Noorin shereef
-
సహ నటుడిని పెళ్లి చేసుకున్న యంగ్ హీరోయిన్!
యంగ్ హీరోయిన్ పెళ్లి చేసుకుంది. తనతో పాటు కలిసి పనిచేసిన ఓ నటుడితో ప్రేమలో పడింది. కొన్ని నెలల ముందు నిశ్చితార్థం చేసుకుంది. ఫైనల్‌గా ఇప్పుడు గ్రాండ్ లెవల్లో జరిగిన వేడుకలో నిఖా చేసుకుంది. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలని స్వయంగా ఆ బ్యూటీనే ఇన్‌స్టాలో షేర్ చేసింది. దీంతో అవికాస్త ఇప్పుడు వైరల్‌గా మారిపోయాయి. (ఇదీ చదవండి: 'బేబీ' నటికి బెదిరింపులు.. చంపేస్తామంటూ!) ప్రియా ప్రకాశ్ వారియర్ 'లవర్స్ డే' (మలయాళంలో 'ఒరు అదార్ లవ్') అనే సినిమాతో తెలుగు వాళ్లకు పరిచయమైంది. అయితే ఆ మూవీలో మెయిన్ హీరోయిన్ నూరిన్ షరీఫ్. ఈమెకు పెద్దగా క్రేజ్ రాలేదు. దీంతో మలయాళంలో నటిగా స్థిరపడిపోయింది. డ్యాన్సర్‌గా కెరీర్ మొదలుపెట్టిన ఈమె 'చంక్జ్'తో నటిగా మారింది. ఒరు అదార్ లవ్, శాంతాక్రూజ్, వెళ్లప్పం, బర్ముడా, ఆన్ ద అదర్ హ్యాండ్ తదితర చిత్రాల్లోనూ నటించింది. అలా ఓ సినిమాకు పనిచేస్తున్న క్రమంలో యాక్టర్ కమ్ రైటర్ ఫహిమ్ సఫర్, నూరిన్ షరీప్‌కు పరిచయమైంది. కొన్నాళ్లకు ఫ్రెండ్స్ అయ్యారు. ఆ తర్వాత ప్రేమలో పడ్డారు. గతేడాది డిసెంబరులో పెద్దల అంగీకారంతో ఎంగేజ్మెంట్ చేసుకున్న ఈ జంట.. తిరువనంతపురంలో సోమవారం ఓ వెడ్డింగ్ హాల్లో నిఖా చేసుకున్నారు. వీళ్లకు పలువురు నటీనటులు శుభాకాంక్షలు చెబుతున్నారు. View this post on Instagram A post shared by AVALON WEDDINGS (@avalonweddings) View this post on Instagram A post shared by Decor Lab Events (@decorlabevents) View this post on Instagram A post shared by Noorin Shereef (@noorin_shereef_) (ఇదీ చదవండి: విడాకుల రూమర్స్.. బుర్ఖాలో కనిపించిన కలర్స్ స్వాతి!) -
రామ్.. రామ్.. హిట్
సీనియర్ నటుడు సత్య ప్రకాశ్ కుమారుడు నటరాజ్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘ఊల్లాల ఊల్లాల’. నూరిన్, అంకిత కథానాయికలు. ఎ. ముత్తమ్మ సమర్పణలో ఎ. గురురాజ్ నిర్మించిన ఈ చిత్రానికి సత్యప్రకాశ్ దర్శకుడు. ఈ చిత్రంలో ‘రామ్ రామ్..’ అనే పాటను పాడుతూ నటించటమే కాకుండా హీరోయిన్ నూరిన్‌కి డబ్బింగ్ చెప్పారు గాయని, నటి మంగ్లీ. ఆమెతో పాటు కమెడియన్ రఘుబాబు, ర్యాప్ సింగర్ రోల్ రైడా కూడా ఈ పాటకు గొంతు కలిపారు. మంగ్లీ మాట్లాడుతూ– ‘‘దర్శకుడు సత్యప్రకాశ్‌ను చిన్నప్పుడు విలన్‌గా చూసిన గుర్తుతో మొదట్లో భయపడ్డాను. తర్వాత ఆయన తెరవెనక స్వభావం, తెలుగుపై ఆయనకున్న పట్టు చూసి ఆశ్చర్యపోయాను. రచయిత కాసర్ల శ్యామ్ రాసి, నేను పాడిన పాటలన్నీ హిట్ అవుతున్నాయి. ఈ సినిమా కూడా విజయం సాధిస్తుంది’’ అన్నారు. గురురాజ్ మాట్లాడుతూ– ‘‘మా చిత్రం జనవరి 1న విడుదలవుతుంది. ఈ మధ్య కాసర్ల శ్యామ్ రాసిన ‘అల.. వైకుంఠపురములో..’, ‘ఇస్మార్ట్ శంకర్’ పాటలు పెద్ద హిట్. అలాగే మా సినిమాలోని ‘రామ్ రామ్..’ పాట కూడా హిట్ అవుతుంది’’ అన్నారు. ‘‘నాకేం తెలుసో, తెలియదో అడక్కుండా ఈ సినిమాకి దర్శకత్వం చేసే చాన్స్ ఇచ్చిన మా నిర్మాత గురురాజ్ గారే ఈ సినిమాకు కర్త, కర్మ, క్రియ అన్నారు’’ సత్యప్రకాశ్. -
వేదికపై ఏడ్చేసిన నటి
-
వేదికపై ఏడ్చేసిన నటి
కొన్ని సార్లు అభిమాల అత్యుత్సాహం సినీ ప్రముఖలకు ఇబ్బందిగా మారుతోందన్న సంగతి తెలిసిందే. తాజాగా ఇలాంటి అనుభవమే మలయాళ నటి నూరిన్ షెరీఫ్కు ఎదురైంది. మంజేరిలో ఓ సూపర్ మార్కెట్ ప్రారంభానికి వచ్చిన ఆమెను అభిమానులు చుట్టుముట్టారు. ఈ క్రమంలో ఆమె ముక్కుకు గాయమైంది. దీంతో బాధను భరించలేక ఆమె వేదికపైనే ఏడ్చేశారు. ఆ తర్వాత బాధను కంట్రోల్ చేసుకుంటూ అభిమానులను ఉద్దేశించి ప్రసంగించారు. అందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వివరాల్లోకి వెళితే.. నూరిన్ ఇటీవల ఓ సూపర్ మార్కెట్ ప్రారంభ కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే తొలుత నిర్వాహకులు కార్యక్రమం సాయంత్రం 4 గంటలకు ప్రారంభం అవుతుందని నూరిన్‌కు చెప్పారు. దీంతో ఆమె తన తల్లితో కలిసి నాలుగు గంటలకే హోటల్‌కు చేరుకున్నారు. కానీ ఆ కార్యక్రమ నిర్వాహకులు ఎక్కువ మంది హాజరయ్యేందుకు వీలుగా.. సాయంత్రం 6 గంటల వరకు హోటల్లోనే ఉండాలని నూరిన్‌ను కోరారు. అనంతరం నిర్వహకులు చెప్పిన సమయానికి నూరిన్ అక్కడికి చేరుకున్నారు. అయితే నూరిన్ ఆలస్యంగా వచ్చారని భావించిన అక్కడి జనాలు.. అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా నూరిన్పై తమ ఆగ్రహాన్ని ప్రదర్శించారు. పలువురు నూరిన్ కారును బాదడం మొదలుపెట్టారు. అసభ్య పదజాలంతో కూడా దూషించారు. నూరిన్ కిందికి దిగగానే ఓ వ్యక్తి చేయి నూరిన్ ముక్కుకు బలంగా తాకింది. ఈ ఘటనలో నూరిన్ ముక్కు లోపల గాయమైంది. దీంతో బాధను ఆపుకోలేక నూరిన్ స్టేజ్‌పైనే ఏడ్చేశారు. ఆ తర్వాత తన బాధను కంట్రోల్ చేసుకుంటూ ఆ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. కాసేపు ప్రశాంతంగా ఉండాలని జనాలను కోరారు. ఆలస్యంగా రావడంలో తన తప్పేమీ లేదని స్పష్టం చేశారు. కాగా, మలయాళంలో సంచలనం సృష్టించిన ‘ఒరు ఆదార్ లవ్’ చిత్రం నూరిన్‌కు మంచి పేరు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. -
మనుషులా? దెయ్యాలా?
మలయాళంలో సంచలనం సృష్టించిన ‘ఒరు ఆదార్ లవ్’ చిత్రం నూరిన్‌కి మంచి పేరు తీసుకొచ్చింది. ఈ చిత్రం తెలుగులో ‘లవర్స్ డే’ పేరుతో విడుదలైన సంగతి తెలిసిందే. మలయాళంలో బిజీగా ఉన్న నూరిన్ తెలుగులో చేస్తున్న తొలి చిత్రం ‘ఉల్లాలా ఉల్లాలా’. నటరాజ హీరోగా నటిస్తున్నారు. నటుడు సత్యప్రకాశ్ దర్శకత్వంలో సుఖీభవ మూవీస్‌పై ఎ.గురురాజ్ నిర్మిస్తున్న ఈ సినిమా దాదాపు పూర్తి కావొచ్చింది. సత్యప్రకాశ్ మాట్లాడుతూ– ‘‘రొమాంటిక్ ఎంటర్ౖటెనర్, థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న చిత్రమిది. ఈ సినిమాలో కనిపించే పాత్రలు నిజమైనవి కావు. వాళ్లు మనుషులా అంటే దెయ్యాలు. దెయ్యాలా? అంటే మనుషులు. ఇంతకీ దెయ్యాలా? మనుషులా? అంటే ఎవరూ కాదు. మా చిత్రంలో ఉన్నది లేదన్నట్టు.. లేనిది ఉన్నట్టు. ఈ సినిమాలో నూరిన్ పాత్ర చాలా కీలకం. తన గ్లామర్, నటనతో ఆమె తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టడం ఖాయం’’ అన్నారు. ‘‘రక్షకభటుడు, ఆనందం మళ్లీ మొదలైంది, లవర్స్ డే’ చిత్రాల తర్వాత మా బేనర్లో వస్తున్న సినిమా ‘ఉల్లాలా ఉల్లాలా. ఇలాంటి కాన్సెప్ట్‌లు చాలా అరుదుగా వస్తుంటాయి. సత్యప్రకాశ్‌కి నటునిగా ఎంత పేరుందో, దర్శకునిగా అంతకన్నా ఎక్కువ పేరు మా చిత్రం ద్వారా వస్తుంది’’ అన్నారు ఎ.గురురాజ్. ‘‘తెలుగులో చాలా అవకాశాలు వచ్చాయి. అయితే ‘ఉల్లాలా ఉల్లాలా’ కథ నచ్చడంతో వెంటనే ఓకే చెప్పేశాను. నా పాత్ర క్లాస్‌కు, మాస్కు నచ్చుతుంది’’ అన్నారు నూరిన్. ఈ చిత్రానికి సమర్పణ: ఎ.ముత్తమ్మ. -
మనుషులా? దెయ్యాలా?
ప్రతినాయకుడిగా తెలుగు ప్రేక్షకులను అలరించిన సత్యప్రకాష్ (‘పోలీస్ స్టోరీ’ ఫేమ్) దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ఉల్లాలా.. ఉల్లాలా’. ఈ చిత్రంతో ఆయన తనయుడు, కన్నడ హీరో నటరాజ్ తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయమవుతున్నారు. నూరిన్ షెరీఫ్, అంకిత మహారాణ, గురురాజ్ కీలక పాత్రలు చేస్తున్నారు. సుఖీభవ మూవీస్ పతాకంపై గురురాజ్ నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నటులు బెనర్జీ, అశోక్‌కుమార్ కెమెరా స్విచ్చాన్ చేయగా, డైరెక్టర్ తేజ క్లాప్ ఇచ్చారు. దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు. గురురాజ్ మాట్లాడుతూ– ‘‘రక్షక భటుడు, ఆనందం, లవర్స్ డే’ సినిమాలు విడుదల చేశాను. వాటి తర్వాత తెరకెక్కిస్తున్న సినిమా ‘ఉల్లాలా.. ఉల్లాలా’. సత్యప్రకాష్ చెప్పిన కాన్సెప్ట్ నచ్చింది. ఇలాంటి కథలు అరుదుగా వస్తాయి. పాత్రలన్నీ వైవిధ్యంగా ఉంటాయి’’ అన్నారు. ‘‘ఈ సినిమాకు వెన్నెముక గురురాజ్‌గారు. మా సినిమాలో కనిపించే పాత్రలు నిజమైనవి కావు. వాళ్లు మనుషులా అంటే దెయ్యాలు. దెయ్యాలా? అంటే మనుషులు. ఇంతకీ దెయ్యాలా? మనుషులా? అంటే ఎవరూ కారు. మా చిత్రంలో ఉన్నది లేదు, లేనిదే ఉన్నట్టు... ఒక వైవిధ్యమైన చిత్రమిది’’ అని సత్యప్రకాష్ అన్నారు. ‘‘మా నాన్న ఈ సినిమాకు దర్శకుడు అనే విషయం నాకు చాలా రోజుల వరకు తెలియదు. తీరా తెలిశాక నేను చేయగలనా? అని కాస్త సందేహించాను’’ అన్నారు నటరాజ్. అంకిత మహారాణ, నూరిన్ షెరీఫ్, సంగీత దర్శకుడు జాయ్, కెమెరామేన్ జె.జి.కృష్ణ తదితరులు మాట్లాడారు. పృథ్వీ, ‘అదుర్స్’ రఘు, లోబో, జ్యోతి, గీతాసింగ్, జయవాణి తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. -
ఆ ఫొటో కావాలి!
‘‘లవర్స్ డే’ చిత్రం విడుదలయ్యాక ఇక్కడ కూడా నన్ను గుర్తుపడుతున్నారు. ఒక కొత్త నటిగా నాకు సంతోషంగా ఉంది’’ అన్నారు కేరళ కుట్టి నూరిన్ షరీఫ్. ఒమర్ లులు దర్శకత్వంలో రోషన్ అబ్దుల్, ప్రియా ప్రకాష్ వారియర్, నూరిన్ షరీఫ్ ముఖ్యతారలుగా రూపొందిన మలయాళ చిత్రం ‘ఒరు ఆదార్ లవ్’. ఈ చిత్రం ‘లవర్స్ డే’గా తెలుగులో ఈ నెల 14న విడుదలైంది. ఈ సందర్భంగా నూరిన్ మాట్లాడుతూ– ‘‘నిజానికి ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు నా పాత్రకు మంచి ప్రాముఖ్యత ఉంది. ప్రియా ప్రకాష్ వింక్ ఎపిసోడ్, స్క్రిప్ట్ కొంచెం మారడం వంటి అంశాల వల్ల నా పాత్ర నిడివి తగ్గింది. దాంతో బాధ అనిపించింది. ప్రియా ప్రకాష్‌తో నాకు గొడవలు ఏం లేవు. తెలుగులో ఈ చిత్రాన్ని విడుదల చేసిన నిర్మాత గురురాజ్ బాగా హెల్ప్ చేశారు. ప్రేక్షకుల అభిరుచి మేరకు క్లైమాక్స్‌ను మార్చడం మంచి నిర్ణయమే అనిపించింది’’ అని అన్నారు. ఇంకా మాట్లాడుతూ– ‘‘చిన్నప్పుడు అల్లు అర్జున్‌గారి సినిమాలను టీవీలో చూశాను. అలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకున్నాను. ‘లవర్స్ డే’ వేడుకకు ఆయన అతిథిగా రావడం చాలా సంతోషంగా అనిపించింది. ఆయనతో ఓ ఫొటో దిగాను. ఆయన నన్ను చూసి నవ్వారు. ఆ స్మైల్ చాలు నాకు. ఆ ఫొటో ఎవరు తీశారో తెలుసుకుని తీసుకోవాలని ఉంది. ఒమర్ లులు దర్శకత్వంలోనే మరో సినిమా చేస్తున్నాను’’ అన్నారు నూరిన్ షరీఫ్. -
కన్నుగీటి.. నా కేరీర్ నాశనం చేసింది
సొగసుగా కన్నుకొట్టి.. కుర్రకారును తన వైపు తిప్పుకున్న ప్రియా ప్రకాష్ వారియర్ ఎంత పాపులారిటీ సంపాదించిందో తెలిసిందే. ఆ వీడియోతో రాత్రికి రాత్రి సెలబ్రిటీగా మారిపోయింది. అయితే ఈ వీడియోనే తన కేరీర్‌ను గందరగోళంలో పడేలా చేసిందని అంటోంది మరో హీరోయిన్. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ప్రియా వారియర్, నూరిన్ షెరిఫ్, రోషన్ హీరో హీరోయిన్లుగా నటించిన ‘ఒరు అడార్ లవ్’ రొమాంటిక్ మూవీని ‘లవర్స్ డే’ పేరుతో తెలుగులో ఫిబ్రవరి 14న విడుదల చేసిన విషయం తెలిసిందే. అన్నీ అనుకున్నట్లు జరిగి ఉంటే ఇప్పుడు ప్రియా వారియర్‌కు వచ్చిన ఇమేజ్ మొత్తం మరో భామ నూరిన్ షెరిఫ్ రావాల్సి ఉండేదట. ఈ విషయాలని నూరిన్ స్వయంగా ఓ ఇంటర్వూలో చెప్పింది. ప్రియా ప్రకాష్‌ని ఉద్దేశిస్తూ నూరిన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సంచలనంగా మారాయి. నిజానికి ముందుగా సినిమాలో లీడ్ క్యారెక్టర్‌గా నూరిన్‌ని అనుకున్నారట. కథ మొత్తం ఆమె చుట్టూ తిరిగేలా స్క్రిప్ట్ కూడా రాసుకున్నారట. కానీ, కన్నుకొట్టే సీన్‌తో ప్రియా ప్రకాష్ సెన్సేషనల్‌గా మారడంతో కథ మొత్తం మార్చేసి, ప్రియా పాత్రకు ప్రాధాన్యతనిస్తూ నూరిన్ రోల్ తగ్గించేశారట. ప్రియా వారియర్ సెన్సేషనల్‌గా మారిన తరువాత తనను పక్కన పెట్టారని వాపోయింది. ఆ కారణంగా ఎంతో ఆవేదనకు గురైనట్లు చెప్పింది. నిజానికి అంతా తనను సెకండ్ హీరోయిన్ అనుకుంటున్నారని, కానీ తానే సినిమాలో మొదటి హీరోయిన్ అని చెబుతుంది. చిత్ర హీరో రోషన్ అబ్దుల్‌తో మళ్లీ నటించాల్సి వస్తే ఆనందంగా ఒప్పుకొంటాను. ప్రియా వారియర్‌తో నటించాల్సి వస్తే ఒకటికి పదిసార్లు ఆలోచిస్తాను. వీలైనంత వరకు ఒప్పుకోకుండానే ఉంటాను. ఎందుకంటే నా కెరీర్‌ను ఆమె గందరగోళంలో పడేసింది అని నూరీన్ ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, విడుదలకు ముందే ఏ మళయాళ చిత్రానికి లేని క్రేజ్ ‘ఒరు అడార్ లవ్’కి ఏర్పడింది. కన్నుకొట్టిన వీడియోతో ప్రపంచ వ్యాప్తంగా క్రేజీ హీరోయిన్గా మారిన ప్రియా వారియర్ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. దీనికి తోడు ఈ మూవీ టీజర్లో ఘాటైన ముద్దు సన్నివేశాల్లో రెచ్చిపోయి నటించి సినిమాపై అంచనాలు పెంచేసింది ప్రియావారియర్. సినిమాలో విషయం లేకపోవడంతో ప్రేక్షకుల్ని నిరుత్సాహ పరిచింది. అయితే జరగాల్సిన నష్టం జరిగిపోయిన తరువాత ఈ మూవీ క్లైమాక్స్‌ని మార్చుతున్నట్టు అధికారికంగా ప్రకటించింది చిత్ర యూనిట్. ఈ చిత్రంలో క్లైమాక్స్ విషాదాంతంగా ముగుస్తుంది. దీన్ని మార్పు చేసి కొత్తగా సన్నిశాలని రీషూట్ చేసి యాడ్ చేయబోతున్నారట. 10 నిమిషాల పాటు ఉండే ఈ సన్నివేశం సినిమాకి హైప్ తీసుకువచ్చేదిగా ఉంటుందని యూనిట్ భావిస్తోంది.