పోలీసుల ముందే ఆ యువతి అలా చేసింది..
అన్నానగర్: ఈ ప్రపంచంలో ఎప్పటికి విడిపోనిది స్నేహం ఒక్కటే.. ఏ కష్టం వచ్చిన మొదట స్నేహితులతోనే పంచుకుంటాం. అలాంటిది కడలూరు సమీపంలో స్నేహితురాలికి విషం ఇచ్చి యువతి హత్య చేసింది. ఈ కేసు విచారణలో భాగంగా ఆ యువతి చెప్పిన ప్రాంతానికి తీసుకెళ్లారు. కానీ ఎవరు ఊహించని సంఘటన అక్కడ చోటుచేసుకుంది. ఆ యువతి పోలీసుల కళ్ల ముందే 200 అడుగుల లోతు బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. కడలూరు జిల్లా పులియూర్ కాట్టుసాగై గ్రామానికి చెందిన యువతి దివ్య(19) సాత్తమామ్ పట్టు గ్రామంలో తన పిన్నిజగదీశ్వరి దగ్గర ఉంటూ డిప్లొమా నర్సింగ్ చదువుతోంది.
దివ్య, కీళ్ కాంగేయన్ కుప్పమ్ గ్రామానికి చెందిన జయచిత్ర(19) ఇద్దరు స్నేహితులు.గత నెల మే 8వ తేది నుంచి దివ్య కనపడలేదు. పోలీసుల విచారణలో స్నేహితురాలు జయచిత్ర దివ్యని హత్య చేసి, కామాక్షి పేట సెడిలమ్ నది తీరంలో పాతిపెట్టినట్లు తెలిసింది. ఆణత్తూర్ కు చెందిన విజయరాజ్ ని దివ్యకి జయచిత్ర పరిచయం చేసింది. ఇద్దరు సన్నిహితంగా కలిసి మెలసి ఉండేవారు. దీంతో ఆవేశం చెందిన జయ తన స్నేహితుడిడైన మోహన్ తో కలిసి మే 8వ తేదిన దివ్యకు విషం ఇచ్చి, దుప్పటితో గొంతు నులిమి హత్య చేసినామని విచారణలో ఒప్పుకుంది.
తరువాత పాతి పెట్టిన స్థలాన్ని తహశీల్దార్, డీఎస్పీ, దివ్య బంధువులు ఎదుట జయ గుర్తు చూపెట్టింది. మృతదేహాన్ని అక్కడే పోస్టుమార్టం చేశారు. అక్కడ లభించిన ఆధారాలతో దివ్య అని గుర్తుపట్టారు. తన సెల్‌ఫోన్ మొదలైన వస్తువులు, కీళ్‌కాంగేయన్ కుప్పంలో ఉన్న బావి సమీపంలో దాచిపెట్టానని పోలీసులతో చెప్పింది. శుక్రవారం ఉదయం ఆమె చెప్పిన ప్రాంతానికి పోలీసులు తీసుకెళ్లారు. అక్కడికి వెళ్ళగానే ఎవరు ఊహించని విధంగా జయ హఠాత్తుగా జయ దగ్గరలో ఉన్న 200 అడుగుల లోతు గల బావిలో దూకింది. ఏడీఎస్‌పీ, వేదరత్తిణమ్, డీఎస్‌పీలు సుందర వడివేల్, ఈశ్వరన్, కుమార్ సంఘటన స్థలానికి వచ్చారు. అగ్నిమాపక సిబ్బంది, స్థానికుల సహాయంతో ఆరు గంటల సేపు కష్టపడి జయచిత్ర మృతదేహాన్ని బయటకు తీశారు. ఈ ఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది.