
నటరాజ్
‘‘తెలుగులో ‘ఊల్లాల ఊల్లాల’ నా తొలి చిత్రం. మా నాటక గ్రూప్ హైదరాబాద్‌లోనూ ప్రదర్శనలు ఇచ్చింది. రాక్‌లై¯Œ వెంకటేష్‌గారు కన్నడలో నిర్మించిన చిత్రంతో నా ప్రయాణం మొదలుపెట్టా’’ అన్నారు నటరాజ్. సీనియర్ నటుడు సత్యప్రకాష్ దర్శకుడిగా తెరకెక్కించిన చిత్రం ‘ఊల్లాల ఊల్లాల’. నటరాజ్ హీరోగా ఏ.గురురాజ్ నిర్మించిన ఈ చిత్రం జనవరి 1న విడుదల కానుంది. నటరాజ్ మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంలో దర్శకుడుగా మారాలని తాపత్రయపడే యువకుడి పాత్ర చేశా.
డబ్బు కోసం ఎలాంటి అమ్మాయినైనా పెళ్లి చేసుకోవాలనుకునే మనస్తత్వం హీరోది. కొన్ని సంఘటనల వల్ల నిజమైన ప్రేమకు అర్థం తెలుసుకుంటాడు. మా నాన్నగారికి (సత్యప్రకాష్) తెలుగులో మంచి పేరు ఉంది. ఆ పేరుకు ఇబ్బంది కలగకుండా మంచి నటుడిగా పేరు తెచ్చుకోవాలని ఉంది. నటరాజ్ నా కొడుకు అని మా నాన్న సంతోషంగా, గర్వంగా చెప్పు కోవాలి.. అందుకోసం కష్టపడతాను. ఈ సినిమాకు డైరెక్టర్ మా నాన్నగారే అయినప్పటికీ సెట్‌లో యాక్టర్‌గానే ఫోకస్ పెట్టాను’’అన్నారు.