కోల్‌కతాలోని ఈస్టర్న్ రైల్వేకు చెందిన రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్(ఆర్‌ఆర్‌సీ).. వివిధ డివిజన్లు, వర్క్‌షాపుల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
► మొత్తం ఖాళీల సంఖ్య: 3366
► ట్రేడులు: ఫిట్టర్, వెల్డర్, పెయింటర్, లైన్‌మెన్, వైర్‌మెన్, ఎలక్ట్రీషియన్, మెషినిస్ట్, మెకానిక్(డీజిల్) తదితరాలు.
► అర్హత: ట్రేడులను అనుసరించి ఎనిమిదో తరగతి, కనీసం 50 శాతం మార్కులతో పదో తరగతి/తత్సమాన ఉత్తీర్ణతతోపాటు సంబంధిత ట్రేడుల్లో ఎన్‌సీవీటీ జారీచేసిన నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ ఉండాలి.
► వయసు: 15–24ఏళ్ల మధ్య ఉండాలి.
► ఎంపిక విధానం: పదో తరగతి, ఐటీఐలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.
► దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
► ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 03.11.2021
► వెబ్‌సైట్: https://er.indianrailways.gov.in
ఎన్‌పీసీఐఎల్‌లో 75 ట్రేడ్ అప్రెంటిస్‌లు
న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఎన్‌పీసీఐఎల్), కైగా సైట్(కర్ణాటక).. వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. (మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
► మొత్తం ఖాళీల సంఖ్య: 75
► ట్రేడులు: ఫిట్టర్, టర్నర్, మెషినిస్ట్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, ఎలక్ట్రానిక్ మెకానిక్, డ్రాఫ్ట్స్‌మెన్, సర్వేయర్.
► శిక్షణా వ్యవధి: ఏడాది.
► అర్హత: సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి.
► దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
► ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 15.10.2021
► వెబ్‌సైట్: www.npcil.nic.in
ఇస్రో, ఐఐఆర్‌ఎస్‌లో 12 అప్రెంటిస్‌లు
డెహ్రాడూన్‌లోని ఇస్రో–ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్(ఐఐఆర్‌ఎస్).. వివిధ విభాగాల్లో డిప్లొమా, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
► మొత్తం ఖాళీల సంఖ్య: 12
► ఖాళీల వివరాలు: డిప్లొమా అప్రెంటిస్–10, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్–02.
► డిప్లొమా అప్రెంటిస్: విభాగాలు: సివిల్ ఇంజనీరింగ్, అగ్రికల్చరల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, కంప్యూటర్ ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్, లైబ్రరీ సైన్సెస్ తదితరాలు. అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో మూడేళ్ల ఇంజనీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 30ఏళ్లు మించకుండా ఉండాలి. స్టయిపెండ్ నెలకు రూ.8000 చెల్లిస్తారు.
► గ్రాడ్యుయేట్ అప్రెంటిస్: విభాగాలు: జియోఇన్ఫర్మేటిక్స్, లైబ్రరీ సైన్స్. అర్హత: ఇంజనీరింగ్ డిగ్రీ/బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 30ఏళ్లు మించకుండా ఉండాలి. స్టయిపెండ్: నెలకు రూ.9000 చెల్లిస్తారు.
► ఎంపిక విధానం: డిప్లొమా, ఇంజనీరింగ్ డిగ్రీలో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.
► దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
► ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 09.10.2021
► వెబ్‌సైట్: www.iirs.gov.in
Comments
Please login to add a commentAdd a comment