చెన్నై: పంజాబ్‌లోని చండీఘడ్ యూనివర్సిటీ ఘటన మరువక ముందే..ఇలాంటే ఘటనే మధురైలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం...రామ్‌నాథ్‌పురం కాముదికి చెందిన ఆషిక్, జనని ఇద్దరు స్నేహితులు. ఆశిక్ వైద్యుడిగా పనిచేస్తున్నాడు. అతని గర్లఫ్రెండ్ జననీ మధురైలో బీఈడీ స్టూడెంట్. ఆమె వర్కింగ్ విమన్ హాస్టల్‌లో ఉంటుంది. ఐతే ఆమె తన స్నేహితులకు తెలియకుండా వారు బట్టలు మార్చుకున్నప్పుడూ, స్నానం చేస్తున్నప్పుడూ సీక్రేట్‌గా ఫోటోలు తీసి తన ప్రియుడికి పంపిస్తుండేది.
మొదట్లో తన ప్రైవేటు ఫోటోలు పంపించేది, తదనంతరం తన ప్రియుడి ఒత్తిడి మేరకు తన హాస్టల్‌మేట్స్ అందరివి పంపించడం మొదలు పెట్టింది. అనుకోకుండా ఒకరోజు ఆమె స్నేహితులకు ఆమెపై అనుమానం తలెత్తి... ఆమె ఫోన్ చెక్‌చేయగా అసలు విషయం బయటపడింది. దీంతో వారంతా హాస్టల్ వార్డన్‌కి అసలు విషయం చెప్పి మధరైలోని అన్నానగర్ పోలీస్‌స్టేషన్ ఫిర్యాదు చేశారు. దీంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
పోలీసుల విచారణలో.. జననీ, ఆశిక్ అనే వ్యక్తి గర్లఫ్రెండ్ అని, ఆమె తన ప్రియుడి క్లినిక్‌లోనే పనిచేస్తున్నట్లు తేలింది. అంతేగాదు ఆమె తన ప్రైవేట్ వీడియోల తోపాటు తన హాస్టల్‌మేట్స్ అందరీ వీడియోలు పంపినట్లు వెల్లడైంది. ఐతే సదరు వైద్యుడు ఆశిక్ ఈ ఫోటోలను ఎవరికైనా పంపించాడా అనేది తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. ఈ మేరకు సదరు నిందితులిద్దరి అదుపులోకి తీసుకుని అరెస్టు చేయడమే కాకుండా వారి ఫోనులను కూడా సీజ్ చేసినట్లు తెలిపారు డేటా రికవరీ కోసం ఆ ఫోన్‌లను ఫోరెన్సిక్ ల్యాబ్‌కి పంపించినట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఈ నిందితులిద్దరు మదురై సెంట్రల్ జైల్లోనే ఉన్నట్లు పేర్కొన్నారు.
(చదవండి: ఫ్రెండే కదా అని నమ్మారు.. హాస్టల్ యువతుల ప్రైవేటు వీడియోలు తీసి..!)
Comments
Please login to add a commentAdd a comment