
తిరువొత్తియూరు: తిరుచ్చి సమీపంలో ఓ మహిళా ఎస్‌ఐ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. వివరాల ప్రకారం.. తిరువెరంబూరు సమీపంలోని నావల్ పట్టిలో పోలీసు ట్రైనింగ్ కళాశాల ఉంది. ఇక్కడ మహిళలకు పోలీసు శిక్షణ ఇస్తున్నారు. ఈ ట్రైనింగ్ కళాశాలలో ఎస్‌ఐగా తిరుచ్చి డి.వి.ఎస్. టోల్‌గేట్ నగర్‌కు చెందిన ఆదిలక్ష్మి (56) పని చేస్తున్నారు. ఈమె కళాశాల ప్రాంగణంలోని పోలీసు క్వార్టర్స్‌లోనే నివాసం ఉంటున్నారు.
ఈ క్రమంలో శనివారం ఉదయం తన ఇంటిలో ఆదిలక్ష్మి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. నావల్‌పట్టి పోలీసులు ఆమె మృతదేహాన్ని శవపరీక్ష కోసం తిరుచ్చి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆదిలక్ష్మి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు? పని ఒత్తిడి కారణమా? అనే కోణంలో విచారణ చేపట్టారు. ఆదిలక్ష్మి భర్త నటరాజన్ (60) ఎస్‌ఐగా పని చేసి రిటైర్డ్ అయ్యారు. ఆదిలక్ష్మికి లెనిన్ (26), భరత్ (22) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు.
ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి.
ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001
మెయిల్: roshnihelp@gmail.com
Comments
Please login to add a commentAdd a comment