మనుషులా? దెయ్యాలా? | Noorin Shereef Set To Make Her Tollywood Debut | Sakshi
Sakshi News home page

మనుషులా? దెయ్యాలా?

Published Sat, Sep 28 2019 2:23 AM | Last Updated on Sat, Sep 28 2019 2:23 AM

Noorin Shereef Set To Make Her Tollywood Debut - Sakshi

మలయాళంలో సంచలనం సృష్టించిన ‘ఒరు ఆదార్‌ లవ్‌’ చిత్రం నూరిన్‌కి మంచి పేరు తీసుకొచ్చింది. ఈ చిత్రం తెలుగులో ‘లవర్స్‌ డే’ పేరుతో విడుదలైన సంగతి తెలిసిందే. మలయాళంలో బిజీగా ఉన్న నూరిన్‌ తెలుగులో చేస్తున్న తొలి చిత్రం ‘ఉల్లాలా ఉల్లాలా’. నటరాజ  హీరోగా నటిస్తున్నారు. నటుడు సత్యప్రకాశ్‌ దర్శకత్వంలో సుఖీభవ మూవీస్‌పై ఎ.గురురాజ్‌ నిర్మిస్తున్న ఈ సినిమా దాదాపు పూర్తి కావొచ్చింది. సత్యప్రకాశ్‌ మాట్లాడుతూ– ‘‘రొమాంటిక్‌ ఎంటర్‌ౖటెనర్, థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న చిత్రమిది. ఈ సినిమాలో కనిపించే పాత్రలు నిజమైనవి కావు. వాళ్లు మనుషులా అంటే దెయ్యాలు. దెయ్యాలా? అంటే మనుషులు. ఇంతకీ దెయ్యాలా? మనుషులా? అంటే ఎవరూ కాదు. మా చిత్రంలో ఉన్నది లేదన్నట్టు.. లేనిది ఉన్నట్టు.

ఈ సినిమాలో నూరిన్‌ పాత్ర చాలా కీలకం. తన గ్లామర్, నటనతో ఆమె తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టడం ఖాయం’’ అన్నారు. ‘‘రక్షకభటుడు, ఆనందం మళ్లీ మొదలైంది, లవర్స్‌ డే’ చిత్రాల తర్వాత మా బేనర్‌లో వస్తున్న సినిమా ‘ఉల్లాలా ఉల్లాలా. ఇలాంటి కాన్సెప్ట్‌లు చాలా అరుదుగా వస్తుంటాయి. సత్యప్రకాశ్‌కి నటునిగా ఎంత పేరుందో, దర్శకునిగా అంతకన్నా ఎక్కువ పేరు మా చిత్రం ద్వారా వస్తుంది’’ అన్నారు ఎ.గురురాజ్‌. ‘‘తెలుగులో చాలా అవకాశాలు వచ్చాయి. అయితే ‘ఉల్లాలా ఉల్లాలా’ కథ నచ్చడంతో వెంటనే ఓకే చెప్పేశాను. నా పాత్ర క్లాస్‌కు, మాస్‌కు నచ్చుతుంది’’ అన్నారు నూరిన్‌. ఈ చిత్రానికి సమర్పణ: ఎ.ముత్తమ్మ.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement