బెంగళూరులోని భారత ప్రభుత్వ అంతరిక్ష విభాగానికి చెందిన ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్(ఇస్రో) ప్రధాన కార్యాలయం.. వివిధ విభాగాల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
► మొత్తం అప్రెంటిస్ ఖాళీల సంఖ్య: 43
► ఖాళీల వివరాలు: గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లు–13, డిప్లొమా(టెక్నీషియన్) అప్రెంటిస్‌లు–10, డిప్లొమా ఇన్ కమర్షియల్ ప్రాక్టీసెస్–20.
► గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లు: విభాగాలు: సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, ఫైర్ టెక్నాలజీ అండ్ సేఫ్టీ. అర్హత: 60శాతం మార్కులకు తగ్గకుండా.. సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. స్టయిపెండ్: నెలకు రూ.9000 చెల్లిస్తారు.
► డిప్లొమా(టెక్నీషియన్) అప్రెంటిస్: విభాగాలు: మెకానికల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్. అర్హత: 60శాతం మార్కులకు తగ్గకుండా సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. స్టయిపెండ్ నెలకు రూ.8000 చెల్లిస్తారు.
► డిప్లొమా ఇన్ కమర్షియల్ ప్రాక్టీసెస్: అర్హత: 60శాతం మార్కులకు తగ్గకుండా కమర్షియల్ ప్రాక్టీసెస్‌లో డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. స్టయిపెండ్ నెలకు రూ.8000 చెల్లిస్తారు.
► 2018, 2019, 2020, 2021లో ఇంజనీరింగ్ డిగ్రీ, డిప్లొమా పూర్తిచేసుకున్న అభ్యర్థులు మాత్రమే దరఖాస్తుకు అర్హులు.
► ఎంపిక విధానం: ఇంజనీరింగ్ డిగ్రీ, డిప్లొమాలో సాధించిన అకడమిక్ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు ఈమెయిల్ ద్వారా ఆఫర్ లెటర్ పంపిస్తారు.
► దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా
► ఈమెయిల్: hqapprentice@isro.gov.in
► వెబ్‌సైట్: www.mhrdnats.gov.in
డీఆర్‌డీఓ, సీవీఆర్‌డీఈలో 57 అప్రెంటిస్‌లు
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన చెన్నైలోని అవడిలో ఉన్న డీఆర్‌డీఓ –కంబాట్ వెహికల్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్(సీవీఆర్‌డీఈ).. వివిధ విభాగాల్లో గ్రాడ్యుయేట్, టెక్నీషియన్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
► మొత్తం ఖాళీల సంఖ్య: 57
► ఖాళీల వివరాలు: గ్రాడ్యుయేట్ అప్రెంటిస్–31, టెక్నీషియన్(డిప్లొమా) అప్రెంటిస్–26.
► గ్రాడ్యుయేట్ అప్రెంటిస్: విభాగాలు: కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, మెకానికల్, లైబ్రరీ సైన్స్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్. అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్ ఉత్తీర్ణులవ్వాలి. స్టైపెండ్: నెలకు రూ.9000 చెల్లిస్తారు.
► టెక్నీషియన్(డిప్లొమా)అప్రెంటిస్: విభాగాలు: కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్‌అండ్ కమ్యూనికేషన్, ఇన్‌స్ట్రుమెంటేషనల్, మెకానికల్ ఇంజనీరింగ్.
► అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. స్టైపెండ్: నెలకు రూ.8000 చెల్లిస్తారు.
► ఎంపిక విధానం: అకడమిక్ మార్కుల ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తారు. షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థుల్ని సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కు పిలుస్తారు. షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థుల రిజిస్టర్డ్ ఈమెయిల్‌కి సందేశాలు పంపుతారు.
► దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
► నాట్స్ పోర్టల్ ద్వారా దరఖాస్తులకు చివరి తేది: 20.07.2021 » సీవీఆర్‌డీఈ ద్వారా దరఖాస్తులకు చివరి తేది: 28.07.2021
► వెబ్‌సైట్: www.mhrdnats.gov.in
Comments
Please login to add a commentAdd a comment