అప్పుల బాధతో రియల్టర్ ఆత్మహత్య
► రూ.కోటికిపైగా అప్పులున్నట్లు సూసైడ్ నోట్
► భార్యాపిల్లల్ని వేధించవద్దని నోట్‌లో కోరిన మృతుడు
మదనపల్లె క్రైం : అప్పుల బాధ తాళలేక బెంగళూరుకు చెందిన ఓ రియల్టర్ మదనపల్లెలో పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఆలస్యంగా శుక్రవారం వెలుగులోకి వచ్చిం ది. తనకు రూ.కోటికి పైగా అప్పులు ఉన్నట్లు మృతుడు సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు. తాను చనిపోయిన తరువాత సహచర భాగస్వాములు తన భార్యా పిల్లల్ని డబ్బుల కోసం వేధించవద్దని అందులో కోరాడు.
మదనపల్లె టూ టౌన్ ఎస్‌ఐ గంగిరెడ్డి కథనం మేరకు.. వైఎస్‌ఆర్ కడప జిల్లా లక్కిరెడ్డిపల్లె మండలం గంగమ్మ జాతర ఈడిగపల్లెకు చెందిన తుమ్మల నాగప్ప కుమారుడు వెంకటరమణ(55) గత 30 ఏళ్ల క్రితం బెంగళూరు నగరానికి చేరుకుని లగేరిలో స్థిర పడ్డాడు. అతనికి భార్య వెంకటలక్ష్మి, కుమారుడు నటరాజ ఉన్నారు. బెంగళూరులో పెద్ద పెద్ద కాం ట్రాక్టు పనులు చేసుకుంటూ రియల్టర్‌గా ఎదిగాడు. ఈ క్రమంలో ఐదేళ్ల క్రితం మదనపల్లె సమీపంలోని వలసపల్లె పంచాయతీ ముంబయి–చెన్నై జాతీయ రహదారికి ఆనుకుని మూడు ఎకరాల భూమిని కొనుగోలు చేశాడు.
‘రియల్’ వ్యాపారం దెబ్బతినడంతో..
ఇటీవల కొంత కలంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం దెబ్బతినడంతో అప్పులు పెరిగాయి. రూ.కోటికి పైగా అప్పులు ఉన్నాయి. అందులో రూ.10 వడ్టీతో సగం తీర్చాడు. ఇంకా రూ.కోటి ఉండడంతో భాగస్వాములు, నలుగురు వడ్డీ వ్యాపారులు తరచూ వేధింపులకు దిగడంతో మదనపల్లెలో ఉన్న మూడు ఎకరాల భూమిని అమ్మి అప్పులు తీర్చాలని నిర్ణయించుకున్నాడు.
భూమికి ధర రాక
గత నెల 29న మదనపల్లెలో ఉన్న బంధువుల ఇంటికి వచ్చాడు. వెంట తెచు్చకున్న భూముల పత్రాలను స్థాని క వ్యాపారులకు చూపించి విక్రయించాలని చెప్పాడు. ఇక్కడ కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం దెబ్బతినడంతో వెంకటరమణ ఆశించిన ధర రాలేదు. అప్పు లు ఇచ్చిన వారి వేధింపులు అ«ధిక మవడంతో తీవ్ర మనస్తాపానికి గురయా్య డు. వారం రోజుల క్రితం మదనపల్లె ఆర్టీసీ బస్టాండుకు ఆనుకుని ఉన్న ఓ లాడ్జిలో గది తీసుకున్నాడు.
గురువారం రాత్రి నీరుగట్టుపల్లె చౌడేశ్వరిదేవి ఆలయం దగ్గరున్న వ్యవసాయ పొలంలో మద్యంలో పురుగుల మందు కలుపుకుని తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉదయం బహిరూ్భమికి వెళ్లిన స్థానికు లు అక్కడ వెంకటరమణ చనిపోయి ఉండడాన్ని గమనించి టూటౌన్ పోలీ సులకు సమాచారం అందించారు. ఎస్‌ఐ గంగిరెడ్డి అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుని జేబులో ఉన్న సూసైడ్ నోట్, సెల్‌ఫోన్ ఆధారంగా బంధువులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.