గురురాజ్, కాసర్ల శ్యామ్, మంగ్లీ, ముత్తమ్మ, సత్య ప్రకాశ్
సీనియర్ నటుడు సత్య ప్రకాశ్ కుమారుడు నటరాజ్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘ఊల్లాల ఊల్లాల’. నూరిన్, అంకిత కథానాయికలు. ఎ. ముత్తమ్మ సమర్పణలో ఎ. గురురాజ్ నిర్మించిన ఈ చిత్రానికి సత్యప్రకాశ్ దర్శకుడు. ఈ చిత్రంలో ‘రామ్ రామ్..’ అనే పాటను పాడుతూ నటించటమే కాకుండా హీరోయిన్ నూరిన్కి డబ్బింగ్ చెప్పారు గాయని, నటి మంగ్లీ. ఆమెతో పాటు కమెడియన్ రఘుబాబు, ర్యాప్ సింగర్ రోల్ రైడా కూడా ఈ పాటకు గొంతు కలిపారు. మంగ్లీ మాట్లాడుతూ– ‘‘దర్శకుడు సత్యప్రకాశ్ను చిన్నప్పుడు విలన్గా చూసిన గుర్తుతో మొదట్లో భయపడ్డాను.
తర్వాత ఆయన తెరవెనక స్వభావం, తెలుగుపై ఆయనకున్న పట్టు చూసి ఆశ్చర్యపోయాను. రచయిత కాసర్ల శ్యామ్ రాసి, నేను పాడిన పాటలన్నీ హిట్ అవుతున్నాయి. ఈ సినిమా కూడా విజయం సాధిస్తుంది’’ అన్నారు. గురురాజ్ మాట్లాడుతూ– ‘‘మా చిత్రం జనవరి 1న విడుదలవుతుంది. ఈ మధ్య కాసర్ల శ్యామ్ రాసిన ‘అల.. వైకుంఠపురములో..’, ‘ఇస్మార్ట్ శంకర్’ పాటలు పెద్ద హిట్. అలాగే మా సినిమాలోని ‘రామ్ రామ్..’ పాట కూడా హిట్ అవుతుంది’’ అన్నారు. ‘‘నాకేం తెలుసో, తెలియదో అడక్కుండా ఈ సినిమాకి దర్శకత్వం చేసే చాన్స్ ఇచ్చిన మా నిర్మాత గురురాజ్ గారే ఈ సినిమాకు కర్త, కర్మ, క్రియ అన్నారు’’ సత్యప్రకాశ్.
Comments
Please login to add a commentAdd a comment