బావి వద్ద గుమిగూడిన ప్రజలు (ఇన్‌సెట్) శిరీష మృతదేహం
కూసుమంచి: తనను మానసికంగా కొందరు వేధిస్తున్నారని ఓ యువతి వ్యసాయ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సోమవారం మండలంలోని సీతిలితండాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. సీతిలితండాకు చెందిన గుగులోత్ శ్రీను, బాలా అన్నదమ్ముల మధ్య కొంత కాలంగా ఆస్తి తగాదాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో శ్రీను కూతురు శిరీష (సిరి)ని బాలాతో పాటు అతని కుటుం బ సభ్యుల మధ్య ఉన్న కక్షలను మనసులో పెట్టుకుని మానసికంగా వేధిస్తున్నారు. ఇబ్బందులు పడుతున్న సిరి తన తల్లిదండ్రులకు విషయాన్ని చెబుతుండటంతో ఇరు కుటుంబాల మధ్య గొడవులు జరుగుతున్నాయి.
ఈ క్రమంలో సోమవారం ఉదయం కూడా గొడవలు జరగటంతో సిరి గ్రామం సమీపంలో ఉన్న వ్యసాయ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. సమీపంలోని వారు గమనించి తల్లి దండ్రులకు సమాచారం ఇవ్వగా బావిలో ఉన్న సిరిని బయటకు తీసేలోగానే ప్రాణాలు విడిచింది. తన కూతురుని వేధింపులకు గురిచేయటం వలనే ఆత్మహత్యకు పాల్పడిందంటూ తండ్రి శ్రీను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గుగులోత్ బాలా, అతని కుటుంబ సభ్యులైన బాబు, నాగమణి, అనిల్, సక్మా, సీతిలి, సక్రిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ రఘు తెలిపారు. కాగా తనపై వేధింపులకు పాల్పడుతున్న వారిపై మృతురాలు శిరీష ఆదివారమే పోలీసులకు ఫిర్యాదు చేయటం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment