మాధురీ దీక్షిత్‌ కూడా చేశారుగా! | Anketa Maharana speech at Ullala Ullala movie | Sakshi
Sakshi News home page

మాధురీ దీక్షిత్‌ కూడా చేశారుగా!

Published Fri, Dec 27 2019 1:06 AM | Last Updated on Fri, Dec 27 2019 1:06 AM

Anketa Maharana speech at Ullala Ullala movie - Sakshi

అంకిత మహారాన

‘‘చుట్టూ ముప్పై, నలభై మంది ఉన్నప్పుడు రొమాంటిక్‌ సన్నివేశాలలో నటించడం అంత సులభం కాదు. కానీ, నటిగా ఎదగాలనుకున్నప్పుడు చేయక తప్పదు. అందుకు రెడీగా ఉండాలి. ఒకప్పుడు మాధురీ దీక్షిత్‌.. ప్రస్తుతం కంగనా రనౌత్‌ లాంటి వాళ్లు కూడా రొమాంటిక్‌ సన్నివేశాలు చేశారు’’ అని అంకిత మహారాన అన్నారు. నిశాన్, అంకిత మహారాన జంటగా నటించిన చిత్రం ‘ఊల్లాల ఊల్లాల’. నటుడు సత్య ప్రకాష్‌ దర్శకత్వం వహించారు. సుఖీభవ మూవీస్‌ పతాకంపై ఏ.  గురురాజ్‌ నిర్మించిన ఈ సినిమా జనవరి 1న విడుదల కానుంది. ఈ సందర్భంగా అంకిత మహారాన మాట్లాడుతూ– ‘‘నేను పుట్టింది బెల్గామ్‌లో. ఢిల్లీ, బెల్గామ్, బెంగళూరులలో చదువుకున్నాను. ఒరియా కుటుంబానికి చెందిన అమ్మాయిని.

మా నాన్న ఎయిర్‌ ఫోర్స్‌ ఉద్యోగి కావడంతో దేశంలో అనేక చోట్లకు వెళ్లా. తెలుగులో నా తొలి చిత్రం ‘4 లెటర్స్‌’.. ‘ఊల్లాల ఊల్లాల’ రెండోది. రొమాంటిక్‌ హారర్‌ మూవీ ఇది. నా పాత్ర కొంచెం అనుమానాస్పదంగా, అబ్బాయిలను భయపెట్టేదిగా ఉంటుంది. తెలుగు ఇండస్ట్రీ జాతీయ పరిశ్రమలా ఉంది. ఇక్కడ హీరోయి¯Œ కి మంచి గౌరవం ఇస్తారు. సత్య ప్రకాష్‌గారు సెట్స్‌లో అనేక విషయాలు చెప్పేవారు. గురురాజ్‌గారు కూడా నా పట్ల చాలా కేరింగ్‌గా ఉండేవారు. రామ్‌గోపాల్‌ వర్మ సార్‌ రెండు చిత్రాల్లో అవకాశం ఇచ్చారు. ‘నాకు శ్రీదేవిగారి నటన ఎంత ఇష్టమో, అంకిత నటన కూడా అంతే ఇష్టం’ అని ఆయన చెప్పడం మరచిపోలేను’’ అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement