కోల్‌కతా, బెంగళూరులలో ప్రభుత్వ ఉద్యోగాలు | ISI Kolkata, ITI Limited Bangalore Recruitment 2021: Vacancies Full Details | Sakshi
Sakshi News home page

కోల్‌కతా, బెంగళూరులలో ప్రభుత్వ ఉద్యోగాలు

Published Fri, Jul 16 2021 2:01 PM | Last Updated on Fri, Jul 16 2021 2:05 PM

ISI Kolkata, ITI Limited Bangalore Recruitment 2021: Vacancies Full Details - Sakshi

భారత ప్రభుత్వ స్టాటిస్టిక్స్, ప్రోగ్రామ్‌ ఇంప్లిమెంటేషన్‌ మంత్రిత్వశాఖకు చెందిన కోల్‌కతాలోని ఇండియన్‌ స్టాటిస్టికల్‌ ఇన్‌స్టిట్యూట్‌(ఐఎస్‌ఐ).. ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

► మొత్తం పోస్టుల సంఖ్య: 45
► పోస్టుల వివరాలు: ఇంజనీర్‌(ఎలక్ట్రికల్‌)–02, ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌(సివిల్‌)–03, ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌(ఎలక్ట్రికల్‌)–03, ఎలక్ట్రీషియన్‌–14, ఆపరేటర్‌ కమ్‌ మెకానిక్‌(లిఫ్ట్‌)–08, డ్రైవర్‌–01, కుక్‌–01, అసిస్టెంట్‌(లైబ్రరీ)–06, అసిస్టెంట్‌(ల్యాబొరేటరీ)–04, అసిస్టెంట్‌(రెప్రో–ఫోటో)–02, అసిస్టెంట్‌(ఫార్మ్‌)–01.

► అర్హత: పోస్టుల్ని అనుసరించి పదోతరగతి, ఇంటర్మీడియట్, ఐటీఐ సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా, బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత సర్టిఫికేట్లతోపాటు అనుభవం, డ్రైవర్‌ పోస్టులకు లైట్,హెవీ మోటార్‌ వెహికల్‌ లైసెన్స్‌ ఉండాలి.

► వయసు: 35ఏళ్లకు మించకూడదు. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు గరిష్ట వయసులో సడలింపు ఉంటుంది.

► ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు. 

► దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

► ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 23.07.2021

► వెబ్‌సైట్‌: https://www.isical.ac.in


ఐటీఐ లిమిటెడ్‌లో 40 హాస్పిటల్‌ స్టాఫ్‌ పోస్టులు

బెంగళూరులోని భారత ప్రభుత్వ రంగానికి చెందిన ఐటీఐ లిమిటెడ్‌కు చెందిన ఆసుపత్రుల్లో నిర్ణీత కాల వ్యవధి ప్రాతిపదికన హాస్పిటల్‌ స్టాఫ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

► మొత్తం పోస్టుల సంఖ్య: 40

► పోస్టుల వివరాలు: స్టాఫ్‌ నర్సు, ఆపరేషన్‌ థియేటర్‌ అసిస్టెంట్, ఎక్స్‌రే టెక్నీషియన్, ఈసీజీ టెక్నీషియన్, ల్యాబ్‌ టెక్నీషియన్, జూనియర్‌ ఫార్మసిస్ట్, రిసెప్షనిస్ట్, హెల్పర్‌.

► అర్హత: పోస్టుల్ని అనుసరించి ఏడో తరగతి, పదో తరగతి, సంబంధిత స్పెషలైజేషన్లలో డిప్లొమా, బీఫార్మసీ ఉత్తీర్ణులవ్వాలి. అనుభవం ఉండాలి.

► వయసు: పోస్టుల్ని అనుసరించి 28ఏళ్లు, 30ఏళ్లు మించకుండా ఉండాలి.

► వేతనం: పోస్టుల్ని అనుసరించి నెల కు రూ. 24754 నుంచి రూ.27,757 వరకు చెల్లిస్తారు.

► ఎంపిక విధానం: అప్టిట్యూడ్‌/టెక్నికల్‌ టెస్ట్‌/గ్రూప్‌ టాస్క్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

► దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ఏజీఎం–హెచ్‌ఆర్, ఐటీఐ లిమిటెడ్, బెంగళూరు ప్లాంట్, దూరవాణి నగర్, బెంగళూరు 560016 చిరునామాకు పంపించాలి.

► ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 22.07.2021

► దరఖాస్తు హార్డ్‌కాపీలను పంపడానికి చివరి తేది: 24.07.2021

► వెబ్‌సైట్‌: https://www.itiltd.in 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement