
సాక్షి, అన్నానగర్: తిరుచ్చి కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన గ్రీవెన్స్ డేలో వినతి అందజేసేందుకు వృద్ధురాలు కత్తితో రావడం సంచలనం కలిగించింది. తిరుచ్చి కాట్టూరు బిలోమినాల్ నగర్‌కు చెందిన పదవీ విరమణ పొందిన నర్సు మేరి(68). ఈమె సోమవారం గ్రీవెన్స్‌డేలో పాల్గొనేందుకు కలెక్టరేట్ చేరుకుంది. భద్రతా అధికారులు ఆమె వద్ద ఉన్న సంచిలో తనిఖీ చేయగా అందులో కత్తి లభించింది. ఆత్మరక్షణ కోసం తాను కత్తిని వెంట తెచ్చుకున్నట్టు వృద్ధురాలు తెలిపింది.
పోలీసులు కత్తిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం మేరి కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించింది. అందులో.. తనకు చెందిన స్థలాన్ని ఆక్రమించుకునేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని, దీనిపై ఫిర్యాదు చేసినా పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని పేర్కొన్నారు. రాత్రి సమయంలో కొంతమంది వచ్చి ఇంటిని కూల్చేస్తామని, హత్యా బెదిరింపులు చేస్తున్నట్టు వివరించింది. దీనిపై విచారణ జరిపి బాధితురాలికి న్యాయం చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment