సాక్షి, శ్రీకాకుళం: ముక్కూమొహం తెలియని ఓ మృతదేహాన్ని భుజాల మీద మోసి అందరికీ ఆదర్శంగా నిలిచిన మహిళా ఎస్సై శిరీషను డీజీపీ గౌతమ్ సవాంగ్ అభినందించారు. ఆపదలో నేనున్నానంటూ వారికి బాసటగా నిలబడిన ఆమెకు ప్రశంసా పత్రాన్ని అందజేయనున్నారు. హోం మంత్రి మేకతోటి సుచరిత సైతం సదరు పోలీసు అధికారిణిని మెచ్చుకున్నారు. శ్రీకాకుళంలో అడవికొత్తూరు గ్రామ పొలాల్లో గుర్తు తెలియని వృద్ధుడు మృతదేహం లభ్యమైంది. ఆ మృతదేహాన్ని మోసేందుకు స్థానికులు నిరాకరించారు. ఈ విషయం తెలుసుకున్న కాశీబుగ్గ మహిళా ఎస్సై శిరీష తానే రెండు కిలోమీటర్లు మోసుకుంటూ వెళ్లి లలితా చారిటబుల్ ట్రస్ట్‌తో కలిసి అంత్యక్రియలు జరిపించిన విషయం తెలిసిందే. (చదవండి: మృతదేహాన్ని భుజాలపై మోసుకెళ్లిన మహిళా ఎస్సై)
(చదవండి: డబ్బు.. మద్యం పంపిణీకి చెక్ పెట్టేలా..)
Women SI of @POLICESRIKAKULM Carries Homeless Man's Dead Body For 2 kilometres After Villagers Refused to Help in Srikakulam District. Appreciating the humanitarian gesture of Sub inspector Kotturu Sirisha of Kasibugga police station. 👏🏻 pic.twitter.com/53udc8bxoO
— Mekathoti Sucharitha (@SucharitaYSRCP) February 1, 2021
Comments
Please login to add a commentAdd a comment