
సత్య ప్రకాష్
పదకొండు భాషల్లో దాదాపు ఐదొందల చిత్రాల్లో నటించిన సత్యప్రకాష్ తొలిసారి మెగాఫోన్ పట్టారు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఉల్లాల ఉల్లాల’. నటరాజ్, నూరిస్, అంకిత హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. గురురాజ్, సత్య ప్రకాష్ కీలక పాత్రలు చేస్తున్నారు. ఏ. గురురాజ్ నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ తుదిదశకు చేరుకుంది. సత్య ప్రకాష్ మాట్లాడుతూ– ‘‘ఇన్నేళ్ల నా కెరీర్‌లో నటుడిగా సంతృప్తిగా ఉన్నాను.
దర్శకత్వం చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఈ సినిమాతో కుదిరింది. రొమాంటిక్ ఎంటర్‌టైనింగ్ చిత్రమిది. సినిమాలో చాలా వింతలు, విశేషాలు ఉన్నాయి. ఎవరూ ఊహించని రీతిలో ఈ సినిమా కథనం ఉంటుంది. గురురాజ్‌లాంటి నిర్మాత దొరకడం నా అదృష్టం’’ అన్నారు. ‘‘నటుడిగా సత్యప్రకాష్‌కు ఎంత ఫైర్ ఉందో దర్శకునిగా అంతే ఫైర్ ఉంది. ఈ సినిమా మాకు ఒక టర్నింగ్ పాయింట్ అవుతుంది. త్వరలోనే విడుదల చేస్తాం’’ అన్నారు గురురాజ్. ఈ సినిమాకు సంగీతం: జాయ్.
Comments
Please login to add a commentAdd a comment