satyaprakash
-
అయోధ్య రామమందిరానికి 400 కేజీల తాళం
అలీగఢ్ (యూపీ): అయోధ్యలో రామమందిరం కోసం అలీగఢ్‌కు చెందిన ఒక కళాకారుడు అరుదైన కానుకను రూపొందించాడు. చేతితో తాళాలు తయారు చేయడంలో సిద్ధహస్తుడైన సత్యప్రకాశ్ శర్మ రాముడి మందిరం కోసం ప్రత్యేకంగా 400 కేజీల తాళం తయారు చేశాడు. శ్రీరాముడికి వీరభక్తుడైన సత్యప్రకాశ్ ప్రపంచంలో చేత్తో తయారు చేసిన అతి పెద్ద తాళమని చెప్పారు. ఈ తాళం 10 అడుగుల ఎత్తు, 4.5 అడుగుల వెడల్పు, 9.5 అంగుళాల మందంతో ఉంది. తాళం చెవి నాలుగడుగుల పొడవుంది. సత్యప్రకాశ్ శర్మ కుటుంబం తరాలుగా ఈ తాళాల తయారీ వృత్తిలోనే ఉంది.ఈ ఏడాది మొదట్లో అలీగఢ్ ఎగ్జిబిషన్లో ఈ తాళాన్ని ఉంచారు. తాళం తయారు చేయడంలో తన భార్య రుక్మిణి కూడా సాయం చేశారని చెప్పారు. ఈ తాళం తయారీకి ఆయనకి రూ.2 లక్షల ఖర్చయింది. ఈ ఏడాది చివర్లో ఆయన ఈ తాళాన్ని శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కి సమరి్పస్తారు. -
వాస్తవాన్ని వెంటాడుతూ గతం చేసిన యుద్ధమే ‘వీరఖడ్గం’
శ్రుతి ఢాంగే ప్రధానపాత్రధారిగా, సత్యప్రకాష్, ఆనంద్ రాజ్ ఇతర ముఖ్య తారాగాణంగా నటించిన చిత్రం ‘వీరఖడ్గం’. ఎంఏ చౌదరి దర్శకత్వంలో కె. కోటేశ్వరరావు నిర్మించిన ఈ రివెంజ్ బ్యాక్‌డ్రాప్ చిత్రం మార్చి మొదటి వారంలో రిలీజ్ కానుంది. ‘‘వాస్తవాన్ని వెంటాడుతూ గతం చేసిన యుద్ధమే ఈ ‘వీరఖడ్గం’ చిత్రం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. బ్రహ్మానందం, మదన్, తపస్వి, అపూర్వ పృధ్వీరాజ్ కీ రోల్స్ చేసిన ఈ చిత్రానికి సంగీతం: షయాక్పార్వాజ్, మాటలు: ఘటికాచలం, లైన్ ప్రొడ్యూసర్: మారిశెట్టి సునీల్‌కుమార్. -
మా నాన్నగారు గర్వపడాలి
‘‘తెలుగులో ‘ఊల్లాల ఊల్లాల’ నా తొలి చిత్రం. మా నాటక గ్రూప్ హైదరాబాద్‌లోనూ ప్రదర్శనలు ఇచ్చింది. రాక్లై¯Œ వెంకటేష్‌గారు కన్నడలో నిర్మించిన చిత్రంతో నా ప్రయాణం మొదలుపెట్టా’’ అన్నారు నటరాజ్. సీనియర్ నటుడు సత్యప్రకాష్ దర్శకుడిగా తెరకెక్కించిన చిత్రం ‘ఊల్లాల ఊల్లాల’. నటరాజ్ హీరోగా ఏ.గురురాజ్ నిర్మించిన ఈ చిత్రం జనవరి 1న విడుదల కానుంది. నటరాజ్ మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంలో దర్శకుడుగా మారాలని తాపత్రయపడే యువకుడి పాత్ర చేశా. డబ్బు కోసం ఎలాంటి అమ్మాయినైనా పెళ్లి చేసుకోవాలనుకునే మనస్తత్వం హీరోది. కొన్ని సంఘటనల వల్ల నిజమైన ప్రేమకు అర్థం తెలుసుకుంటాడు. మా నాన్నగారికి (సత్యప్రకాష్) తెలుగులో మంచి పేరు ఉంది. ఆ పేరుకు ఇబ్బంది కలగకుండా మంచి నటుడిగా పేరు తెచ్చుకోవాలని ఉంది. నటరాజ్ నా కొడుకు అని మా నాన్న సంతోషంగా, గర్వంగా చెప్పు కోవాలి.. అందుకోసం కష్టపడతాను. ఈ సినిమాకు డైరెక్టర్ మా నాన్నగారే అయినప్పటికీ సెట్లో యాక్టర్‌గానే ఫోకస్ పెట్టాను’’అన్నారు. -
మాధురీ దీక్షిత్ కూడా చేశారుగా!
‘‘చుట్టూ ముప్పై, నలభై మంది ఉన్నప్పుడు రొమాంటిక్ సన్నివేశాలలో నటించడం అంత సులభం కాదు. కానీ, నటిగా ఎదగాలనుకున్నప్పుడు చేయక తప్పదు. అందుకు రెడీగా ఉండాలి. ఒకప్పుడు మాధురీ దీక్షిత్.. ప్రస్తుతం కంగనా రనౌత్ లాంటి వాళ్లు కూడా రొమాంటిక్ సన్నివేశాలు చేశారు’’ అని అంకిత మహారాన అన్నారు. నిశాన్, అంకిత మహారాన జంటగా నటించిన చిత్రం ‘ఊల్లాల ఊల్లాల’. నటుడు సత్య ప్రకాష్ దర్శకత్వం వహించారు. సుఖీభవ మూవీస్ పతాకంపై ఏ. గురురాజ్ నిర్మించిన ఈ సినిమా జనవరి 1న విడుదల కానుంది. ఈ సందర్భంగా అంకిత మహారాన మాట్లాడుతూ– ‘‘నేను పుట్టింది బెల్గామ్‌లో. ఢిల్లీ, బెల్గామ్, బెంగళూరులలో చదువుకున్నాను. ఒరియా కుటుంబానికి చెందిన అమ్మాయిని. మా నాన్న ఎయిర్ ఫోర్స్ ఉద్యోగి కావడంతో దేశంలో అనేక చోట్లకు వెళ్లా. తెలుగులో నా తొలి చిత్రం ‘4 లెటర్స్’.. ‘ఊల్లాల ఊల్లాల’ రెండోది. రొమాంటిక్ హారర్ మూవీ ఇది. నా పాత్ర కొంచెం అనుమానాస్పదంగా, అబ్బాయిలను భయపెట్టేదిగా ఉంటుంది. తెలుగు ఇండస్ట్రీ జాతీయ పరిశ్రమలా ఉంది. ఇక్కడ హీరోయి¯Œ కి మంచి గౌరవం ఇస్తారు. సత్య ప్రకాష్‌గారు సెట్స్‌లో అనేక విషయాలు చెప్పేవారు. గురురాజ్‌గారు కూడా నా పట్ల చాలా కేరింగ్‌గా ఉండేవారు. రామ్‌గోపాల్ వర్మ సార్ రెండు చిత్రాల్లో అవకాశం ఇచ్చారు. ‘నాకు శ్రీదేవిగారి నటన ఎంత ఇష్టమో, అంకిత నటన కూడా అంతే ఇష్టం’ అని ఆయన చెప్పడం మరచిపోలేను’’ అన్నారు. -
నన్ను సైకో సత్య అంటారు
‘‘ఇరవై ఐదేళ్ల క్రితం దర్శకుడిని అవ్వాలని ఇండస్ట్రీకి వచ్చాను. కానీ, దేవుడు నన్ను నట్టుణ్ణి చేశారు. ఇన్నేళ్లకు దర్శకత్వం చేసే అవకాశం వచ్చింది. ఈ సినిమా తర్వాత దర్శకుడిగా వరుస ఆఫర్స్ వస్తాయనుకుంటున్నాను’’ అన్నారు నటుడు, దర్శకుడు సత్యప్రకాశ్. ఆయన తనయుడు నటరాజ్ హీరోగా సత్యప్రకాశ్ తెరకెక్కించిన చిత్రం ‘ఊల్లాల ఊల్లాల’. నూరిన్, అంకిత కథానాయికలు. సుఖీభవ మూవీస్ పతాకంపై గురురాజ్ నిర్మించిన ఈ సినిమా జనవరి 1న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా సత్యప్రకాశ్ చెప్పిన విశేషాలు. ► డైరెక్టర్ రవిరాజా పినిశెట్టి దగ్గర పని చేద్దాం అని వెళ్తే విలన్ పాత్ర చేయించారు. ఆ తర్వాత మలయాళ దర్శకుడు ప్రియదర్శన్ కూడా నటించమని చెప్పారు. నా ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రమే. అందుకే విటమిన్ యం (మనీ) బాగా అవసరం కావడంతో నటుడిగా కొనసాగాను. దాదాపు భారతీయ భాషలన్నింట్లో సుమారు 530 సినిమాలు చేశాను. ►నా పేరు సత్యప్రకాశ్ అయినా నేను చేసిన పాత్రల ద్వారా నన్ను ‘సైకో సత్య, శాడిస్ట్ సత్య’ అని పిలుస్తుంటారు. అచ్చ తెలుగువాణ్ని అయినా నన్ను కన్నడ ప్రాంతానికి చెందినవాడు అనుకుంటుంటారు. ►గురురాజ్, నేనూ ఈ సినిమా తీయాలనుకున్నప్పుడు మా కథకు కొత్త కుర్రాడు కావాల్సి వచ్చింది. అలా మా అబ్బాయిని తీసుకున్నాం. వాడు ఆల్రెడీ కన్నడంలో ఓ సినిమా చేశాడు. మా అబ్బాయి నటరాజ్ ఇంజనీరింగ్ పూర్తి చేసి ఫైట్స్, డ్యాన్స్‌లో రెండేళ్లు శిక్షణ తీసుకున్నాడు. బయట తండ్రీకొడుకులం అయినా సెట్లో డైరెక్టర్, యాక్టర్స్లానే ఉంటాం. ►హారర్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే లవ్‌స్టోరీ ఇది. మనుషులు దెయ్యాలుగా.. దెయ్యాలు మనుషులుగా మారే కాన్సెప్ట్‌తో తెరకెక్కించాం. ఈ సినిమాలో భయం ఉండదు. నెక్ట్స్ ఏమవుతుంది? అనే సస్పెన్స్ ఉంటుంది. తరువాత ఏం జరగబోతోందని ప్రేక్షకులు ఊహించలేరు. అనుకు న్నదాని కంటే సినిమా బాగా వచ్చింది. నిర్మాత గురురాజ్ మంచి సహకారం అందించారు. ఈ సినిమాకు సగం దర్శకుడిలా ఉన్నారు. ఆయన ఓ మంచి పాత్రలో నటించారు. ►ప్రస్తుతం నా దగ్గర 14 కథలు ఉన్నాయి. అందులో 10 థ్రిల్లర్ జానర్‌కి సంబంధించినవే. ప్రస్తుతం థ్రిల్లర్ జానర్లో లేడీ ఓరియంటెడ్ సినిమా ప్లాన్ చేస్తున్నాను. -
ట్రైలర్ బాగుంది – రామ్‌గోపాల్ వర్మ
‘‘ఊల్లాల ఊల్లాల’ మేకింగ్ వీడియో చూసి ఆశ్చర్యపోయా. సత్యప్రకాష్లో ఇంత ప్రతిభ ఉందా? అనిపించింది. ఈ చిత్రం టీజర్, ట్రైలర్ చాలా బావున్నాయి. గురురాజ్‌కు ఈ సినిమా మంచి సక్సెస్ ఇవ్వాలి’’ అన్నారు డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ. నటరాజ్ హీరోగా, నూరిన్, అంకిత హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ఊల్లాల ఊల్లాల’. నటుడు సత్యప్రకాష్ దర్శకత్వం వహించారు. ఎ.గురురాజ్ నిరి్మంచిన ఈ సినిమా జనవరి 1న విడుదలకానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రం పాటలను రామ్‌గోపాల్ వర్మ విడుదల చేశారు. సత్యప్రకాష్ మాట్లాడుతూ– ‘‘మా అబ్బాయి నటరాజ్‌ని ఈ చిత్రంతో హీరోగా పరిచయం చేస్తున్నా. గురురాజ్‌తో జర్నీ చాలా ఆనందంగా ఉంది. ‘ఊల్లాల.. ఊల్లాల’ అనే టైటిల్ ఆయన ఆలోచనే. టైటిల్ బాగుందని వర్మగారు కూడా అన్నారు’’ అని చెప్పారు. ‘‘అన్ని వర్గాలవారినీ ఆకట్టుకునేలా మా సినిమా ఉంటుంది’’ అన్నారు గురురాజ్. ‘‘కొత్తవారితో సినిమా అంటే ఆరి్థక సమస్యలుంటాయి. కానీ, గురురాజ్ సినిమాను విడుదల చేస్తాడనే భరోసానే సత్యప్రకా‹Ùను నడిపించింది’’ అన్నారు నిర్మాత సి.కళ్యాణ్. ‘‘ఈ సినిమా అందరికీ నచ్చుతుంది’’ అన్నారు తెలంగాణ ఫిలించాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్. -
మనుషులా? దెయ్యాలా?
మలయాళంలో సంచలనం సృష్టించిన ‘ఒరు ఆదార్ లవ్’ చిత్రం నూరిన్‌కి మంచి పేరు తీసుకొచ్చింది. ఈ చిత్రం తెలుగులో ‘లవర్స్ డే’ పేరుతో విడుదలైన సంగతి తెలిసిందే. మలయాళంలో బిజీగా ఉన్న నూరిన్ తెలుగులో చేస్తున్న తొలి చిత్రం ‘ఉల్లాలా ఉల్లాలా’. నటరాజ హీరోగా నటిస్తున్నారు. నటుడు సత్యప్రకాశ్ దర్శకత్వంలో సుఖీభవ మూవీస్‌పై ఎ.గురురాజ్ నిర్మిస్తున్న ఈ సినిమా దాదాపు పూర్తి కావొచ్చింది. సత్యప్రకాశ్ మాట్లాడుతూ– ‘‘రొమాంటిక్ ఎంటర్ౖటెనర్, థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న చిత్రమిది. ఈ సినిమాలో కనిపించే పాత్రలు నిజమైనవి కావు. వాళ్లు మనుషులా అంటే దెయ్యాలు. దెయ్యాలా? అంటే మనుషులు. ఇంతకీ దెయ్యాలా? మనుషులా? అంటే ఎవరూ కాదు. మా చిత్రంలో ఉన్నది లేదన్నట్టు.. లేనిది ఉన్నట్టు. ఈ సినిమాలో నూరిన్ పాత్ర చాలా కీలకం. తన గ్లామర్, నటనతో ఆమె తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టడం ఖాయం’’ అన్నారు. ‘‘రక్షకభటుడు, ఆనందం మళ్లీ మొదలైంది, లవర్స్ డే’ చిత్రాల తర్వాత మా బేనర్లో వస్తున్న సినిమా ‘ఉల్లాలా ఉల్లాలా. ఇలాంటి కాన్సెప్ట్‌లు చాలా అరుదుగా వస్తుంటాయి. సత్యప్రకాశ్‌కి నటునిగా ఎంత పేరుందో, దర్శకునిగా అంతకన్నా ఎక్కువ పేరు మా చిత్రం ద్వారా వస్తుంది’’ అన్నారు ఎ.గురురాజ్. ‘‘తెలుగులో చాలా అవకాశాలు వచ్చాయి. అయితే ‘ఉల్లాలా ఉల్లాలా’ కథ నచ్చడంతో వెంటనే ఓకే చెప్పేశాను. నా పాత్ర క్లాస్‌కు, మాస్కు నచ్చుతుంది’’ అన్నారు నూరిన్. ఈ చిత్రానికి సమర్పణ: ఎ.ముత్తమ్మ. -
వింతలు...విశేషాలు
పదకొండు భాషల్లో దాదాపు ఐదొందల చిత్రాల్లో నటించిన సత్యప్రకాష్ తొలిసారి మెగాఫోన్ పట్టారు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఉల్లాల ఉల్లాల’. నటరాజ్, నూరిస్, అంకిత హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. గురురాజ్, సత్య ప్రకాష్ కీలక పాత్రలు చేస్తున్నారు. ఏ. గురురాజ్ నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ తుదిదశకు చేరుకుంది. సత్య ప్రకాష్ మాట్లాడుతూ– ‘‘ఇన్నేళ్ల నా కెరీర్లో నటుడిగా సంతృప్తిగా ఉన్నాను. దర్శకత్వం చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఈ సినిమాతో కుదిరింది. రొమాంటిక్ ఎంటర్టైనింగ్ చిత్రమిది. సినిమాలో చాలా వింతలు, విశేషాలు ఉన్నాయి. ఎవరూ ఊహించని రీతిలో ఈ సినిమా కథనం ఉంటుంది. గురురాజ్‌లాంటి నిర్మాత దొరకడం నా అదృష్టం’’ అన్నారు. ‘‘నటుడిగా సత్యప్రకాష్‌కు ఎంత ఫైర్ ఉందో దర్శకునిగా అంతే ఫైర్ ఉంది. ఈ సినిమా మాకు ఒక టర్నింగ్ పాయింట్ అవుతుంది. త్వరలోనే విడుదల చేస్తాం’’ అన్నారు గురురాజ్. ఈ సినిమాకు సంగీతం: జాయ్. -
ఒకరికి ఒకరు
మిషాల్ శైలేష్ జైన్, హేమలత జంటగా వి.ఎస్. ఫణీంద్ర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. శుక్రా ప్రొడక్షన్స్ పతాకంపై సంజీవ్ కుమార్ నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత సంజీవ్ కుమార్ కెమెరా స్విచ్చాన్ చేయగా, నటుడు సత్యప్రకాశ్ క్లాప్ ఇచ్చారు. నిర్మాత సంజీవ్ కుమార్ మాట్లాడుతూ– ‘‘ ఫణీంద్రగారు చెప్పిన కథ నచ్చడంతో సినిమా చేస్తున్నా. సత్యప్రకాశ్ మా సినిమాలో నటించడం చాలా సంతోషంగా ఉంది. చాలా మంచి సినిమా అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘ఒకరికొకరు అనుకునే ప్రేమలో ఒకరు పోతే మరొకరు అనే ధోరణి వచ్చింది. ఇలా ఎందుకు? అని ఆలోచించుకుని రాసుకున్న లవ్ అండ్ యాక్షన్ మూవీ ఇది. చక్కటి కథతో మంచి టీమ్‌తో చేస్తున్నా. ఈ చిత్రంలో సత్యప్రకాశ్గారిని కొత్త కోణంలో చూస్తారు. హర్ష ప్రవీణ్ మంచి సంగీతం అందించారు’’ అన్నారు వీఎస్ ఫణీంద్ర. ఈ చిత్రానికి కెమెరా: అలీ. -
పరిపూర్ణత సాధించలేం..
ద్వితీయ భాష విషయంలో పట్టుసాధించేది కొందరే.. మాతృభాషకు అనువుగానే మెదడు స్పందన ప్రపంచస్థాయి భాషా సదస్సుకు ఎంపికైన అమలాపురం వాసి నక్కా సత్యప్రకాష్ ‘‘మనిషి మెదడులోని ఐక్యూ మాతృభాషకు అనువుగా స్పందిస్తుంది. అందుకే ద్వితీయ భాషను మెదడు స్వీకరించేటప్పుడు మాతృభాష ప్రభావం పడుతోంది. ఈ కారణంగా ద్వితీయ భాష విషయంలో మనం పరిపూర్ణత సాధించలేం. చాలా కొద్దిమంది మాత్రమే ఇతర భాషలపై పట్టు సాధిస్తారు తప్ప, పరిపూర్ణతను సాధించలేరు’ అని చెబుతున్నారు అమలాపురానికి చెందిన నక్కా సత్యప్రకాష్. జర్మనీలో ప్రతిష్టాత్మకమైన గీస¯ŒS యూనివర్సిటీలో మార్చి 23 నుంచి 25 వరకు నిర్వహించే ప్రపంచ స్థాయి భాషా సదస్సుకు ఆయన ఎంపికయ్యారు. అక్కడ పేపర్ ప్రజంటేష¯ŒS చేయడంతోపాటు వర్క్‌షాపులో వక్తగా మాట్లాడనున్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో న్యూరో లింగిస్టిక్స్ విభాగంలో పీహెచ్డీ చేస్తున్న ఆయన దక్షణాది ప్రధాన భాషలు తెలుగు, తమిళం, కన్నడం, మళయాలం భాషలు, వారు రెండో భాషగా ఎంపిక చేసుకునే ఇంగ్లిష్‌పై కొన్నేళ్లుగా పరిశోధన చేస్తున్నారు. జర్మనీలో జరిగే ప్రపంచస్థాయి భాషా సదస్సుకు ఎంపికైన ఆయన ‘సాక్షి’తో తన పరిశోధనా అనుభవాలను పంచుకున్నారు. ఆ విషయాలు ఆయన మాటల్లోనే... – అమలాపురం ‘‘నా పరిశోధనలో కీలకాంశం మొదడు ఐక్యూపై మాతృభాష ప్రభావం ఎక్కువని గురించడమే. న్యూరో లింగిస్టిక్స్ రెండు రకాలు ఒకటి కాంప్రె¯Œ్స (ఎలా అర్థం చేసుకుంటున్నారు?) రెండు ప్రొడక్ష¯ŒS (ఎలా మాట్లాడతారు?) అనేవి రెండు విభాగాలు. వీటిలో బ్రోకాస్ ఏరియా, లెనికేస్ ఏరియా అని ఉంటుంది. దీని మీద పరిశోధనలు చాలా తక్కువ జరిగాయి. ఈ సబ్జెక్ట్ మీద నాకున్న ఆసక్తి నన్ను దీనిపై పీహెచ్డీ చేసేలా చేసింది. ∙నా పరిశోధన పూర్తి భిన్నం. ఒక విధంగా చెప్పాలంటే ఇప్పటి వరకు జరిగిన పరిశోధనాలకు నా పరిశోధన వ్యతిరేక దశలో సాగుతుంది. గతంలో చాలా మంది మాతృభాష పదాలను ఎక్కువగా వాడేవారు. ద్వితీయ భాష ఇంగ్లిష్ పదాల వాడుక తక్కువగా ఉండేది. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. మాతృభాషలో ఇంగ్లిష్ పదాలు ఎక్కువయ్యాయి. దీని వల్ల మాతృభాషపై ఇంగ్లిష్ ప్రభావం ఎలా ఉంటుందనే దానిపై పరిశోధన చేస్తున్నా. ∙భాషకీ భాషకీ మధ్య వైవిధ్యంలో తేడా ఉంటుంది. ఉదాహరణకు ‘వచ్చాడు’ అని మనం తెలుగులో అంటాం. కాని ఇంగ్లిష్‌లో అయితే ‘హీ కమ్’ అని అనాలి. అంటే ఇంగ్లిష్ మాటల్లో కర్త, క్రియలను వాడితేకాని పదం సంపూర్ణం కాదు. కాని తెలుగులో వచ్చాడు అని క్రియతో చెప్పేయవచ్చు. ఈ కారణంగానే మాతృ భాష తెలుగైన వారు ద్వితీయ భాష ఇంగ్లిష్ మాట్లాడేటప్పుడు తడబడతారు. మన తెలుగువారే కాదు. మాతృభాష ఒకటి, ద్వితీయ భాష మరొకటి అయినప్పుడు తడబాటు తప్పదు. ∙అమలాపురం ఎస్కేబీఆర్ కాలేజీలో డిగ్రీ, ఆంధ్రా యూనివర్సిటీలో ఎంఏ ఇంగ్లిష్ చదివా. 2014 ఆగస్టులో ఐఎస్ఎల్యూ ఇంగ్లిష్‌లో టాపర్‌గా నిలిచి, కాకినాడ ఆదిత్య విద్యాసంస్థల్లో సాఫ్ట్‌స్కిల్ హెడ్‌గా పనిచేశా. న్యూరో లింగిస్టిక్స్పై ఆసక్తితో ఉద్యోగం నుంచి తప్పుకుని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పీహెచ్డీ చేస్తున్నా. స్వతహాగా నాకు ఉపాధ్యాయ వృత్తి అంటే చాలా ఆసక్తి. వివిధ భాషల్లో నిష్ణాతులైన స్పీకర్లను కలవడం, వారి అనుభవాలను, హావభావాలను పరిశీలించడం ద్వారా న్యూరో లింగిస్టిక్స్ పరిశోధనలు సాగిస్తున్నాను. ∙మాతృభాషే కాదు.. ఇతర భాషలపై పట్టు సాధించాలంటే ఎల్ఎస్ఆర్డబ్ల్యూ విధానంలో కష్టపడాలి. ఎల్–లిజనింగ్ (వినడం), ఎస్–స్పీకింగ్ (మాట్లాడడం), ఆర్ –రీడింగ్ (చదవడం), డబ్ల్యూ–రైటింగ్ (రాయడం). ఎవరైతే ఈ విషయాల్లో కఠోరంగా కృషి చేస్తారో వారే భాషపై çపట్టు సాధిస్తారు. 30 ఏళ్లు పాఠశాలల్లో, కళాశాలల్లో ఇంగ్లిష్ బోధించిన అధ్యాపకులు, ఉపాధ్యాయులు వేగంగా ఇంగ్లిష్ మాట్లాడలేరంటే అందుకు వినడం, మాట్లాడకపోవడంలో శ్రద్ధ చూపకపోవడమే కారణం.