అవినీతి కేసులో మహిళా ఎస్‌ఐ అరెస్టు | Corruption case In the Women SI Arrest | Sakshi
Sakshi News home page

అవినీతి కేసులో మహిళా ఎస్‌ఐ అరెస్టు

Published Fri, Dec 5 2014 11:45 PM | Last Updated on Sat, Sep 22 2018 8:22 PM

Corruption case In the Women SI Arrest

న్యూఢిల్లీ : మహిళలపై నేర నిరోధక విభాగానికి చెందిన మహిళా ఎస్‌ఐని అవినీతికి పాల్పడిందనే ఆరోపణపై శుక్రవారం అరెస్టు చేసినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. లైంగిక దాడికి సంబంధించిన కేసులో ప్రధాన నిందితులకు సహకరిస్తానని హామీ ఇచ్చి లంచం తీసుకొన్నట్లు సీబీఐ ఆరోపించింది. వివరాలిలా ఉన్నాయి.. డీసీపీ(తూర్పు) కార్యాలయంలో పనిచేస్తున్న ఎస్‌ఐ సరళ ఓ కేసులో నిందితులకు సహకరిస్తానని రూ. 10,000 లంచాన్ని ఓ మహిళ నుంచి తీసుకొంటూ సీబీఐకి దొరికిపోయింది. లంచమిచ్చిన మహిళను కూడా నిందితురాలిగా  పేర్కొన్నట్లు సీబీఐ పౌరసంబంధాల అధికారి ఆర్ గౌర్ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement