
మానసిక దివ్యాంగురాలికి దుస్తులు వేస్తున్న ఏఎస్‌ఐ (ఇన్‌సెట్) మహిళ ఏఎస్‌ఐ యశోద
రాయచూరు రూరల్: దేహంపై నూలిపోగు కూడా లేకుండా సంచరిస్తున్న మానసిక దివ్యాంగురాలిని ఓ మహిళా ఏఎస్‌ఐ అక్కున చేర్చుకొని దుస్తులు ధరింపచేసి మానవత్వాన్ని చాటుకున్నారు. కలబుర్గి పట్టణ ప్రాంతంలో ఓ మానసిక దివ్యాంగురాలు దేహంపై ఎలాంటి అచ్ఛాదనం లేకుండా తిరుగుతుండగా కలబుర్గి పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న మహిళ ఏఎస్‌ఐ యశోద గమనించారు. తన వాహనంలో ఉన్న దుస్తులు తెప్పించి ధరింపచేశారు.
చిన్నతనం నుంచే సేవాభావం : యశోద చిన్నతనం నుంచి పేదరికంలో పెరిగి కష్టసుఖాలను అనుభవించారు. పేదలు ఎక్కడ కనిపించినా తోచిన సహాయం చేస్తుంటారు. ఆమె కలబుర్గిలో రాజాపుర కాలనీలో తల్లితో నివాసం ఉంటున్నారు. స్వంత ఖర్చుతో 33 మంది పేద విద్యార్థులను పాఠశాలల్లో చేర్పించారు. బాల కార్మికులకు విద్యాదానం చేశారు. పేద కుటుం బంలో మరణించిన వారికి రూ.3 వేలు, వివాహానికి రూ.3 వేలు చొప్పున ఆర్థిక సహాయం చేస్తుంటారు. భవిష్యత్తులో రెండు ఎకరాల భూమిని కొనుగోలు చేసి పేదలను ఆదుకోవాలని ఉందని యశోద పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment