పరిశీలకుడి పదవికి సుశీల్‌ రాజీనామా | Sushil Kumar Resigns as National Sports Observer for Wrestling | Sakshi
Sakshi News home page

పరిశీలకుడి పదవికి సుశీల్‌ రాజీనామా

Published Thu, Dec 7 2017 10:48 AM | Last Updated on Thu, Dec 7 2017 10:48 AM

Sushil Kumar Resigns as National Sports Observer for Wrestling

న్యూఢిల్లీ: ప్రముఖ రెజ్లర్, రెండు సార్లు ఒలింపిక్‌ పతక విజేత సుశీల్‌ కుమార్‌ జాతీయ క్రీడా పరిశీలకుడి (నేషనల్‌ స్పోర్ట్స్‌ అబ్జర్వర్‌) పదవికి రాజీనామా చేశాడు. పరస్పర విరుద్ధ ప్రయోజనాల (కాన్‌ఫ్లిక్ట్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌) దృష్ట్యా ప్రస్తుతం కెరీర్‌ కొనసాగిస్తున్న అథ్లెట్లు ఈ పదవిలో ఉండరాదని కేంద్ర క్రీడాశాఖ పేర్కొన్న నేపథ్యంలో సుశీల్‌ కుమార్‌ ఈ నిర్ణయం తీసుకున్నాడు.

మాజీ క్రీడా శాఖ మంత్రి విజయ్‌ గోయల్‌ ఈ ఏడాది మార్చిలో 12 మందితో కూడిన జాతీయ పరిశీలకుల బృందాన్ని నియమించారు. అందులో భారత దిగ్గజ మహిళా బాక్సర్‌ మేరీకోమ్‌ కూడా ఉంది. ఆమె కొద్ది రోజుల క్రితమే ఈ పదవికి రాజీనామా చేసింది. వీరిద్దరి రాజీనామాలను బుధవారం కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఆమోదించింది.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement