అన్నానగర్, న్యూస్‌లైన్:అమెరికా నావికా దళానికి చెందిన యూఎస్‌ఎస్ మాకాంప్ బెల్- డీడీజీ85 డిస్ట్రాయర్ అనే భారీ యుద్ధ నౌక చెన్నై పోర్టుకు వచ్చింది. ఈ సందర్భంగా అమెరికా కాన్సులేట్ జనరల్ జెన్నిఫర్ ఏ. మాక్కింటైరీ సోమవారం మాకాంప్ బెల్ నౌక వివరాలను విలేకరులకు తెలియజేశారు. భారత్-అమెరికాలు యుద్ధ తంత్రాల్లోని మెళకువలను, నైపుణ్యాలను ఇచ్చి పుచ్చు కునేందుకు ఈ తరహా నౌక సందర్శనలు ఎంతగానో ఉపయోగపడతాయని ఆమె అన్నారు. మాకాంప్ బెల్ కేవలం యుద్ధ విన్యాస నౌక మాత్రమే కాదని, విపత్కర పరిస్థితుల్లో ఈ నౌక అంతర్జాతీయంగా పలు దేశాల్లో తన స్నేహ హస్తాన్ని కూడా అందించిందన్నారు.
భారత్- అమెరికా అంతర్జాతీయ జలా ల్లో నవంబరు ఏడు నుంచి 11 వ తేదీ వరకూ ఈ నౌక భారత నావికా దళానికి చెందిన యుద్ధ నౌకలతో కలిసి పలు రకాల యుద్ధ కళా విన్యాసాలను ప్రదర్శిస్తుందన్నారు. ఈ విషయమై భారత్ విదేశాంగ శాఖ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ అమెరికా ప్రభుత్వ కార్యదర్శి జాన్‌కెర్రీ తో విసృ్తతమైన చ ర్చలు జరిపిన అనంతరం ఈ నౌక చెన్నైకి చేరిందన్నారు. యూఎస్ డెస్ట్రాయర్ స్క్వాడ్రన్ 15వ ఫ్లేట్‌కు చెందిన ఈ నౌక కెప్టెన్ పాల్ జె. లైయాన్స్ యుద్ధనౌకలోని విశేషాలను వివరించారు. మొత్తం 320 మంది సిబ్బంది కల్గిన ఈ నౌకలో 21 శాతం మంది మహిళలు యుద్ధ విద్యలో ఆరితేరారన్నారు. 510 అడుగుల పొడ వు, 9150 టన్నుల బరువు కల్గిన ఈ నౌక గంటలకు 33 నాటికల్ మైళ్ల వేగం తో ప్రయాణిస్తుందన్నారు.
అత్యవసరం అనుకుంటే ఈ నౌకలోని మినీ యుద్ధ విమానాన్ని ఉపయోగిస్తామన్నారు. రెండు హెలికాప్టర్లు కూడా ఇందులో ఉన్నాయన్నారు. కమాండర్ షరీఫ్ హెచ్.కాఫీ విలేకరులకు నౌకను చూపిం చారు. నౌకలోని నాలుగు నాణ్యమైన సాంకేతిక విభాగాలకు తీసుకొని వెళ్లి వాటి గురించి వివరించారు. నౌక నాలు గు జనరల్ ఎలక్ట్రిక్ ఎల్‌ఎం-2500 గ్యాస్ టర్బైన్లతో నడుస్తుందన్నారు. అత్యాధునికమైన ఆయుధ వ్యవస్థ ఈ నౌకలో ఉందన్నారు. రెండో ప్రపంచ యుద్ధంలో 34 సార్లు శత్రుయుద్ధ విమానాలను మట్టికరిపించిన అమెరికా నావి కాదళం ఏడోవ ఫ్లీట్-2ఏ విభాగానికి చెందిన కెప్టెన్ డేవిడ్ మాకాంప్ బెల్ జ్ఞాపకార్థం ఈ నౌకను ఆయన పేరు పె ట్టినట్లు తెలిపారు. పలు దేశాల్లో ఈ నౌక వందలాది యుద్ధ విన్యాసాలను నిర్వహించిందన్నారు. పోర్టుకాల్ కార్యక్ర మం ద్వారా తాము చెన్నైకు వచ్చామన్నారు. ఏడో తేదీ బయలుదేరి మల బారు తీర ప్రాంతానికి చేరతామన్నారు.
చెన్నైలో అమెరికా యుద్ధ విన్యాస నౌక
Published Tue, Nov 5 2013 3:49 AM | Last Updated on Sat, Aug 25 2018 3:42 PM
Advertisement