మహిళ అనుమానాస్పద మృతి
Published Sun, Aug 28 2016 12:21 AM | Last Updated on Mon, Sep 4 2017 11:10 AM
దేవరపల్లి : దేవరపల్లి మండలం యాదవోలులో ఓ మహిళ అనుమానాస్పదస్థితిలో మరణించారు. ఎస్‌ఐ సి.హెచ్.ఆంజనేయులు కథనం ప్రకారం.. ద్వారకా తిరుమల మండలం గొడుగుపేటకు చెందిన వెంకటలక్ష్మి(25) యాదవోలుకు చెందిన గుంపుల శ్రీనును ఎనిమిదేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. వీరికి ఆరేళ్ల కుమార్తె ఉంది. ఈ నేపథ్యంలో వెంకటలక్ష్మి శనివారం ఇంటిలో కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీనిపై భిన్నవాదనలు వినబడుతున్నాయి. దీంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ఆంజనేయులు వెల్లడించారు.
Advertisement
Advertisement