Realtor suicide
-
నష్టాలు వచ్చాయని.. రియల్టర్ ఆత్మహత్య
సాక్షి, చేవెళ్ల: ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో ఓ రియల్టర్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. చేవెళ్ల మండలంలోని కందవాడ గ్రామానికి చెందిన వడ్ల అంజన్‌చారి (35) కొన్నేళ్లుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. భార్య, ఇద్దరు పిల్లలతో అతడు చేవెళ్లలోని టీచర్స్ కాలనీలో నివాసముంటున్నాడు. అయితే కరోనా కారణంగా వ్యాపారం పూర్తిగా దెబ్బతినటంతో అంజన్‌చారికి ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి. అతని వద్ద పెట్టుబడులు పెట్టిన వారంతా తిరిగి డబ్బులు అడుగుతుండటంతో కొన్నిరోజులుగా ఆందోళనలో ఉన్నాడు. ఆగస్టు 31న ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన అంజన్‌చారి తిరిగి రాలేదు. ఫోన్ కూడా పనిచేయకపోవడంతో అదే రోజు రాత్రి భార్య మమత దీనిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఐదు రోజుల తర్వాత శనివారం చేవెళ్ల మండల కేంద్రం నుంచి కందవాడ గ్రామానికి వెళ్లే దారి వైపున్న వెంచర్ వద్ద ఓ వ్యక్తి పురుగుల మందు తాగి మృతి చెందినట్లుగా గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో అక్కడికి వెళ్లి పరిశీలించిన పోలీసులు.. అంజన్‌చారిదే ఆ మృతదేహమని గుర్తించారు. మృతదేహం కుళ్లి ఉండటంతో అంజన్‌చారి ఇంట్లో నుంచి వెళ్లిన రోజునే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని చేవెళ్ల ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
అప్పుడు తమ్ముడు ఇప్పుడు అన్న..
-
అప్పుల బాధతో రియల్టర్ ఆత్మహత్య
► రూ.కోటికిపైగా అప్పులున్నట్లు సూసైడ్ నోట్ ► భార్యాపిల్లల్ని వేధించవద్దని నోట్లో కోరిన మృతుడు మదనపల్లె క్రైం : అప్పుల బాధ తాళలేక బెంగళూరుకు చెందిన ఓ రియల్టర్ మదనపల్లెలో పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఆలస్యంగా శుక్రవారం వెలుగులోకి వచ్చిం ది. తనకు రూ.కోటికి పైగా అప్పులు ఉన్నట్లు మృతుడు సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు. తాను చనిపోయిన తరువాత సహచర భాగస్వాములు తన భార్యా పిల్లల్ని డబ్బుల కోసం వేధించవద్దని అందులో కోరాడు. మదనపల్లె టూ టౌన్ ఎస్ఐ గంగిరెడ్డి కథనం మేరకు.. వైఎస్ఆర్ కడప జిల్లా లక్కిరెడ్డిపల్లె మండలం గంగమ్మ జాతర ఈడిగపల్లెకు చెందిన తుమ్మల నాగప్ప కుమారుడు వెంకటరమణ(55) గత 30 ఏళ్ల క్రితం బెంగళూరు నగరానికి చేరుకుని లగేరిలో స్థిర పడ్డాడు. అతనికి భార్య వెంకటలక్ష్మి, కుమారుడు నటరాజ ఉన్నారు. బెంగళూరులో పెద్ద పెద్ద కాం ట్రాక్టు పనులు చేసుకుంటూ రియల్టర్‌గా ఎదిగాడు. ఈ క్రమంలో ఐదేళ్ల క్రితం మదనపల్లె సమీపంలోని వలసపల్లె పంచాయతీ ముంబయి–చెన్నై జాతీయ రహదారికి ఆనుకుని మూడు ఎకరాల భూమిని కొనుగోలు చేశాడు. ‘రియల్’ వ్యాపారం దెబ్బతినడంతో.. ఇటీవల కొంత కలంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం దెబ్బతినడంతో అప్పులు పెరిగాయి. రూ.కోటికి పైగా అప్పులు ఉన్నాయి. అందులో రూ.10 వడ్టీతో సగం తీర్చాడు. ఇంకా రూ.కోటి ఉండడంతో భాగస్వాములు, నలుగురు వడ్డీ వ్యాపారులు తరచూ వేధింపులకు దిగడంతో మదనపల్లెలో ఉన్న మూడు ఎకరాల భూమిని అమ్మి అప్పులు తీర్చాలని నిర్ణయించుకున్నాడు. భూమికి ధర రాక గత నెల 29న మదనపల్లెలో ఉన్న బంధువుల ఇంటికి వచ్చాడు. వెంట తెచు్చకున్న భూముల పత్రాలను స్థాని క వ్యాపారులకు చూపించి విక్రయించాలని చెప్పాడు. ఇక్కడ కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం దెబ్బతినడంతో వెంకటరమణ ఆశించిన ధర రాలేదు. అప్పు లు ఇచ్చిన వారి వేధింపులు అ«ధిక మవడంతో తీవ్ర మనస్తాపానికి గురయా్య డు. వారం రోజుల క్రితం మదనపల్లె ఆర్టీసీ బస్టాండుకు ఆనుకుని ఉన్న ఓ లాడ్జిలో గది తీసుకున్నాడు. గురువారం రాత్రి నీరుగట్టుపల్లె చౌడేశ్వరిదేవి ఆలయం దగ్గరున్న వ్యవసాయ పొలంలో మద్యంలో పురుగుల మందు కలుపుకుని తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉదయం బహిరూ్భమికి వెళ్లిన స్థానికు లు అక్కడ వెంకటరమణ చనిపోయి ఉండడాన్ని గమనించి టూటౌన్ పోలీ సులకు సమాచారం అందించారు. ఎస్ఐ గంగిరెడ్డి అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుని జేబులో ఉన్న సూసైడ్ నోట్, సెల్‌ఫోన్ ఆధారంగా బంధువులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
వడ్డీ వ్యాపారుల వేధింపులే కారణం
సంజీవరెడ్డినగర్,న్యూస్‌లైన్: రియల్టర్ అనిల్‌కుమార్ తన కుటుంబసభ్యులతో కలిసి ఆత్మహత్యాయత్నం చేయడానికి వడ్డీ వ్యాపారుల వేధింపులో కారణమని పోలీసులు నిర్ధారించారు. యూసుఫ్‌గూడలోని మార్గిహోటల్లో భార్య, ముగ్గురు పిల్లలతో కలిసి అనిల్‌కుమార్ గురువారం నిద్రమాత్రలు మింగి బలవన్మరణానికి యత్నించాడు. అతను అక్కడికక్కడే చనిపోగా.. భార్య, పిల్లలు ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న విషయం తెలిసిందే. హోటల్గదిలో మృతుడు రాసిన సూడైడ్నోట్ పోలీసులకు దొరికింది. రియల్ ఎస్టేట్ వ్యాపారం నిమిత్తం కొందరివద్ద అప్పులు చేశానని, రుణదాతల వేధింపులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నామని అందులో రాసి ఉంది. ముఖ్యంగా మంగిలాల్గాంధీ, కుమార్‌యాదవ్,రవి అనే వ్యాపారుల వేధింపులు తట్టుకోలేకే కుటుంబం సహా చనిపోతున్నానని అనిల్‌కుమార్ రాశాడు. పోలీసుల కథనం ప్రకారం...అనిల్‌కుమార్ తల్లి భారతి పేరుపై శ్రీనగర్‌కాలనీలో రూ.70 లక్షల విలువ చేసే ఇల్లు ఉంది. ఆ ఇంటి పేపర్లు బ్యాంకులో పెట్టి గతంలో రూ. 6 లక్షల అప్పు తీసుకున్నాడు. అప్పు తీర్చకపోవడంతో ఇల్లు వేస్తామని బ్యాంక్ అధికారులు నోటీసులు పంపారు. అనిల్ బల్కంపేటలో ఉండే తన స్నేహితుడు కుమార్‌కు ఈ విషయం చెప్పగా.. అతను బ్యాంక్‌లో డబ్బు చెల్లించి, ఇంటి పేపర్లు తన వద్దే ఉంచుకున్నాడు. కొద్దిరోజుల తర్వాత కుమార్.. అనిల్ తల్లిని బ్యాం క్కు తీసుకెళ్లి తన వద్ద ఉన్న ఇంటి పేపర్లు పెట్టి రూ. 25 లక్షల లోన్ తీసుకున్నాడు. ఈ అప్పు తీర్చకపోవడంతో వడ్డీతో కలిపి బాకీ మొత్తం రూ. 40లకు చేరింది. బ్యాంక్ నోటీసు రావడంతో అనిల్ ఈసారి స్థానిక వడ్డీవ్యాపారి మం గీలాల్ గాంధీని ఆశ్రయించాడు. అతను రూ. 40 లక్షలను బ్యాంక్‌లో చెల్లించి ఇంటి పేపర్లు తన వద్ద పెట్టుకున్నాడు. 12 శాతం వడ్డీతో కలిపి ఈ అప్పు రూ. 42 లక్షలు అయిందని, వెంటనే తిరిగి చెల్లించాలని, లేదా ఇల్లు తన పేర రాసి ఇవ్వాలని ఒత్తిడి చేశాడు. అంతేగాక ఆ ఇంట్లోని ఓ పోర్షన్‌ను ఆక్రమించాడు. మంగీ లాల్ మరింత వేధిస్తుండటంతో అనిల్ 3 నెలల క్రితం కూకట్‌పల్లిలో ఉన్న మరో ఇంటిని రూ. 30 లక్షలకు అమ్మేసి.. వచ్చిన డబ్బును మంగీ లాల్‌కు చెల్లించాడు. అయితే, మిగతా 12 లక్ష లు కూడా చెల్లించాలని అతను వే ధించసాగా డు. మంగిలాల్ తన వద్ద ఉన్న ఇంటిపేపర్ల సహాయంతో బంధువుల పేరుతో జీపీఏ చే యించాడు. ఇదిలా ఉండగా, అనిల్ మరో స్నే హితుడికి డబ్బు అవసరం కావడంతో తాను కష్టాల్లో ఉండి కూడా బాలానగర్‌కు చెందిన ఫైనాన్సర్ వద్ద రూ.2 లక్షల అప్పు ఇప్పించా డు. అప్పు తీసుకున్న స్నేహితుడు పరారీ కావడంతో వడ్డీతో కలిపి రూ.4 లక్షలు నీవే చెల్లించాలని రవి.. అనిల్‌ను వేధించాడు. భార్యతో పాటు మరికొందరు మహిళలను తీసుకొచ్చి అనిల్ ఇంటి వద్ద గొడవ చేయించేవాడు. ఈ నేపథ్యంలోనే జీవితంపై విరక్తి చెందిన అనిల్ కుటుంబసభ్యులందరితో కలిసి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈనెల 25న మార్గి హోటల్లో దిగి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. కాగా, ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న అనిల్ భార్య లావణ్య,కూతుళ్లు ఆలేఖ్య,అకిల,ఆకాశల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉం దని, ఎలాంటి ప్రాణాపాయంలేదని వైద్యులు శుక్రవారం వెల్లడించాడు.