాధారణంగా ఇలా సినిమాల్లో జరుగుతుంటుంది. అయితే కల్పన కంటే నిజ జీవితంలోనే ఎంతో అనూహ్యత ఉంటుంది. అందుకే ఆనీ శివ జీవితం ఇప్పుడు చాలామందికి స్ఫూర్తికానుంది. ఒక విశేష నియామకం త్రివేండ్రం నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉండే వర్కల అనే టౌన్‌కు జూన్ 25న ఆనీ శివ సబ్ ఇన్స్పెక్టర్గా వచ్చింది. అది ఆమెకు తొలిపోస్టు. అంతకుముందు ఆమె రెండు సంవత్సరాలుగా కొచ్చిలో ట్రయినింగ్ లో ఉంది. అది పూర్తి కావడంతో వర్కలకు పోస్టింగ్ ఇచ్చారు. మామూలుగా అయితే అసలు ఇది ఏ మాత్రం చెప్పుకోదగ్గ వార్త కాదు. కాని వర్కలకు ఆనీ శివ ఎస్.ఐగా రావడం మాత్రం పెద్ద వార్త. ఎందుకంటే పదేళ్ల క్రితం అదే టౌన్లో ఆమె పొట్టకూటి కోసం నిమ్మకాయ రసం అమ్మింది. ఐస్‌క్రీమ్‌లు అమ్మింది. ఇన్సూరెన్స్ ఏజెంట్‌గా పని చేసింది. సరుకులు ఇంటింటికి తిరిగి అందించే బాయ్‌గా పని చేసింది. వేయి పనులు చేసింది బతకడానికి. ఎందుకంటే ఆమె భర్త వదిలిపెట్టిన గతి లేని స్త్రీ. పైగా ఒక బిడ్డకు తల్లి. కన్నవాళ్లు తన్ని తరిమేసిన మహిళ. అలాంటి మహిళ ఆ ఊళ్లో బతికింది. కాని ఇవాళ అదే మహిళ ఆ ఊరికే ఎస్.ఐగా తిరిగొచ్చింది. ప్రేమ–వంచన త్రివేండ్రంకు గంట దూరంలో ఉండే కంజీరంకులమ్ అనే చిన్న ఊరికి చెందిన ఆన్నీ శివ తను డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉండగా ప్రేమించిన కుర్రాడితో పారిపోయి పెళ్లి చేసుకుంది. ఆ పెళ్లి ఏమాత్రం ఆమె తల్లిదండ్రులకు ఇష్టం లేదు. ప్రేమించినవాడు ఆమెతో వర్కలలో కాపురం పెట్టాడు. ఒక కొడుకు పుట్టాడు. అప్పటికి ఆమె పట్ల విముఖత ఏర్పరుచుకున్న అతడు ఆమెను ఆమె ఖర్మానికి వదిలి వెళ్లిపోయాడు. జీవితంలో దెబ్బ తిన్న ఆనీ శివ తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లింది. వాళ్లు ‘గడప ఎక్కావంటే కాళ్లు విరగ్గొడతాం’ అన్నారు. దాంతో గతి లేక వర్కల వచ్చి అక్కడ ఉంటున్న నానమ్మ ఇంట్లోని స్థలంలో చిన్న షెడ్ వేసుకుని జీవించసాగింది. ఆమె తల్లి, అన్న, తండ్రి కొడుకు పేరు శివ స్వరూప్. కొడుకును సాకడానికి ఆనీ శివ నిమ్మకాయరసం, ఐస్‌క్రీమ్‌లు అమ్మింది. వర్కల పుణ్యక్షేత్రం. అక్కడ గుడి చాలా ఫేమస్. పాపనాశం బీచ్‌లో మునిగితే పాపాలు పోతాయని నమ్మిక. అందుకని యాత్రికులు వస్తుంటారు. వారికి తినుబండారాలు అమ్మేది. ఆ డబ్బు చాలక ఇన్సూరెన్స్ ఏజెంట్‌గా మారింది. ఇంకా ఏ పని దొరికితే అది. ఆమె తను స్త్రీగా ఉంటే ఇబ్బంది అని పూర్తిగా అబ్బాయి క్రాఫ్‌లో తిరిగేది. చూసేవారు ఆమెతో ఉన్న కొడుక్కు అన్నగాని తండ్రి గాని అనుకునేవారు. ఇన్ని పనులు చేస్తూనే ఆన్నీ తన చదువు తిరిగి కొనసాగించింది. కష్టపడి డిగ్రీ సోషియాలజీ పూర్తి చేసింది. స్నేహితుని సలహా ఆమె చురుకుదనం, శరీర స్వభావం గమనించిన మిత్రుడు నువ్వు పోలీసాఫీసర్‌గా సరిపోతావు.. ట్రై చెయ్ అని సలహా ఇచ్చాడు. దాంతో ఆనీ నియామక పరీక్షలకు కోచింగ్ తీసుకోవడం మొదలెట్టింది. 2016లో ఆమె మహిళా కానిస్టేబుల్‌గా ఉద్యోగం వచ్చింది. అయితే ఆమె లక్ష్యం ఎస్.ఐ కావడం వల్ల తిరిగి పరీక్షలు రాయడం కొనసాగించి 2019లో ఎస్.ఐగా సెలెక్ట్ అయ్యింది. ట్రైనింగ్, ప్రొబేషన్ పూర్తయ్యాక తన ఊరికే ఎస్.ఐగా వచ్చింది. ప్రశంసల వెల్లువ ఆమె పోస్టింగ్ తీసుకున్న వెంటనే ఆమె జీవితం గురించి అక్కడ విశేష కథనాలు రావడంతో కేరళలో ఆనీకు ప్రశంసలు వెల్లువెత్తాయి. సినిమా, రాజకీయ రంగాలలోని ప్రముఖులు ఆమె తన జీవితాన్ని తీర్చిదిద్దుకున్న వైనాన్ని చాలా ప్రశంసించారు. ‘ఆమె జీవితం ఎందరికో స్ఫూర్తి కావాలి’ అని మోహన్‌లాల్‌తో సహా అందరూ కోరుకున్నారు. ఆనీకి కూడా తన విజయం పట్ల ఎంతో సంతోషంగా ఉంది. ‘నన్ను బాధించిన పాతరోజుల మీద ఇంతకు మించి ఏం ప్రతీకారం తీర్చుకోను?’ అని అంది. తన ఇంటర్వ్యూలలో తన కొడుకు కొచ్చిలో చదువుకుంటున్నాడని, ట్రయినింగ్ సమయంలో అక్కడే స్కూల్లో వేశానని, ఇప్పుడు ఇద్దరం వేరు వేరుగా ఉండాల్సి వస్తోందని అందామె. అది చదివిన కేరళ డిజిపి వెంటనే కొచ్చికి బదిలీ చేశారు. తల్లీకొడుకులను కలపడానికి ఈ ట్రాన్స్ఫర్ చేశాం అని ఆయన తెలియచేశారు. లోకం మారాలి వివాహంలో విభేదం వచ్చి కూతురు పుట్టింటికి వస్తే అక్కున చేర్చుకోవడానికి తల్లిదండ్రులు సిద్ధంగానే ఉంటారు. కాని లోకులే సూటిపోటి మాటలు అంటుంటారు. లోకులకు భయపడి తల్లిదండ్రులు తమ కూతుళ్లను వారి ఖర్మానికి వదిలిపెడుతున్నారు. లోకుల ధోరణి మారాలి. అప్పుడు వివాహిత స్త్రీలు తమకు తల్లిదండ్రుల అండ ఉంది అనుకుంటారు. ఆత్మహత్యల వరకూ వెళ్లరు అంది ఆనీ. – సాక్షి ఫ్యామిలీ -
అందుకే మృతదేహన్ని మోశా: ఎస్ఐ శిరీష
సాక్షి, శ్రీకాకుళం : ఖాకీ దుస్తుల్లో కాఠిన్యం కాదు.. కారుణ్యం కూడా ఉంటుంది. పోలీసులు కఠువుగా ఉంటారని అనుకుంటారు. విధి నిర్వహణలో ఒత్తిడి, జనం రూల్స్ పాటించకపోతే వచ్చే కోపం, నేరగాళ్లను వదలకూడదనే కాఠిన్యం ఉంటాయి. కానీ కొందరు పోలీసులు సమయానుసారం వారిలోని మానవత్వాన్ని బయటపెడుతుంటారు. కొన్నిసార్లు సాహసాలు చేస్తుంటారు. మరికొన్ని సార్లు మంచి పనులతో ఔరా అనిపించుకుంటారు. ఈ కోవలోకే వస్తారు పలాస కాశీబుగ్గ ఎస్ఐ శిరీష. పోలీసులంటే మరింత గౌరవ భావం ఏర్పడేలా గొప్పపని చేశారు. చదవండి: మహిళా ఎస్ఐ మానవత్వం శాంతిభద్రతల పర్యవేక్షణే కాదు మానవత్వం కూడా ఉందని ఆమె చాటుకున్నారు. అనాథ శవాన్ని ఆత్మబంధువులా మోసి దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్న శిరీషను ‘సాక్షి’ పలకరించింది. తనలోని అంతరంగాన్ని పరిచయం చేసింది. వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో చదువుకున్న ఆమె తదనంతరం జీవితంలో అనేక ఇబ్బందులు ఎదుర్కోవడమే కాకుండా అవమానాలు, కష్టాలు చవి చూసింది. ఆ వివరాలు తన మాటల్లోనే.. కుటుంబ నేపథ్యం.. మా స్వస్థలం విశాఖపట్నం సిటీ రామాటాకీస్ ప్రాంతం. ఎం.ఫార్మసీ చదువుకున్నాను. తల్లిదండ్రులు కొత్తూరు అప్పారావు( తాపీ మేస్త్రీ), రమణమ్మ(కూలీ)గా పనిచేసేవారు. అన్నయ్య సతీష్‌కుమార్ ఇండియన్ నేవీలో, సోదరి దేవి వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్నారు. 2014లో ఎక్సైజ్ కానిస్టేబుల్‌గా మద్దిలపాలెం ఎక్సైజ్ కంట్రోల్ రూమ్‌లో పనిచేశాను. ఆ మాటలు నిద్రపోనివ్వలేదు.. 2014లో ఎక్సైజ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న సమయంలో మా ఎస్పీ ఆఫ్ ట్రాల్ కానిస్టేబుల్‌వి అని మందలించగానే నిద్ర లేని రాత్రులు గడిపాను. ఆ మాటతో బాధపడ్డాను. ఐతే ఓ ఎస్పీ ఆఫ్ట్రాల్ అంటే మరో ఎస్పీ తాను చదువుకుంటానంటే ప్రోత్సహించారు. అందులో భాగంగా 8 నెలల పాటు సెలవు పెట్టాను..జీతం లేకపోయినా ఎస్ఐ ఉద్యోగం సంపాదించాలని భావించాను. కానిస్టేబుల్‌గా పనిచేసిన కాలంలో సంపాదించిన రూ.1.50 లక్షలను తీసుకుని ఓ ప్రైవేటు ఇన్స్టిట్యూట్లో చేరి పట్టుదలతో చదివి ఎస్ఐగా ఎంపికయ్యాను. అనంతపురంలో రెండేళ్లు శిక్షణ తీసుకున్నాను. నన్ను ఆఫ్ట్రాల్ అన్న ఎస్పీయే విశాఖపట్నం జిల్లా పరిషత్‌లో సన్మానం చేశారు. ఇదో మధురానుభూతి. 13 ఏళ్లకే పెళ్లి.. బరువులు మోయడం.. సేవ చేయడం వంటి వాటిపై ట్రైనింగ్‌లోనూ తర్ఫీదు లభించింది. అంతకు ముందు మా కులం గురించి చెప్పాలి. మా కులంలో ఆడపిల్ల అంటే పరదా చాటున ఉండాల్సిందే. అందులో నాన్నకు నేను భారం అని భావించి 13 ఏళ్లకే పెళ్లి చేశారు. ఏం చేయాలో తెలియదు. నా భర్త వయస్సుకు నా వయస్సుకు సంబంధం లేదు. భార్యగా బాధ్యత ఏంటో తెలియదు. ఎలా నెట్టుకురావాలో తెలియదు. జీవితంతో పోరాడాను. చదువుకోవాలని ఉంది. పుస్తకం కొనేందుకు డబ్బులేదు. కష్టాలతో రాటుదేలా కష్టాలతో సావాసం చేసి ఎంతో నేర్చుకున్నాను. అందుకే సేవ అంటే తాను ముందుంటాను. అందులో నా తండ్రే స్పూర్తి. మా నాన్నకు పోలీస్ యూనిఫాం అంటే ఎంతో ఇష్టం. కర్తవ్యం సినిమాలో పోలీస్ ఆఫీసర్ విజయశాంతిలా నన్ను చూడాలన్న నాన్న కల నెరవేర్చాను. ఆయన నడిపిన బాటలోనే సేవంటే ఇష్టపడతాను. మృతదేహం ఎందుకు మోశానంటే.. పలాస మండలంలో అడవికొత్తూరు మారుమూల ప్రాంతం. అక్కడికి వాహనాలు వెల్లవు. అనాథ శవం ఉందని చెప్పగా సీఐ ఆదేశాల మేరకు అక్కడికి చేరుకున్నాం. నేను, ఓ కానిస్టేబుల్, హోంగార్డు కలిసి పొలాల గట్లపై నుంచి నడుచుకుంటూ వెళ్లి చూడగా ఓ గుంతలో 70 ఏళ్లు దాటిన వృద్ధుని శవం కనిపించింది. జాలి వేసింది. కొంతమంది భూత, ప్రేత పిశాచాలని.. ముట్టుకుంటే స్నానం చేయాలని.. అదో అపచారంలా భావించే వారికి ఇదో కనువిప్పు కావాలి. బయటకు తీసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. శవాన్ని ముట్టుకునేందుకు ఎవరూ ఇష్టపడం లేదు. చివరికి కాశీబుగ్గలో ఉన్న లలితా చారిటబుల్ ట్రస్ట్ భాగస్వామ్యంతో స్ట్రెచర్ తీసుకురమ్మని చెప్పాను. స్ట్రెచర్‌పై శవాన్ని వేసేందుకు నాతో వచ్చిన కానిస్టేబుల్ ఇష్టపడలేదు. ఎవరి ఇష్టాయిష్టాలు వారివి. నేనే స్ట్రెచర్‌పై శవాన్ని ఉంచి మరొకరి సహకారంతో కిలోమీటరు మేర వరి పొలాల గట్లపై శవాన్ని మోశాను. నా దృష్టిలో శివుడైనా... శవమైనా ఒక్కటే.. ఇది నా డ్యూటీ. చదువంతా వైఎస్సార్ పుణ్యమే.. ఎస్ఐగా శిరీష ప్రస్తానం మొదలైందంటే అది మహానుభావుడు దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పుణ్యమే. అత్తవారింటి నుంచి బయటపడ్డాక ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రీయంబర్స్మెంట్ పథకంలో విశాఖలోని ఉమెన్స్ కళాశాలలో చదువుకున్నాను. ఎం.ఫార్మసీలో ఏకంగా నాలుగేళ్లపాటు ప్రభుత్వం ఇచ్చిన డబ్బుతోనే చదివాను. నేను నిత్య విద్యార్థిని. గ్రూప్–1 సాధించి డీఎస్పీ కావాలన్నదే లక్ష్యం. ఆ దిశగా ప్రయత్నం చేస్తున్నాను. ఉన్నతాకారులు సహకరిస్తారన్న నమ్మకం నాకుంది. డీజీపీ గౌతం సవాంగ్ స్వయంగా ఫోన్ చేసి అభినందించారు. హోంమంత్రి సుచరిత, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, తెలంగాణ పోలీసులు, తెలంగాణ బీజేపీ చీఫ్ బండిసంజయ్ తదితరులు అభినందించడం మర్చిపోలేను. -
మహిళా ఎస్ఐ మానవత్వం
సాక్షి, అమరావతి/కాశీబుగ్గ: మానవత్వం చాటుకున్న మహిళా ఎస్ఐ కె.శిరీషపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఓ అనాథ శవాన్ని తన భుజాలపై మోసుకుంటూ తీసుకెళ్లిన ఆమె ఫొటోలు, వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో నెటిజన్లు అభినందనలతో ముంచెత్తుతున్నారు. డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆ ఫొటోలను ట్విట్టర్, ఏపీ పోలీస్ ఫేస్బుక్ పేజీలలో ట్యాగ్ చేసి, ‘మహిళా ఎస్ఐ.. మానవీయ కోణం’ అంటూ ప్రశంసించారు. ఆమెకు ప్రçశంసపత్రం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. హోం మంత్రి సుచరిత సైతం ట్విట్టర్లో శిరీషకు అభినందనలు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో ఉన్న అడవి కొత్తూరులోని పంటపొలాల్లో గుర్తు తెలియని వృద్ధుని మృతదేహం ఉన్నట్లు సోమవారం పోలీసులకు సమాచారం అందింది. ఎస్ఐ శిరీష ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికుల ద్వారా వివరాలు తెలుసుకున్న ఆమె.. ఆ శవాన్ని తరలించేందుకు ముందుకు రావాలని అక్కడున్న వారిని అభ్యర్ధించారు. ఎవరూ ముందుకు రాకపోవడంతో తనే ముందడుగు వేసి.. వేరొకరి సాయంతో కిలోమీటర్‌కు పైగా మృతదేహాన్ని మోసుకెళ్లారు. స్థానికంగా ఉన్న లలితా చారిటబుల్ ట్రస్ట్‌కు మృతదేహాన్ని అప్పగించడమేగాక, ట్రస్ట్ నిర్వాహకులతో కలిసి దహన సంస్కారాలు నిర్వహించారు. -
మహిళా ఎస్సైపై డీజీపీ ప్రశంసలు
సాక్షి, శ్రీకాకుళం: ముక్కూమొహం తెలియని ఓ మృతదేహాన్ని భుజాల మీద మోసి అందరికీ ఆదర్శంగా నిలిచిన మహిళా ఎస్సై శిరీషను డీజీపీ గౌతమ్ సవాంగ్ అభినందించారు. ఆపదలో నేనున్నానంటూ వారికి బాసటగా నిలబడిన ఆమెకు ప్రశంసా పత్రాన్ని అందజేయనున్నారు. హోం మంత్రి మేకతోటి సుచరిత సైతం సదరు పోలీసు అధికారిణిని మెచ్చుకున్నారు. శ్రీకాకుళంలో అడవికొత్తూరు గ్రామ పొలాల్లో గుర్తు తెలియని వృద్ధుడు మృతదేహం లభ్యమైంది. ఆ మృతదేహాన్ని మోసేందుకు స్థానికులు నిరాకరించారు. ఈ విషయం తెలుసుకున్న కాశీబుగ్గ మహిళా ఎస్సై శిరీష తానే రెండు కిలోమీటర్లు మోసుకుంటూ వెళ్లి లలితా చారిటబుల్ ట్రస్ట్‌తో కలిసి అంత్యక్రియలు జరిపించిన విషయం తెలిసిందే. (చదవండి: మృతదేహాన్ని భుజాలపై మోసుకెళ్లిన మహిళా ఎస్సై) (చదవండి: డబ్బు.. మద్యం పంపిణీకి చెక్ పెట్టేలా..) Women SI of @POLICESRIKAKULM Carries Homeless Man's Dead Body For 2 kilometres After Villagers Refused to Help in Srikakulam District. Appreciating the humanitarian gesture of Sub inspector Kotturu Sirisha of Kasibugga police station. 👏🏻 pic.twitter.com/53udc8bxoO — Mekathoti Sucharitha (@SucharitaYSRCP) February 1, 2021 -
వృద్ధురాలి ఆకలి తీర్చిన మహిళాఎస్.ఐ..
మల్కన్‌గిరి: జిల్లా కేంద్రంలో విధుల నిర్వహణలో ఉంటుండగా ఓ మహిళాఎస్.ఐ (సబ్ఇన్స్పెక్టర్) అక్కడి వృద్ధురాలి ఆకలి తీర్చి మానవీయతను ప్రదర్శించింది. ఇదే సంఘటనను చూసిన అక్కడి సిబ్బంది, స్థానికులు ఆమెను అభినందిస్తున్నారు. అసలే ఓ వైపు కరోనా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతుంటే దీని నుంచి రక్షణ పొందేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ నిబంధనలు అమలు చేస్తున్నాయి. ఈ కారణంగా ఎంతో మంది పేదలు తినడానికి తిండి దొరకక పోవడంతో నానా అవస్థలు పడుతున్నారు. ఎన్నో రోజుల పాటు పస్తులతో దుర్భర జీవితాలు గడిపిన వారు మనకు ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటారు. ఈ నేపథ్యంలో బిచ్చగాళ్లు, అనాథలు, నిరాశ్రయులు, వృద్ధుల పరిస్థితి ఊహించుకుంటే దారుణం. ఇదే తరహాలో మెడికల్ కూడలి వద్ద బుధవారం వాహనాల తనిఖీలు చేస్తున్న సబ్ఇన్స్పెక్టర్ శుభశ్రీ నాయక్‌కు అక్కడ ఆకలితో అలమటిస్తున్న ఓ వృద్ధురాలు కనిపించింది. సరిగ్గా మధ్యాహ్నం 12 గంటల సమయంలో అక్కడి బోరు వద్దకు నీరు తాగేందుకు ఆ వృద్ధురాలు పాకుకుంటూ వెళ్లడాన్ని ఆ ఎస్.ఐ గమనించారు. దీంతో ఆమె వద్దకు వెళ్లి, వివరాలు ఆరా తీశారు. ఆ వృద్ధురాలికి ఎవరూ లేరని తెలియడంతో ఆ వృద్ధురాలిని ఓ చోట కూర్చోబెట్టిన ఎస్.ఐ, దగ్గరలోని దుకాణానికి వెళ్లి, అరటిపండ్లు కొనుక్కొని తీసుకువచ్చింది. ఆమెకు ఇస్తుండగా ఆ పండ్లు తీసుకునేందుకు కూడా ఆ వృద్ధురాలి చేతులు సహకరించకపోవడంతో జాలిపడిన ఎస్.ఐ స్వయంగా తినిపించి, ఆ తర్వాత డ్రింక్ తాగిపించింది. అనంతరం ఆ వృద్ధురాలి ముఖం, చేతులు శుభ్రంగా నీటితో కడిగి, ముఖానికి మాస్క్ కట్టి మరీ అక్కడి నుంచి ఆ ఎస్.ఐ వెనుదిరగడం విశేషం. -
ఢిల్లీలో మహిళా ఎస్సై దారుణ హత్య
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో ఓ మహిళా పోలీసు అధికారి దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటన వాయువ్య ఢిల్లీలోని మెట్రో స్టేషను సమీపంలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఢిల్లీ మొత్తం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసిన వేళ.. ఇలా ఓ మహిళా ఎస్సై హత్యకు గురికావడం కలకలం రేపుతోంది. వివరాలు... హర్యానాలోని సోనిపట్‌కు చెందిన ప్రీతి అహ్లావత్(26) 2018లో పోలీసు ఉద్యోగానికి ఎంపికయ్యారు. ఈ క్రమంలో ఆమెకు తూర్పు ఢిల్లీలోని పట్పార్గంజ్ పారిశ్రామిక ప్రాంతంలో ఎస్సైగా పోస్టు లభించింది. అప్పటి నుంచి ప్రీతి.. రోహిణి ప్రాంతంలో బస చేస్తూ విధులు నిర్వరిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం విధులు ముగించుకున్న ప్రీతి.. రాత్రి తొమ్మిదిన్నర గంటల సమయంలో.. రోహిణి మెట్రో స్టేషను నుంచి నడుచుకుంటూ వెళ్తుండగా గుర్తు తెలియని దుండగుడు ఆమెపై కాల్పులు జరిపాడు. దీంతో ఆమె అక్కడిక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇక సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని గుర్తించామని.. అయితే అతడిని ఇంతవరకు అరెస్టు చేయలేదని పేర్కొన్నారు.(ఢిల్లీ ఎన్నికల పోలింగ్ లైవ్అప్డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) కాగా వ్యక్తిగత కక్షల నేపథ్యంలో ప్రీతి హత్య జరిగినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. ఆమెకు పరిచయం ఉన్న దీపాంశు అనే వ్యక్తి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు అనుమానిస్తున్నారు. అనంతరం హర్యానాలోని తన ఇంటికి వెళ్లి అతడు కూడా ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. ఇక దీపాంశు కూడా ఢిల్లీలో పోలీసు అధికారిగా విధులు నిర్వర్తిస్తున్నట్లు తెలుస్తోంది. -
మహిళా ఎస్ఐ వేధింపులు
సాక్షి, అమరావతి బ్యూరో/గన్నవరం: పోలీస్ స్టేషన్‌కు పిలిచి మందలించారనే మనస్తాపంతో కృష్ణా జిల్లాలో ఓ యువకుడు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. గన్నవరంలోని సొసైటీపేటలో నివసించే చిట్టూరి మురళి (21) తండ్రి చనిపోవడంతో తల్లితో కలసి టీస్టాల్ నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. విజయవాడలోని ఓ కళాశాలలో డిగ్రీ చదువుతున్న మురళి ఆదివారం సాయంత్రం స్కూటీపై రాంగ్రూట్లో వెళ్తుండగా పాత స్టేట్‌బ్యాంక్ ఎదుట భర్తతో కలిసి ఆస్పత్రికి వెళ్లి వస్తున్న గన్నవరం మహిళా ఎస్ఐ పి.నారాయణమ్మ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టాడు. ఈ విషయమై ఎస్ఐ అతడిని మందలించడంతోపాటు పోలీస్‌స్టేషన్‌కు రప్పించారు. ఈ ఘటనతో మనస్తాపానికి గురైన మురళి ఇంటికి వెళ్లి భోజనం చేశాక ఇప్పుడే వస్తానంటూ తల్లికి చెప్పి ద్విచక్ర వాహనంపై వెళ్లాడు. ఎస్ఐ నారాయణమ్మ తనను మానసికంగా తీవ్ర వేధింపులకు గురి చేశారని, తన చావుకు ఆమే కారణమంటూ అనంతరం కొద్దిసేపటికి తన మిత్రులకు వాట్సాప్‌లో వాయిస్ మెసేజ్‌లు పంపించాడు. సోమవారం మధ్యాహ్నం గన్నవరం కొనాయి చెరువు సమీపంలో మురళి స్కూటీ, పాదరక్షలను గుర్తించిన పోలీసులు గజ ఈతగాళ్ల సాయంతో మృత దేహాన్ని వెలికి తీశారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు సీఐ కె.శ్రీనివాసరావు తెలిపారు. క్షణికావేశంలో ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చన్నారు. జాతీయ రహదారిపై నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసుకుంటూ వచ్చిన మురళి తన ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టి కనీస మర్యాద లేకుండా వ్యవహరించాడని మహిళా ఎస్ఐ నారాయణమ్మ పేర్కొన్నారు. దీనిపై సీఐకి సమాచారం ఇచ్చి స్టేషన్‌కు పిలిచి మందలించామన్నారు. -
పురుడు పోసిన పోలీసు
సాక్షి, చెన్నై: పురిటి నొప్పులతో తల్లడిల్లిన మహిళకు నడిరోడ్డుపై ప్రసవం చేసి న్యాయ రక్షణకే కాదు, ప్రాణ రక్షణకు తాము ముందుం టామని నిరూపించింది ఓ మహిళా ఇన్స్పెక్టర్. వివరాల్లోకి వెళితే.. చూలైమేడు సౌరాష్ట్రానగర్ ఎనిమిదవ వీధికి చెందిన మహిళ భానుమతి నిండు గర్భిణి. ఈమె భర్త రాత్రి పనికి వెళ్లాడు. ఇంటిలో భానుమతి మాత్రమే ఒం టరిగా ఉన్నది. ఈ స్థితిలో శుక్రవారం రాత్రి 2.45 గంటలకు భానుమతికి పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో నొప్పులు తట్టుకోలేక ఆమె ఆటో ఎక్కి ఆస్పత్రికి వెళ్లాలని రోడ్డుపైకి వచ్చింది. అయితే ఒక్క ఆటో కూడా రాకపోగా నొప్పులు అధికంగా కావడంతో భానుమతి చూలైమేడు హైవే రోడ్డుపై పడుకొని తల్లడిల్లింది. అదే సమయంలో రాత్రి గస్తీ పనుల్లో ఉన్న చూలైమేడు నేరవిభాగ ఇన్స్పెక్టర్ చిత్ర భానుమతిని గమనించి వాహనం ఆపింది. తర్వాత భానుమతిని తన జీప్‌లో ఎక్కించి ఆస్పత్రికి తీసుకుని వెళ్లాలని భావించింది. అయితే భానుమతికి అధికంగా రక్తస్రా వం అవుతుండడంతో వాహనంలోకి ఎక్కించలేకపోయారు. వెంటనే తన వాహనాన్ని అడ్డుగాపెట్టి, సహాయకురాలు, అక్కడ పారిశుధ్ద్య పనుల్లో ఉన్న ఇద్దరు మహిళల సాయంతో భానుమతికి ప్రసవం చేశారు. కాన్పులో భానుమతికి పండంటి మగ బిడ్డ జన్మించా డు. తర్వాత 108 అంబులెన్స్‌ను రప్పించి తల్లిని, బిడ్డను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించా రు. ప్రస్తుతం ఆస్పత్రిలో తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారు. ఇన్స్పెక్టర్ సాహసాన్ని కొనియాడుతూ స్థానికులు ఆమెను అభినందనల్లో ముంచెత్తుతున్నారు. కాళ్లు, చేతులు వణికాయి.. భానుమతికి ప్రసవం చేసిన మహిళా ఇన్స్పెక్టర్ చిత్ర మాట్లాడుతూ.. ‘‘చూలైమేడు హైరోడ్డులో గస్తీ చేపట్టిన సమయంలో వేకువజామున 3 గంటకు రోడ్డుపై పురిటి నొప్పులతో మహిళ అల్లాడుతుండడాన్ని చూసి దిగ్భ్రాంతి చెందాను వెంటనే వాహనాన్ని నిలిపి దగ్గరకు వెళ్లి ఆ మహిళను ఆస్పత్రికి తరలించడానికి ప్రయత్నించాను. అయితే అప్పటికే రక్తస్రావం అధికంగా ఉండడం వలన జీపు ఎక్కించే సమయంలోనే బిడ్డ బయటకు వచ్చే ప్రమాదం ఉండడంతో హుటాహుటిన ఆ మహిళపై ఉన్న దుప్పట్టాను మరుగుగా కప్పుకుని ప్రసవం చేశాను. ఆ సమయంలో నా చేతులు కాళ్లు వణికాయి. అయిప్పటికీ ధైర్యం తెచ్చుకుని బిడ్డను బయటకు తీశాను. సమీపంలో ఉన్న పారిశుద్ధ్య కార్మిక మహిళలు సాయంతో ప్రసవం విజ యవంతమైంది. బొడ్డు తాడు కోయడానికి నా జీప్‌లో ఉన్న చిన్న కత్తిని ఉపయోగించాను. ఇలా రెండు నిండు ప్రాణాలను కాపాడగలిగాను. కాగా ఇన్స్పెక్టర్ చిత్ర సొంత ఊరు వేలూరు సమీపంలోని కావేరిపాక్కం. ఆమె భర్త బీఎస్ఎన్ఎల్ సంస్థలో అధి కారిగా విధులు నిర్వహిస్తున్నారు. వీరికి అరవింద్, సింధుజా అనే పిల్లలు ఉన్నారు. ఇన్స్పెక్టర్గా విధులు చేపట్టి రెండున్నర సంవత్సరాలు అవుతుండడం గమనార్హం. -
మానవత్వం చాటిన మహిళ ఏఎస్ఐ
రాయచూరు రూరల్: దేహంపై నూలిపోగు కూడా లేకుండా సంచరిస్తున్న మానసిక దివ్యాంగురాలిని ఓ మహిళా ఏఎస్ఐ అక్కున చేర్చుకొని దుస్తులు ధరింపచేసి మానవత్వాన్ని చాటుకున్నారు. కలబుర్గి పట్టణ ప్రాంతంలో ఓ మానసిక దివ్యాంగురాలు దేహంపై ఎలాంటి అచ్ఛాదనం లేకుండా తిరుగుతుండగా కలబుర్గి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న మహిళ ఏఎస్ఐ యశోద గమనించారు. తన వాహనంలో ఉన్న దుస్తులు తెప్పించి ధరింపచేశారు. చిన్నతనం నుంచే సేవాభావం : యశోద చిన్నతనం నుంచి పేదరికంలో పెరిగి కష్టసుఖాలను అనుభవించారు. పేదలు ఎక్కడ కనిపించినా తోచిన సహాయం చేస్తుంటారు. ఆమె కలబుర్గిలో రాజాపుర కాలనీలో తల్లితో నివాసం ఉంటున్నారు. స్వంత ఖర్చుతో 33 మంది పేద విద్యార్థులను పాఠశాలల్లో చేర్పించారు. బాల కార్మికులకు విద్యాదానం చేశారు. పేద కుటుం బంలో మరణించిన వారికి రూ.3 వేలు, వివాహానికి రూ.3 వేలు చొప్పున ఆర్థిక సహాయం చేస్తుంటారు. భవిష్యత్తులో రెండు ఎకరాల భూమిని కొనుగోలు చేసి పేదలను ఆదుకోవాలని ఉందని యశోద పేర్కొన్నారు. -
దుమ్ము రేపుతున్న మహిళా ఎస్ఐ వీడియో
తమిళనాడు, టీ.నగర్: విధి నిర్వహణలో మహిళా ఎస్ఐ చేసిన టిక్‌టాక్ వీడియో రాష్ట్రవ్యాప్తంగా రెండు రోజులుగా వైరల్ అవుతోంది. సోషల్ మీడియా ట్రెండింగ్‌లో ప్రథమస్థానంలో చేరింది. యువతను విపరీతంగా ఆకర్షిస్తున్న ఈ యాప్‌కు పోలీసు అధికారులు సైతం అతీతం కాదు. కొద్ది రోజుల క్రితం చెన్నై సెంట్ థామస్‌మౌంట్ సాయుధ దళం డిప్యూటీ కమిషనర్ ఒకరు టిక్‌టాక్‌లో పాటపాడి అదరగొట్టారు. తాజాగా విధి నిర్వహణలో ఉన్న ఓ ఎస్ఐ ఒకరు, మహిళా ఎస్ఐతో కాదల్ పరిసు చిత్రంలోని కాదల్ మగరాణి అనే పాటను పాడుతూ చేసిన టిక్‌టాక్ వీడియో సంచలనంగా మారింది. ప్రస్తుతం ఈ టిక్‌టాక్ వీడియో ట్రెండింగ్‌లో మొదటి స్థానంలో ఉంది. ఇటీవల డీజీపీ టీకే రాజేంద్రన్ పోలీసుల సెల్‌ఫోన్ వినియోగంపై ఆంక్షలు విధించారు. ఎస్ఐ కింది హోదా పోలీసులు విధి నిర్వహణలో సెల్ఫోన్లు ఉపయోగించరాదని ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. -
అవినీతి కేసులో మహిళా ఎస్ఐ అరెస్టు
న్యూఢిల్లీ : మహిళలపై నేర నిరోధక విభాగానికి చెందిన మహిళా ఎస్ఐని అవినీతికి పాల్పడిందనే ఆరోపణపై శుక్రవారం అరెస్టు చేసినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. లైంగిక దాడికి సంబంధించిన కేసులో ప్రధాన నిందితులకు సహకరిస్తానని హామీ ఇచ్చి లంచం తీసుకొన్నట్లు సీబీఐ ఆరోపించింది. వివరాలిలా ఉన్నాయి.. డీసీపీ(తూర్పు) కార్యాలయంలో పనిచేస్తున్న ఎస్ఐ సరళ ఓ కేసులో నిందితులకు సహకరిస్తానని రూ. 10,000 లంచాన్ని ఓ మహిళ నుంచి తీసుకొంటూ సీబీఐకి దొరికిపోయింది. లంచమిచ్చిన మహిళను కూడా నిందితురాలిగా పేర్కొన్నట్లు సీబీఐ పౌరసంబంధాల అధికారి ఆర్ గౌర్ చెప్పారు.