Nataraja
-
మనుషులా? దెయ్యాలా?
మలయాళంలో సంచలనం సృష్టించిన ‘ఒరు ఆదార్ లవ్’ చిత్రం నూరిన్‌కి మంచి పేరు తీసుకొచ్చింది. ఈ చిత్రం తెలుగులో ‘లవర్స్ డే’ పేరుతో విడుదలైన సంగతి తెలిసిందే. మలయాళంలో బిజీగా ఉన్న నూరిన్ తెలుగులో చేస్తున్న తొలి చిత్రం ‘ఉల్లాలా ఉల్లాలా’. నటరాజ హీరోగా నటిస్తున్నారు. నటుడు సత్యప్రకాశ్ దర్శకత్వంలో సుఖీభవ మూవీస్‌పై ఎ.గురురాజ్ నిర్మిస్తున్న ఈ సినిమా దాదాపు పూర్తి కావొచ్చింది. సత్యప్రకాశ్ మాట్లాడుతూ– ‘‘రొమాంటిక్ ఎంటర్ౖటెనర్, థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న చిత్రమిది. ఈ సినిమాలో కనిపించే పాత్రలు నిజమైనవి కావు. వాళ్లు మనుషులా అంటే దెయ్యాలు. దెయ్యాలా? అంటే మనుషులు. ఇంతకీ దెయ్యాలా? మనుషులా? అంటే ఎవరూ కాదు. మా చిత్రంలో ఉన్నది లేదన్నట్టు.. లేనిది ఉన్నట్టు. ఈ సినిమాలో నూరిన్ పాత్ర చాలా కీలకం. తన గ్లామర్, నటనతో ఆమె తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టడం ఖాయం’’ అన్నారు. ‘‘రక్షకభటుడు, ఆనందం మళ్లీ మొదలైంది, లవర్స్ డే’ చిత్రాల తర్వాత మా బేనర్లో వస్తున్న సినిమా ‘ఉల్లాలా ఉల్లాలా. ఇలాంటి కాన్సెప్ట్‌లు చాలా అరుదుగా వస్తుంటాయి. సత్యప్రకాశ్‌కి నటునిగా ఎంత పేరుందో, దర్శకునిగా అంతకన్నా ఎక్కువ పేరు మా చిత్రం ద్వారా వస్తుంది’’ అన్నారు ఎ.గురురాజ్. ‘‘తెలుగులో చాలా అవకాశాలు వచ్చాయి. అయితే ‘ఉల్లాలా ఉల్లాలా’ కథ నచ్చడంతో వెంటనే ఓకే చెప్పేశాను. నా పాత్ర క్లాస్‌కు, మాస్కు నచ్చుతుంది’’ అన్నారు నూరిన్. ఈ చిత్రానికి సమర్పణ: ఎ.ముత్తమ్మ. -
సభాపతి నటరాజమూర్తి
ఆయన నటరాజు. ఆయన నాట్యం తాండవం. మామూలు దృష్టితో చూస్తే అది నృత్యవిశేషంగా అనిపిస్తుంది. కానీ ఆ నాట్యభంగిమలో ఎన్నో విశేషాలు దాగి ఉన్నాయి. అందుకే ఆయన కొలువుదీరిన చిదంబరం క్షేత్రానికి అంత విశిష్టత ఏర్పడింది. ఇది పంచభూతక్షేత్రాలలో చివరిది. ఆకాశలింగం అనే పేరుతో శూన్యాన్ని పూజిస్తారు. అక్కడ మూలరూపం శూన్యమే. శూన్యం నుండే సృష్టి మొదలైంది అనే తత్త్వానికి ప్రతినిధి స్వామివారు. ఆకాశం నుండి గాలి, గాలి నుండి నిప్పు, నిప్పు నుండి నీరు, నీటి నుండి భూమి, భూమి నుండి ఓషధులు పుట్టాయని సృష్టి క్రమాన్ని వేదాలు చెబుతున్నాయి. మనకు ఇక్కడ దర్శనమిచ్చేది స్వామి వారి ఉత్సవమూర్తి. ఆయన అక్కడ కనకసభలో కొలువుదీరి దర్శనమిస్తాడు. ఆ కనకసభనే పొన్నంబలం అని పిలుస్తారు. ఆయనే అక్కడి సభాపతి. ముప్పై మూడు కోట్ల దేవతలు ఆయన కోసం భూమి పైకి దిగి వచ్చి ఆయన ఆలయం కప్పుపై ఆకులుగా మారిపోయారు. నేటికి ఆలయంపై వాటిని చూడవచ్చు. స్వామిరూపం నృత్యం చేస్తున్న రీతిగా కనిపిస్తుంది. కుడిచేత అభయముద్ర, ఎడమ చేయి ఏనుగు తొండం వలె ఉంచి, వెనుక చేతిలో డమరుకం మ్రోగిస్తూ, మరో చేతిలో అగ్ని పట్టుకుని కుడిపాదాన్ని కొంచెం వంచి, ఎడమ పాదాన్ని ఎడమచేతివలె ముందుకు తీసుకు వచ్చి, పాదం కింద రాక్షసుడిని తొక్కుతూ ఉన్నట్లుంటుంది. ఆయనకు రెండువైపులా పతంజలి, వ్యాఘ్రపాదులవారు ఆయనను నిరంతరం సేవిస్తుంటారు. ఆయనకు ఎడమవైపు శివకామసుందరీదేవి నిలుచుని పద్మం ధరించి దర్శనమిస్తుంది. రూపంలో పరమేశ్వరుని పంచకృత్యాలను మనం దర్శించాలి. సృష్టి, స్థితి, సంహారం, తిరోధానం, అనుగ్రహం అనేవే పంచకృత్యాలు. ఆ చేతి డమరుక ధ్వనినుండి సంస్కృతభాషకు మూలమైన మాహేశ్వరసూత్రాలు ఆవిర్భవించాయి. అదే సృష్టి. ఆయన వంచిన పాదం స్థితికి ప్రతీక. ఆయన చేతిలోని అగ్ని సంహారం .చాచిన ఎడమకాలు తిరోధానం. ఆయన అభయహస్తం అనుగ్రహం. ఈ పంచకృత్యాలనే రహస్యాన్ని తెలుసుకుంటే చిదంబర రహస్యం తెలిసినట్టే. నటరాజస్వామివారి సప్తతాండవరూపాలు చాలా ప్రఖ్యాతి పొందాయి. ముఖ్యంగా ఊర్ధ్వ తాండవరూపం చాలా విశేషమైంది. పరమేశ్వరుడు నటరాజుగా అవతరించింది ఊర్ధ్వ తాండవ భంగిమలోనే. – డాక్టర్ ఛాయా కామాక్షీదేవి -
అప్పుల బాధతో రియల్టర్ ఆత్మహత్య
► రూ.కోటికిపైగా అప్పులున్నట్లు సూసైడ్ నోట్ ► భార్యాపిల్లల్ని వేధించవద్దని నోట్లో కోరిన మృతుడు మదనపల్లె క్రైం : అప్పుల బాధ తాళలేక బెంగళూరుకు చెందిన ఓ రియల్టర్ మదనపల్లెలో పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఆలస్యంగా శుక్రవారం వెలుగులోకి వచ్చిం ది. తనకు రూ.కోటికి పైగా అప్పులు ఉన్నట్లు మృతుడు సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు. తాను చనిపోయిన తరువాత సహచర భాగస్వాములు తన భార్యా పిల్లల్ని డబ్బుల కోసం వేధించవద్దని అందులో కోరాడు. మదనపల్లె టూ టౌన్ ఎస్ఐ గంగిరెడ్డి కథనం మేరకు.. వైఎస్ఆర్ కడప జిల్లా లక్కిరెడ్డిపల్లె మండలం గంగమ్మ జాతర ఈడిగపల్లెకు చెందిన తుమ్మల నాగప్ప కుమారుడు వెంకటరమణ(55) గత 30 ఏళ్ల క్రితం బెంగళూరు నగరానికి చేరుకుని లగేరిలో స్థిర పడ్డాడు. అతనికి భార్య వెంకటలక్ష్మి, కుమారుడు నటరాజ ఉన్నారు. బెంగళూరులో పెద్ద పెద్ద కాం ట్రాక్టు పనులు చేసుకుంటూ రియల్టర్‌గా ఎదిగాడు. ఈ క్రమంలో ఐదేళ్ల క్రితం మదనపల్లె సమీపంలోని వలసపల్లె పంచాయతీ ముంబయి–చెన్నై జాతీయ రహదారికి ఆనుకుని మూడు ఎకరాల భూమిని కొనుగోలు చేశాడు. ‘రియల్’ వ్యాపారం దెబ్బతినడంతో.. ఇటీవల కొంత కలంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం దెబ్బతినడంతో అప్పులు పెరిగాయి. రూ.కోటికి పైగా అప్పులు ఉన్నాయి. అందులో రూ.10 వడ్టీతో సగం తీర్చాడు. ఇంకా రూ.కోటి ఉండడంతో భాగస్వాములు, నలుగురు వడ్డీ వ్యాపారులు తరచూ వేధింపులకు దిగడంతో మదనపల్లెలో ఉన్న మూడు ఎకరాల భూమిని అమ్మి అప్పులు తీర్చాలని నిర్ణయించుకున్నాడు. భూమికి ధర రాక గత నెల 29న మదనపల్లెలో ఉన్న బంధువుల ఇంటికి వచ్చాడు. వెంట తెచు్చకున్న భూముల పత్రాలను స్థాని క వ్యాపారులకు చూపించి విక్రయించాలని చెప్పాడు. ఇక్కడ కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం దెబ్బతినడంతో వెంకటరమణ ఆశించిన ధర రాలేదు. అప్పు లు ఇచ్చిన వారి వేధింపులు అ«ధిక మవడంతో తీవ్ర మనస్తాపానికి గురయా్య డు. వారం రోజుల క్రితం మదనపల్లె ఆర్టీసీ బస్టాండుకు ఆనుకుని ఉన్న ఓ లాడ్జిలో గది తీసుకున్నాడు. గురువారం రాత్రి నీరుగట్టుపల్లె చౌడేశ్వరిదేవి ఆలయం దగ్గరున్న వ్యవసాయ పొలంలో మద్యంలో పురుగుల మందు కలుపుకుని తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉదయం బహిరూ్భమికి వెళ్లిన స్థానికు లు అక్కడ వెంకటరమణ చనిపోయి ఉండడాన్ని గమనించి టూటౌన్ పోలీ సులకు సమాచారం అందించారు. ఎస్ఐ గంగిరెడ్డి అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుని జేబులో ఉన్న సూసైడ్ నోట్, సెల్‌ఫోన్ ఆధారంగా బంధువులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
అంధకారంలో ఆశాదీపం
మన కోసం మనం బతకడం స్వార్థం. మనవాళ్ల కోసం మనం బతకడం ప్రేమ. సమాజం కోసం బతకడం గొప్పదనం. ఈ మూడోదే చేస్తున్నారు ప్రకాశం జిల్లాకు చెందిన తాడిగడప నటరాజ్. కొన్ని దశాబ్దాలుగా ఆయన సమాజం కోసమే జీవిస్తున్నారు! అనంతపురంలోని ఎస్వీ యూనివర్శిటీలో చదువుతున్నప్పుడు జరిగిన ఓ సంఘటన, నటరాజ్‌లో సామాజిక స్పృహను తట్టి లేపింది. ఆయన సోదరి కోటీశ్వరి రక్తదాన శిబిరంలో రక్తదానం చేసింది. అప్పట్లో ఆ విశ్వ విద్యాలయంలో రక్తదానం చేసిన ఏకైక విద్యార్థిని ఆమే. అప్పటి గవర్నర్ కుముద్‌బెన్ జోషి చేతుల మీదుగా ఓ సర్టిఫికేట్ కూడా పొందారామె. ఇదంతా దగ్గరుండి చూశారు నటరాజ్. అయితే సోదరికి వచ్చిన గుర్తింపు కంటే, ఆమె చేసిన రక్తదాన ం చుట్టూనే ఆయన ఆలోచనలు తిరిగాయి. ఆమె ఇచ్చిన రక్తం మరొకరిని కాపాడుతుందన్న ఆలోచన ఆయనలో స్ఫూర్తిని నింపింది. తాను కూడా రక్తదానం చేసి కొందరి ప్రాణాలను నిలబెట్టాలన్న నిర్ణయాన్ని ఆ క్షణమే తీసుకున్నారాయన. 1989లో తమిళనాడులోని వేలూరు వెళ్లినప్పుడు, బంగ్లాదేశ్‌కు చెందిన బేదార్ హుస్సేన్ అనే వ్యక్తికి తొలిసారి రక్తదానం చేశారు నటరాజ్. ఆ ఆస్పత్రిలో ‘రక్తం తయారుచేసే పరిశ్రమలు భూమిమీద లేవు. మానవ దేహం మాత్రమే తయారుచేయగలదు’ అని రాసివున్న బోర్డును చూశారు. ఇప్పటికీ ఆ మాటలు తన మనసులో మెదులుతూనే ఉన్నాయంటారాయన. ఇప్పటిదాకా మొత్తం 42 పర్యాయాలు రక్తదానం చేశారు. ఇతరులను కూడా రక్తదానం చేయమని ప్రోత్సహిస్తుంటారు. వాళ్ల ఊరికి చెందిన మరో 120 మందిని రక్తదాతలుగా మారేలా చేశారు. దీంతో వారి గ్రామానికి రక్తదాతల గ్రామంగా గుర్తింపు వచ్చింది. పాఠశాలలు, కళాశాలల్లో దాదాపు 50 కి పైనే రక్తదాన శిబిరాలను నిర్వహించారు నటరాజ్. ఈ సేవకుగాను 2010లో బెస్ట్ సిటిజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పురస్కారం, 2011లో ఆంధ్రరత్న అవార్డు అందుకున్నారు సినిమా నటుడు, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి చేతులమీదుగా సన్మానం జరిగింది. ప్రకాశం జిల్లా కలెక్టర్ నుంచి ఐదుసార్లు పురస్కారం అందుకున్నారు. ఒకవైపు రక్తదానంపై సమాజానికి శాయశక్తులా అవగాహన కల్పిస్తూనే, మరోవైపు నేత్రదానం పైనా ప్రచారం చేయడం మొదలుపెట్టారు నటరాజ్. చీకటిని తిట్టుకుంటూ కాలం గడిపే కంటే ఓ చిరుదివిటీని వెలిగిద్దామనే వివేకానందుని హితోక్తి నటరాజ్‌ని నేత్రదానం దిశగా కూడా నడిచేలా చేసిందంటారాయన. నేత్రదానమనగానే కళ్లను తీసేస్తారు అన్న భ్రమ చాలామందిలో ఉండటం గమనించిన నటరాజ్, కళ్లు తీసుకోవడమంటే కార్నియా మాత్రమే తీసుకుంటున్నారన్న వాస్తవాన్ని అందరికీ అర్థమయ్యేలా చేశారు. నేత్రదానం ఆవశ్యకతపై అవగాహన కల్పించారు. 36 నేత్రాలతో 72 మంది జీవితాల్లో కొత్త వెలుగులు నింపారు. ఓ రోజు రిమ్స్ డెరైక్టర్ డాక్టర్ అంజయ్య ఫోన్ చేసి... రక్త, నేత్రదానాలతో పాటు మానవ శరీర దానాలను కూడా చేపడితే బాగుంటుందని హితవు పలకడంతో, ఆ దిశగా కూడా ప్రచారం ప్రారంభించారు. నటరాజ్‌తో పాటు ఆయన భార్య కూడా అవయవదాన పత్రంపై సంతకం చేయడంతో మరో 20 మంది వారితో చేతులు కలిపారు. వీటితో పాటు పర్యావరణ పరిరక్షణ దిశగా కూడా అడుగులు వేస్తున్నారు నటరాజ్. వారి గ్రామంలోని ప్రధాన వీధిలో మొక్కలు నాటారు. అవి పెరిగి పెద్దవై, స్థానికులకు నీడనిస్తున్నాయి. సీఎఫ్ఎల్ బల్బుల వినియోగం, విద్యుత్ పొదుపు ఆవశ్యకతపైనా ప్రచారం చేపట్టారు. ఇలా సమాజానికి మేలు చేసే ఎన్నో అంశాలపై దృష్టి పెడుతూ, అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న నటరాజ్‌ని ఎంత అభినందించినా తక్కువే! - కొల్లూరి సత్యనారాయణ హైదరాబాద్