
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ప్రచారానికి ‘టిక్ టాక్’ను వినియోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా టిక్ టాక్ ఇండియా–తెలంగాణ ఐటీశాఖ, డిజిటల్ మీడియా ఆధ్వర్యంలో సోమవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. హోటల్ హరి తప్లాజాలో జరిగిన ఈ అవగాహన కార్యక్రమంలో వివిధ ప్రభుత్వ విభాగాలకు చెందిన ప్రజా సంబంధాల అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టిక్ టాక్ ఇండియా పాలసీ డైరెక్టర్ నితిన్ సాలూజా, యువరాజ్, ఐటీ డిజిటల్ మీడియా డైరెక్టర్ కొణతం దిలీప్ ప్రకటించారు. సీఎం పీఆర్వో రమేశ్ హజారి, రాచకొండ కమిషనర్ పీఆర్వో దయాకర్, సైబరాబాద్ కమిషనర్ పీఆర్వో కిరణ్ కుమార్, డీజీపీ సీపీఆర్వో హర్ష భార్గవి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment