నన్ను సైకో సత్య అంటారు | Actor Satya Prakash Bold interview On Ullala Ullala Movie | Sakshi
Sakshi News home page

నన్ను సైకో సత్య అంటారు

Published Tue, Dec 24 2019 12:27 AM | Last Updated on Tue, Dec 24 2019 8:41 AM

Actor Satya Prakash Bold interview On Ullala Ullala Movie - Sakshi

సత్యప్రకాశ్‌

‘‘ఇరవై ఐదేళ్ల క్రితం దర్శకుడిని అవ్వాలని ఇండస్ట్రీకి వచ్చాను. కానీ, దేవుడు నన్ను నట్టుణ్ణి చేశారు. ఇన్నేళ్లకు దర్శకత్వం చేసే అవకాశం వచ్చింది. ఈ సినిమా తర్వాత దర్శకుడిగా వరుస ఆఫర్స్‌ వస్తాయనుకుంటున్నాను’’ అన్నారు నటుడు, దర్శకుడు సత్యప్రకాశ్‌. ఆయన తనయుడు నటరాజ్‌ హీరోగా సత్యప్రకాశ్‌ తెరకెక్కించిన చిత్రం ‘ఊల్లాల ఊల్లాల’. నూరిన్, అంకిత కథానాయికలు. సుఖీభవ మూవీస్‌ పతాకంపై గురురాజ్‌ నిర్మించిన ఈ సినిమా జనవరి 1న రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా సత్యప్రకాశ్‌ చెప్పిన విశేషాలు.  

► డైరెక్టర్‌ రవిరాజా పినిశెట్టి దగ్గర పని చేద్దాం అని వెళ్తే విలన్‌ పాత్ర చేయించారు. ఆ తర్వాత మలయాళ దర్శకుడు ప్రియదర్శన్‌ కూడా నటించమని చెప్పారు. నా ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రమే. అందుకే విటమిన్‌ యం (మనీ) బాగా అవసరం కావడంతో నటుడిగా కొనసాగాను. దాదాపు భారతీయ భాషలన్నింట్లో సుమారు 530 సినిమాలు చేశాను.  

►నా పేరు సత్యప్రకాశ్‌ అయినా నేను చేసిన పాత్రల ద్వారా నన్ను ‘సైకో సత్య, శాడిస్ట్‌ సత్య’ అని పిలుస్తుంటారు. అచ్చ తెలుగువాణ్ని అయినా నన్ను కన్నడ ప్రాంతానికి చెందినవాడు అనుకుంటుంటారు.  

►గురురాజ్, నేనూ ఈ సినిమా తీయాలనుకున్నప్పుడు మా కథకు కొత్త కుర్రాడు కావాల్సి వచ్చింది. అలా మా అబ్బాయిని తీసుకున్నాం. వాడు ఆల్రెడీ కన్నడంలో ఓ సినిమా చేశాడు. మా అబ్బాయి నటరాజ్‌ ఇంజనీరింగ్‌ పూర్తి చేసి ఫైట్స్, డ్యాన్స్‌లో రెండేళ్లు శిక్షణ తీసుకున్నాడు. బయట తండ్రీకొడుకులం అయినా సెట్లో డైరెక్టర్, యాక్టర్స్‌లానే ఉంటాం.

►హారర్‌ బ్యాక్‌డ్రాప్‌లో సాగే లవ్‌స్టోరీ ఇది. మనుషులు దెయ్యాలుగా.. దెయ్యాలు మనుషులుగా మారే కాన్సెప్ట్‌తో తెరకెక్కించాం. ఈ సినిమాలో భయం ఉండదు. నెక్ట్స్‌ ఏమవుతుంది? అనే సస్పెన్స్‌ ఉంటుంది. తరువాత ఏం జరగబోతోందని ప్రేక్షకులు ఊహించలేరు. అనుకు న్నదాని కంటే సినిమా బాగా వచ్చింది. నిర్మాత గురురాజ్‌ మంచి సహకారం అందించారు. ఈ సినిమాకు సగం దర్శకుడిలా ఉన్నారు. ఆయన ఓ మంచి పాత్రలో నటించారు.

►ప్రస్తుతం నా దగ్గర 14 కథలు ఉన్నాయి. అందులో 10 థ్రిల్లర్‌ జానర్‌కి సంబంధించినవే. ప్రస్తుతం థ్రిల్లర్‌ జానర్‌లో లేడీ ఓరియంటెడ్‌ సినిమా ప్లాన్‌ చేస్తున్నాను.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement