న్యాయం కోసం నిరాహార దీక్ష
- {పేమించి పెళ్లి చేసుకున్నాడు
- తల్లిదండ్రుల ఒత్తిడితో ముఖం చాటే శాడు
- పరారీలో అత్తింటివారు
- భర్త కోసం వివాహిత పోరాటం
మదనపల్లెక్రైం, న్యూస్‌లైన్: వారిద్దరూ నాలుగేళ్లు ప్రేమించుకున్నారు. ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు చేస్తున్నారు. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. అతను భార్యను పుట్టింటి దగ్గర వదిలి వెళ్లాడు. ఆ తర్వాత భర్త తనను తీసుకెళ్లేందుకు ఇంటికి రాకపోవడం, ఫోను పనిచేయకపోవడంతో ఆమె అత్తారింటికి వచ్చారు. ఇంటికి తాళం వేసి ఉండడంతో ఇరుగుపొరుగు వారిని విచారించారు.
తన భర్త వేరే వివాహం చేసుకుంటున్నాడని తెలి సి పోలీసులను ఆశ్రయించారు. భర్త కోసం మదనపల్లెలోని అత్తారింటి ముం దు రెండు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారు. చావనైనా చస్తాను కాని ఇక్కడ నుంచి కదిలే ప్రసక్తి లేదని బాధితురాలు స్పష్టం చేస్తున్నారు. ఆమె కథ నం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.
పుత్తూరు హరిజనవాడకు చెందిన దొరస్వామి, సావిత్రమ్మ దంపతుల కుమార్తె వెంకటలక్ష్మి(25) 2009లో ఎం బీఏ పూర్తి చేశారు. బెంగళూరులో స్నేహితుల వద్ద ఉంటూ ఉద్యోగ ప్రయత్నాల్లో ఉండగా అదే సమయంలో మదనపల్లె అయోధ్యనగర్‌లో నివాసముంటున్న గుర్రప్ప, లలితమ్మ దంపతుల కుమారు డు సతీష్(30) ఎంసీఏ పూర్తి చేసుకుని బెంగళూరులో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు.
2010లో వెంకటలక్ష్మి, సతీ ష్ పరిచయమయ్యారు. వారు అప్పటి నుంచే ప్రేమలో పడ్డారు. తర్వాత ఇద్దరికి ఉద్యోగాలు వచ్చాయి. వెంకటలక్ష్మి బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వెళ్లారు. సతీష్ వీకెండ్‌లో హైదరాబాద్‌కు వెళ్లి వెంకటలక్ష్మితో కలసి వచ్చేవాడు. తర్వాత ఆమె తిరుపతిలో ఉద్యోగంలో చేరారు. ఇదిలా ఉండగా పెద్దల అంగీకారంతోనే పెళ్లి జరగాలని భావిం చి రెండిళ్లలో ప్రేమ విషయాన్ని చెప్పారు. ఇద్దరూ బాగా చదువుకున్నవారు కావడం, ఉద్యోగాలు చేస్తుండడంతో ఇరువైపులా పెద్దలు పెళ్లికి అంగీకరించా రు.
ఈ ఏడాది మార్చి 17వ తేదీన పుత్తూరులోని సాయిబాబా ఆలయంలో పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. వెంకటలక్ష్మి దళితవర్గానికి చెందిన వారని సతీష్ తల్లిదండ్రులకు తెలిసింది. అమ్మాయిని ఎటువంటి పరిస్థితిలో కాపురానికి తీసుకురాకూడదని, వదిలి వచ్చేయాలని సతీష్‌పై తల్లిదండ్రులు ఒత్తిడి తెచ్చారు. దీంతో అతను వెంకట లక్ష్మిని పుట్టింటిలోనే వదిలి ఉద్యోగానికి వెళ్లిపోయాడు. త్వరలో వచ్చి తీసుకెళతానని మాయమాటలు చెప్పి నమ్మిం చా డు.
పదిరోజుల నుంచి ఫోన్ కూడా పనిచేయక పోవడంతో వెంకటలక్ష్మి గురువారం మదనపల్లెలోని భర్త ఇంటి కి చేరుకున్నారు. భర్త, అత్తమామలు ఎవరూ లేరు. ఇంటికి తాళాలు వేసి ఉండడంతో షాక్‌కు గురయ్యారు. ఇరుగుపొరుగు వారిని విచారిస్తే చాలా రోజులుగా ఇక్కడ లేరని, సతీష్‌కు రెండో పెళ్లి ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుసుకున్నారు. వెంటనే రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారిస్తామని చెప్పి పంపా రు.
అయితే ఆమె నేరుగా భర్త ఇంటికి వెళ్లి నిరాహారదీక్షకు పూనుకున్నారు. భర్త వచ్చేవరకు ఇక్కడే ఉంటానని, చావనైనా చస్తాను కాని ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తేలేదని ప్రతినబూనారు. ఈ విషయమై ఎస్‌ఐ హనుమంతప్పను వివరణ కోరగా వెంకటలక్ష్మి ఫిర్యాదు చేసిన మాట వాస్తవమేనన్నారు. అయి తే ఆమె నిరాహారదీక్షకు పూనుకున్న విషయం తెలియదన్నారు. విషయాన్ని ఐసీడీఎస్ అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఆమెకు తగిన భద్రత ఏర్పాటు చేసి మోసం చేసిన భర్త సతీష్, వారి తల్లిదండ్రుల ఆచూకీ కోసం గాలించి సమస్య ను పరిష్కరిస్తామన్నారు.