స్వాధీనం చేసుకున్న బంగారు బిస్కెట్లు
అన్నానగర్ (చెన్నై): షార్జా, మలేసియా నుంచి ఆదివారం చెన్నై విమానాశ్రయానికి పిల్లలు ఆడుకునే పరికరాల్లో దాచి అక్రమంగా తెచ్చిన రూ.3.30 కోట్ల విలువ గల 10 కిలోల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిని అరెస్టు చేశారు. చెన్నై మీనమ్‌బాక్కం ఎయిర్‌పోర్టుకు మలేసియా నుంచి ఆదివారం సాయంత్రం వచ్చిన కమర్‌అలీ (38) లగేజ్‌ను తనిఖీ చేయగా పిల్లలు ఆడుకునే 47 పరికరాల్లో బంగారు బిస్కెట్లు బయటపడ్డాయి. సుమారు రూ.కోటి 5 లక్షల విలువ గల 3 కిలోల 200 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
షార్జా నుంచి చెన్నైకి వచ్చిన విమానంలో రియాస్‌ఖాన్ (32), ఇఫ్రకీమ్‌షా (52) లగేజ్‌లను పరిశీలించగా.. పిల్లలు ఆడుకునే పరికరాల్లో దాచిన బంగారు బిస్కెట్లు దొరి కాయి. రూ.2.25 కోట్ల విలువున్న 6 కిలోల 600 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment